నేడు వైయస్ జగన్‌ పర్యటన షెడ్యూల్

గుంటూరు(పట్నంబజారు) : ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ వరద బాధితులకు అండగా  గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.  దాచేపల్లి, గురజాల మండలాల్లో పర్యటిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ తెలిపారు. 

()ఉదయం 10 గంటలకు దాచేపల్లి మండలం పొందుగల చేరుకొని అక్కడ నుంచి దాచేపల్లి, ముత్యాలంపాడు గ్రామాల్లో వరద వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శిస్తారు.
()  అనంతరం దాచేపల్లిలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ కాలనీల్లో వరదకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడతారు.  కాటేరు వాగును కూడా జగన్‌ పరిశీలిస్తారు.
()ఆ తర్వాత గురజాల మండలం చేరుకుని జంగమహేశ్వరపురం, చర్లగుడిపాడు గ్రామాల్లో వరదకు దెబ్బతిన్న పంటలను, మిర్యాలగూడలో కూడా జగన్‌ పర్యటించి బాధితుల్ని పరామర్శిస్తారని రాజశేఖర్‌ వివరించారు.
Back to Top