టాప్ టెన్ .. పవర్ ఫుల్ కామెంట్స్

గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించే ముందు ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ..అక్కడకు  తరలి వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని పవర్ ఫుల్ కామెంట్స్ కొన్ని..
  1. చంద్రబాబు ఎన్నికలప్పుడు ఒక మాట.. ఎన్నికల తర్వాత మరో మాట చెబుతూ ప్లేట్ ఫిరాయిస్తూ ఉంటారు.
  2. ప్రత్యేకహోదా ఇస్తామంటూ చంద్రబాబు, బీజేపీలు కలిసికట్టుగా రాష్ట్రాన్ని విడగొట్టాయి
  3. కేసుల భయంతో ప్రధానమంత్రి దగ్గర ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబు
  4. పట్టిసీమ నుంచి పోలవరం దాకా, బొగ్గు నుంచి ఇసుక దాకా అంతా అవినీతిమయమే
  5. మన వాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ గొప్పగా మాట్లాడిన చంద్రబాబు
  6. సోనియాతో కుమ్మక్కై చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసులు పెట్టించిన చంద్రబాబు
  7. రాష్ట్రాన్ని విడగొట్టడానికి వ్యతిరేకించి నిలబడిన పార్టీ వైఎస్సార్సీపీ అని చెప్పుకొనేందుకు గర్విస్తున్నా
  8. చంద్రబాబు పాలన అంతా మూడే మూడు పదాలు మోసం..మోసం..మోసం
  9. ఈ ప్రభుత్వం త్వరలోనే బంగాళాఖాతంలో కలవటం ఖాయం
  10. విద్యార్థుల తరపున ఎంత దాకా అయినా పోరాటానికి సిద్ధం
Back to Top