వైఎస్ జగన్ ను కలిసిన ఉక్కు కర్మాగారం సాధన సమితి నేతలు

 హైదరాబాద్ : వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపన కోసం జరుగుతున్న
పోరాటానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సంఘీభావం
ప్రకటించారు. ఇందుకోసం క్రషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో
రూపొందించిన పునర్విభజన చట్టంలో ఈ కర్మాగారం స్థాపన విషయాన్ని పొందు పరిచారు.
రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి దాకా ఆ ఊసే లేదు. దీని మీద ఒత్తిడి తీసుకొని
రావాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ఈ విషయాన్ని గాలికి వదిలేశారు.

        ఉక్కు కర్మాగారం కోసం
పోరాడుతున్న స్టీల్ ప్లాంట్ సాధన సమితి (ఎస్‌పిఎస్‌ఎస్) నేతలు   వైఎస్
జగన్‌  ని కలిశారు. వెనుకబడిన ప్రాంతమైన
రాయలసీమలో ఈ కర్మాగారం స్థాపించాల్సిన అవశ్యకత గురించి ఆయనకు వివరించారు. ఈ మేరకు
వైఎస్ జగన్‌కు సమితి నేతలు ఓ వినతిపత్రం  సమర్పించారు.  ఈ పోరాటానికి ఆయన
మద్దతు ప్రకటించారు.


To read this article in English:    http://goo.gl/jB7ASz 

 

Back to Top