చో రామస్వామి మృతికి సంతాపంగా వైయస్ జగన్ నివాళి

హైదరాబాద్ః సీనియర్ నటుడు, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామి(82) మృతికి సంతాపంగా వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ నివాళులర్పించారు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. చో రామస్వామి పూర్తి పేరు శ్రీనివాస అయ్యార్‌ రామస్వామి. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున 4:40గంటలకు తుది శ్వాస విడిచారు.

థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత పలు సినిమాల్లో నటించారు. 'మహ్మద్ బీన్ తుగ్లక్' నాటకంతో గుర్తింపు పొందారు. తుగ్లక్ పత్రిక స్థాపించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సలహాదారుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. 
Back to Top