వైయస్ఆర్ జిల్లాలో జననేత పర్యటన

వైయ‌స్ఆర్ జిల్లా))  ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌ వైయ‌స్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.  పులివెందుల మండలం వెంకటాపురం గ్రామంలో  తిమ్మానాయుడు కుటుంబ సభ్యులను ప‌రామ‌ర్శించారు. మధ్యాహ్నం వరకు క్యాంపు కార్యాలయంలో  వైయస్ జగన్ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత ముద్దనూరు చేరుకుని వైయ‌స్సార్‌సీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ముద్దనూరులోని అమ్మవారిశాలకు చేరుకుని దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శనం చేసుకొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

గురువారం ఉదయం  పులివెందుల అమ్మవారిశాలకు చేరుకుని దసరా ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం  కడపకు చేరుకొంటారు. పార్టీ నాయకులు మాసీమ బాబు అన్న యల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించనున్నట్లు ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. 
Back to Top