వైయ‌స్ జ‌గ‌న్ నేటి టూర్ షెడ్యూల్‌

పులివెందుల‌) ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ఈ రోజు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం దాకా క్యాంపు కార్యాల‌యంలో స్థానికుల‌కు అందుబాటులో ఉంటారు. ప్ర‌జ‌ల నుంచి విన‌తిప‌త్రాలు స్వీక‌రిస్తారు. మ‌ధ్యాహ్నం సింహాద్రిపురం మండ‌లం చెర్లోప‌ల్లి లో ఎంపీ నిధుల‌తో ఏర్పాటు చేసిన వాట‌ర్ ప్లాంట్ ను ఆయ‌న ప్రారంభిస్తారు. త‌ర్వాత తొండూరు వెళ్లి అక్క‌డ వేరుశ‌న‌గ పొలాల్ని ప‌రిశీలిస్తారు. స్థానిక   రైతుల‌తో మ‌మేకం అయి, సాధ‌క బాధ‌కాల్ని తెలుసుకొంటారు. త‌ర్వాత తొండూరు మండ‌లం మ‌ల్లేల లో మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు. సాయంత్రం స్థానిక ఇమాంబి ద‌ర్గా లో ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రు అవుతారు. 
Back to Top