పవార్ తో వైఎస్ జగన్ బృందం

ఢిల్లీః అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న చంద్రబాబు అప్రజాస్వామిక రాజకీయాలకు నిరసనగా ఢిల్లీలో వైఎస్సార్సీపీ సేవ్ డెమోక్రసీ పేరుతో పోరాటం కొనసాగిస్తోంది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బృందం ఇవాళ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత, మాజీ మంత్రి శరద్ పవార్ ను కలుసుకుంది.


ఢిల్లీలో శరద్ పవార్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలకు పచ్చకండువా కప్పి పార్టీలోకి తీసుకుంటున్న పరిస్థితులను వైఎస్ జగన్ పవార్ కు  వివరించారు. చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పేరుతో ముఖ్యమంత్రి అవినీతిపై ముద్రించిన పుస్తకం కాపీని వైఎస్ జగన్ శరద్ పవార్ కు అందించారు.  

Back to Top