వైయస్‌ జగన్‌ పర్యటన విజయవంతం చేయాలి

సరుబుజ్జిలిః వైయస్‌ఆర్‌సిపీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనేత వైయస్‌జగన్మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర హైపవర్‌ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంశధార నిర్వాసితులకు పరిహారం అందించక, పునరావాసం కల్పించకుండా తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నిర్వాసితుల కన్నీళ్లు తుడవడానికి హిరమండలానికి విచ్చేస్తున్న జగనన్నకు ఘనస్వాగతం పలికేందకు.... ఆమదాలవలస నియోజకవర్గం పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు సరుబుజ్జిలి జంక్షన్‌ వైయస్‌ఆర్‌ విగ్రహం వద్దకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top