సోమవారంనాడు విశాఖ జిల్లా పర్యటన


హైదరాబాద్: ఈ నెల 18న వైయ‌స్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. 
విశాఖ‌ప‌ట్నం జిల్లా పాల్మ‌న్‌పేట‌లో వైయ‌స్సార్‌సీపీ కార్య‌క‌ర్త‌లు, మ‌త్స్య‌కారుల‌పై టీడీపీ నేత‌లు ఇటీవ‌ల దాడులు చేసిన నేప‌థ్యంలో బాధితుల‌ను ప‌రామర్శించ‌నున్నారు. మ‌త్స్యకారులతో వైయ‌స్ జగన్ మాట్లాడి వారికి భరోసా కల్పించనున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఇతర పార్టీ నాయకులతో వైయస్ జగన్
కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ పర్యటన ఖరారు అయింది. టీడీపీలో చేరడం లేదన్న కారణంతో తమపై దాడి చేశారని వైయ‌స్సార్ సీపీ కార్యకర్తలు, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్థారణ కమిటీ ఇదివరకే పాల్మన్ పేట గ్రామాన్ని సందర్శించి బాధితుల్ని పరామర్శించింది.
Back to Top