ఆక్వా ఫుడ్‌ బాధితులకు అండగా

()పశ్చిమలో వైయస్ జగన్ పర్యటన
()ఆక్వాఫుడ్ బాధితులను పరామర్శించనున్న జననేత

పశ్చిమగోదావరిః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.   భీమవరం మండలంలోని తుందుర్రు, బేతపూడి, జొన్నలగరువు తదితర ప్రాంతాల్లో పర్యటించి మెగా ఆక్వాఫుడ్ బాధితులను పరామర్శిస్తారు.  ఆక్వాఫుడ్ పార్క్  నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలకు అండగా నిలిచి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు.  మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.  కాగా, బాధిత గ్రామాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఇప్పటికే పర్యటించింది. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన  బృందం అక్కడి పరిస్ధితులను అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వివరించింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ.. జననేత వైయస్‌ జగన్‌ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏఆపద వాటిల్లినా, అన్యాయాలు, అక్రమాలు జరిగినా వారికి న్యాయం జరిగేవరకు వారి పక్షాన పోరాడుతున్నారన్నారు. అటువంటి ప్రజాధరణ కలిగిన వైయస్ జగన్ కు  మనమంతా అండగా నిలబడాలన్నారు. ఎమ్‌ఎల్‌సీ మేకా శేషుబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజులు మాట్లాడుతూ బహిరంగ సభకు ప్రతి కార్యకర్త, శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. 

రెండున్నర సంవత్సరాలుగా తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు ఆక్వా పుడ్‌ పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. కాలుష్యం వల్ల వేలాది ఎకరాలు రొయ్యల చెరువులు, చేపల చెరువులు దెబ్బతింటాయని భవిష్యత్‌లో భూగర్భ జలాలు పాడై తాగడానికి కూడా నీరు దొరకని పరస్థితి ఏర్పడుతుందని ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం  ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా తుందురు గ్రామంలో 144 సెక్షన్‌ విదించి నియంత పాలన సాగిస్తోంది. పిల్లలు స్కూళ్లకు వెళ్లకుండా, ఇంటిపెద్దలను జైళ్లకు పంపించి, ఆడవాళ్లను వేధించి ప్రభుత్వం హింసాయత పాలన సాగిస్తోంది. తుందుర్రు గ్రామ ప్రజలు బయటకు వెళ్లాలంటే ఏదో ఒక గుర్తింపు కార్డు పోలీసులకు చూపించి బయటకు వెళ్లే దుస్థితి నెలకొంది. 


తాజా ఫోటోలు

Back to Top