వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌

విశాఖ‌ప‌ట్నం) ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టిస్తున్నారు. బంగాళాఖాతం మీదుగా ప్ర‌యాణిస్తున్న విమానం గ‌ల్లంతైన సంఘ‌ట‌న‌లో విశాఖ న‌గ‌రానికి చెందిన 9మంది గ‌ల్లంత‌య్యారు. ఈ ఉద్యోగుల ఆచూకీ తెలియ‌క కుటుంబ‌స‌భ్యులు తీవ్రంగా ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆద‌రించి, అండ‌గా ఉండ‌టం జ‌న నేత వైయ‌స్ జ‌గ‌న్ కు అల‌వాటు. 
మ‌ధ్యాహ్నం 12.10 కి విశాఖ‌ప‌ట్నం చేరుకొంటారు. అక్క‌డ మొద‌ట‌గా 104 ఏరియాలో భూపేంద్ర‌సింగ్ ఇంటికి చేరుకొంటారు. బుచ్చిరాజుపాలెంలో ఎన్‌. చిన్నారావు ఇంటికి వెళ్లి కుటుంబ స‌భ్యుల్ని ప‌ల‌క‌రిస్తారు. త‌ర్వాత గోపాల‌ప‌ట్నం లో పి. నాగేంద్ర‌రావు ఇంటికి వెళ‌తారు. అనంత‌రం వేప‌గుంట లో జి శ్రీనివాస‌రావు కుటుంబాన్ని, అప్ప‌న్నపాలెంలో బీ సాంబ‌మూర్తి కుటుంబాన్ని, మాధ‌వ‌ధార లో ఆర్వీ ప్ర‌సాద్ రావు కుటుంబ‌స‌భ్యుల్ని ప‌ల‌కరిస్తారు. ఆయా బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతారు.
అనంతరం రాత్రి నేరుగా హైద‌రాబాద్ కు బ‌య‌లుదేర‌తారు.
Back to Top