త్వరలో ఏజెన్సీలో వైయస్ జగన్ పర్యటన

తూర్పుగోదావరిః ఏజెన్సీలో గిరిజనుల మరణాలకు ప్రభుత్వమే కారణమని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. తక్షణమే ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాల్లో పౌష్టికాహార కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మృతి చెందిన గిరిజనుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. త్వరలో ఏజెన్సీలో వైయస్ జగన్ పర్యటిస్తారని కన్నబాబు తెలిపారు. 
Back to Top