తాడిపత్రిలో వైయస్ జగన్

అనంతపురం(తాడిపత్రి):  ప్రతి పక్ష నాయకుడు, వైయస్సార్‌సీసీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఐదో విడత రైతు భరోసాయాత్ర రెండో రోజు కొనసాగుతోంది.  వైయస్ జగన్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉదయం పెద్ద ఒడుగూరు మండలం పెద్దమేడిమాకులపల్లి నుంచి ఆయన రోడ్డు షో ప్రారంభమైంది. లక్ష్మింపల్లిలో ప్రజలు తమ అభిమాన నేతకు  ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా  వైయస్ జగన్ వారికి అభివాదం చేశారు.

అనంతరం జననేత  కిష్టిపాడు చేరుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు.   అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  యాడికి మండలం నగురూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శించనున్నారు.

Back to Top