వైయస్ జగన్ ఉభయగోదావరి జిల్లా పర్యటన వాయిదా

హైదరాబాద్) ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. ఈనెల 15న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పోల‌వ‌రం ప్రాజెక్టు ముంపు మండ‌లాలైన కుక్కునూరు,వేలేరు పాడు మండ‌లాల్లో ప్ర‌జ‌ల క‌ష్టాలు స్వ‌యంగా తెలుసుకోవ‌డానికి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారైంది. అలాగే 16న తూర్పు గోదావ‌రి జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించాల్సి ఉంది అయితే అనివార్య కార‌ణాల వ‌ల్ల జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌య్యింద‌ని, ఆయా ప్రాంతాల‌లో తిరిగి ఎప్పుడు ప‌ర్య‌టించేది త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. 
Back to Top