ప‌శ్చిమగోదావరిలో వైయ‌స్ జ‌గ‌న్ పర్య‌ట‌న‌

వైయస్ జగన్ టూర్ షెడ్యూల్
పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటన
పొగాకు రైతులతో సమావేశం
చిన్నారావు కుటుంబసభ్యులకు పరామర్శ

ప‌శ్చిమ‌గోదావ‌రిః  వైయస్సార్సీపీ అధ్య‌క్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రెండు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు జిల్లాలో పొగాకు రైతులతో సమావేశమై వారి సాధకబాధలు తెలుసుకుంటారు. 

జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం వైయస్ జగన్ తొలుత ఉడ్రాజవరం చేరుకుంటారు. అక్కడ ఇటీవల చనిపోయిన వైయ‌స్సార్‌సీపీ సీనియ‌ర్ నేత బూరుగుప‌ల్లి చిన్న‌ారావు కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శిస్తారు. అనంత‌రం బుట్టాయ‌గూడెం చేరుకొని అక్క‌డ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు తెల్లం బ‌ల‌రాజు ఇంట్లో బ‌స చేయ‌నున్నారు. 

బుధ‌వారం ఉద‌యం బుట్టాయ‌గూడెం నుంచి జంగారెడ్డిగూడెం చేరుకొని అక్క‌డ పొగాకు బోర్డును సంద‌ర్శిస్తారు. అక్క‌డి రైతుల స‌మ‌స్యలను తెలుసుకున్న అనంత‌రం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల ప్రాంతంలో కుక్కునూరు వెళ్ల‌నున్నారు. అక్క‌డ పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసితులు, జేఏసీ ఆధ్వ‌ర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షా శిబిరాన్ని సంద‌ర్శించి, వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటారు. అక్క‌డి నుంచి రాత్రికి తూర్పుగోదావ‌రి జిల్లాకు వైయ‌స్ జ‌గ‌న్ బయలుదేరుతారు. 
Back to Top