వైయస్ జగన్ నివాళి

హైదరాబాద్ : ఇంజినీరింగ్ రంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన భారతరత్న అవార్డు గ్రహీత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్మరించుకున్నారు. నేడు విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా వైయస్ జగన్  నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. Back to Top