రైతుల ఆందోళనలకు వైఎస్ జగన్ మద్దతు

హైదరాబాద్ః పంటల బీమా కోసం వైఎస్సార్ జిల్లా రైతులు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లో ఇన్సూరెన్స్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మద్దతు పలికారు. 2012-13 పంటల బీమా మంజూరు చేయకపోవడంపై  నిరసన తెలిపారు. 55 వేల మంది పై చిలుకు ప్రీమియం చెల్లిస్తే కేవలం 29 వేల మందికి మాత్రమే ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లింపులు చేసి, మిగిలిన వారికి ఎగ్గొట్టడం అన్యాయమని వైఎస్ జగన్ మండిపడ్డారు.

Back to Top