వైఎస్ జ‌గ‌న్ టూర్ షెడ్యూల్‌

పులివెందుల‌) ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ రెండు రోజుల పాటు సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఉద‌యం బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొంటున్నారు. వేంప‌ల్లె లోని వృష‌భాచ‌లేశ్వ‌ర‌స్వామి క‌ళ్యాణ‌మండ‌పంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొంటారు. అనంత‌రం పులివెందుల మండ‌లం ఎర్రిప‌ల్లె గ్రామానికి చేరుకొంటారు. అక్క‌డ వైఎస్సార్సీపీ నాయ‌కుడు సర్వోత్త‌మ్ రెడ్డి మేన‌ల్లుడు కిశోర్ కుమార్ రెడ్డి కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శిస్తారు. బుధ‌వారం చ‌క్రాయ‌పాలెం మండ‌లంలో జ‌న నేత వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌టిస్తారు. సిద్ధారెడ్డి గారి ప‌ల్లె, దేవ‌ర‌గట్టు పాలెం ల‌లో ప‌ర్య‌టిస్తారు. అక్క‌డ కొంద‌రు నూత‌న వ‌ధూ వ‌రుల్ని ఆశీర్వ‌దిస్తారు. స్థానికంగా ఉండే నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో మ‌మేకం అవుతారు. 
Back to Top