వైఎస్ జగన్ బుధవారం నాడు టూర్ షెడ్యూల్

పులివెందుల) ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం నాడు
పులివెందుల నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలంలో
వివిధ గ్రామాల్ని ఆయన సందర్శిస్తున్నారు.

సిద్ధారెడ్డిగారి పల్లె తో ఆయన పర్యటన మొదలవుతోంది. అప్పుల బాధతో ఆత్మహత్య
చేసుకొన్న రైతు మోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. పార్టీ నాయకుడు మోక్ష
రంగారెడ్డి కుమారుడు ఓంకార్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. ఆ కుటుంబాన్ని
పలకరిస్తారు. ఇటీవల చనిపోయిన లక్ష్మీనారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.

తర్వాత నెర్సుపల్లె పంచాయతీ పరిధిలోని దేవరగుట్టపల్లె చేరుకొంటారు. మారెళ్లమడక
సింగిల్ విండో డైరక్టర్ సుబ్బన్న కొడుకు వెంకటక్రిష్ణ దంపతుల్ని ఆశీర్వదిస్తారు.
అదే గ్రామానికి చెందిన నాగప్రసాద్ దంపతుల్ని ఆశీర్వదిస్తారు. ఇటీవల చనిపోయిన
వెంకటసుబ్బయ్య, గోపాల్, ఓబయ్య కుటుంబాల్ని ఆయన పలకరిస్తారు. తర్వాత పార్టీ
నాయకులు,  మాజీ సర్పంచ్ లక్ష్మీదేవమ్మ
మరణించటంతో ఆ కుటుంబాన్ని పలకరిస్తారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనలో
నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటారని చక్రాయిపేట మండల
జడ్పీటీసీ, పార్టీ కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 

Back to Top