రైతు భ‌రోసా యాత్ర నేటినుంచి..!

తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటన

 అనంతపురం: ప‌్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ నేటి నుంచి అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించునున్నారు. క‌ష్టాల క‌డ‌లిలో కూరుకుపోయిన రైతు కుటుంబాల్ని ఆద‌రించి, భ‌రోసా క‌ల్పించేందుకు రైతు భ‌రోసా యాత్రను సంక‌ల్పించారు. అయిదో విడ‌త భ‌రోసా యాత్ర‌లో జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ తాడిప‌త్రి, క‌దిరి నియోజ‌క వ‌ర్గాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.

 పంటలు పండక, అప్పుల ఊబిలో కూరుకుపోయి, సర్కారు చేయూత లేక  అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క అనంత‌పురం జిల్లాలోనే 145 మంది రైతులు, 26 మంది చేనేత కార్మికులు తనువు చాలించారు. కష్టాల్లోనే కడతేరుతున్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన  ప్రభుత్వం చోద్యం చూస్తోంది.

ఈ నేపథ్యంలో నేనున్నానంటూ అన్నదాతల్లో భరోసా కల్పించేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. రెతు భరోసా యాత్ర’ పేరుతో ఇప్పటికే అనంతపురం జిల్లాలో నాలుగు విడతల్లో పర్యటించారు. 12 నియోజకవర్గాల్లో 70 రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించారు. మొద‌టి రోజున మూడు కుటుంబాలను పరామర్శించనున్నారు. 


Back to Top