అవివేకంగా మాట్లాడొద్దు..!

గుంటూరుః ఏపీకి ప్రత్యేకహోదాను సాధించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి గుంటూరు నల్లపాడు రోడ్డులో నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నారు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేరుగ నాగార్జున తదితరులు దీక్షాస్థలిని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. దీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. 

ఈసందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ....టీడీపీ నేతలు ప్యాకేజీలు పంచుకోవడానికే హోదాను విస్మరించారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజల మనోభవాలను తెలిపేందుకే వైఎస్ జగన్ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. విజయనగరం విమానాశ్రయం వద్ద వైఎస్ జగన్ కు భూములున్నాయని టీడీపీ నేతలు అవివేకంగా మాట్లాడుతున్నారని బొత్స  అన్నారు. జగన్ కు సెంటు భూమి ఉందని నిరూపించినా రాజకీయంగా దేనికైనా సిద్ధమని బొత్స సవాల్ విసిరారు. నిరూపించకపోతే టీడీపీ నేతలు తమ భూములను పేదలకు పంచుతారా అని ప్రశ్నించారు. 
Back to Top