మీ న్యాయపోరాటానికి అండగా ఉంటాః వైయస్ జగన్

వైయస్సార్ కడప : అగ్రిగోల్డ్ బాధితుల న్యాయపోరాటానికి అండగా ఉంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. పులివెందులలో అగ్రిగోల్డ్ బాధితులు కొద్దిసేపటి క్రితం వైయస్ జగన్ తో సమావేశమయ్యారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను వెంటనే విక్రయించి తమకు చెల్లించేలా టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు వైయస్ జగన్ ను  విజ్ఞప్తి చేశారు. ఈనేపథ్యంలో వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు.

Back to Top