పులివెందుల లో వైయ‌స్ జ‌గ‌న్ టూర్ షెడ్యూల్‌

పులివెందుల‌) ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ రెండు రోజుల పాటు వైయ‌స్సార్ జిల్లా పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న టూర్ షెడ్యూల్ ను ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి విడుద‌ల చేశారు. ఉద‌యం తాత వైయ‌స్ రాజారెడ్డి ఘాట్ కు చేరుకొని అక్క‌డ వ‌ర్థంతి సంద‌ర్బంగా నివాళులు అర్పిస్తారు. అనంతరం రిటైర్డ్ ఇంజ‌నీరు శివ నారాయ‌ణ రెడ్డి ఇంటిని సంద‌ర్శిస్తారు. అనంత‌రం వైయ‌స్సార్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన ప్రార్థ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.
మ‌ధ్యాహ్నం సింహాద్రిపురం మండ‌లం కోవ‌రగుంట గ్రామంలో పార్టీ యువ‌నేత శివారెడ్డి కుటుంబ స‌భ్యుల్ని ప‌ల‌క‌రిస్తారు. అనంత‌రం బ‌ల‌పనూరు గ్రామ ఉప‌స‌ర్పంచ్ అమ‌రావ‌తి, రాజ‌గోపాల్ రెడ్డి దంప‌తుల్నిప‌రామ‌ర్శిస్తారు. చ‌వ్వారిప‌ల్లె గ్రామానికి చేరుకొని అక్క‌డ అనారోగ్యంతో బాధ ప‌డుతున్న పార్టీ నాయ‌కుడు కిశోర్ రెడ్డిని ప‌రామ‌ర్శిస్తారు. త‌ర్వాత పులివెందుల కు చేరుకొని క్రిస్టియ‌న్ లైన్ లోని పార్టీ నాయ‌కుడు రాజా కుటుంబ స‌భ్యుల్ని ప‌ల‌క‌రిస్తారు. నగరి గుట్ట‌లో పార్టీ నాయ‌కులు శేఖ‌ర్ రెడ్డి కుటుంబ స‌బ్యుల్ని ప‌ర‌మార్శిస్తారు. 
మంగ‌ళ‌వారం ఉద‌యం 8.30 నుంచి మ‌ధ్యాహ్నం దాకా క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటారు. నియోజ‌క వ‌ర్గ  ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రిస్తారు. మధ్యాహ్నం పులివెందుల మండ‌లం అచ్చ‌వెళ్లి చేరుకొని మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ విద్యార్థి విభాగం నేత హ‌రీష్ కుమార్ యాద‌వ్ కుటుంబ స‌భ్యుల్ని ఆప్యాయంగా ప‌ల‌క‌రించ‌నున్నారు.

Back to Top