రైతులకు వైయస్‌ జగన్‌ పరామర్శకర్నూలు: నకిలీ విత్తనాలతో మోసపోయి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ ముగ్గురు రైతులను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ని, అండ‌గా ఉంటామ‌ని ఆయ‌న ధైర్యం చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ రైతులు  ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయంపై చ‌లించిపోయారు. ఈ మేర‌కు పార్టీ నేతలతో ఆరా తీశారు. అనంత‌రం ఫోన్‌ చేసి బాధితులతో మాట్లాడారు. తక్షణమే నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలని ప్రతిపక్ష నేత డిమాండు చేశారు. అవసరమైతే తర్వాత విత్తన కంపెనీల నుంచి ప్రభుత్వం రికవరీ చేసుకోవచ్చు అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం స్పందించకపోతే అధికారంలోకి రాగానే రైతులకు చెల్లించాల్సిన పరిహారం ఇస్తామని, రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భరోసా కల్పించారు.

రౌడీషీట్లు తెరిచారంటూ వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు
నకిలీ నార కారణంగా పంట నష్టపోయామని అప్పట్లో ధర్నా చేశామని, నార నకిలీదని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారని రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌కు తెలిపారు. ఎకరాకు రూ.91వేలు చెల్లించేలా కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారని, కాని చెల్లింపులు జరగలేదన్నారు. కంపెనీల యజమానులు కోర్టుకు వెళ్లి కలెక్టర్‌ ఉత్తర్వులు కొట్టేయించుకున్నారని, ఈ విషయాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డికి నాలుగుసార్లు నివేదించామని, మరో మంత్రి దేవినేని ఉమకి రెండుసార్లు విన్నవించామని, గత ఏడాది అసెంబ్లీకి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేదుని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఇప్పుడు చలో అసెంబ్లీకి నిర్ణయించుకున్నామన్నారు. అయితే తమపై రౌడీషీట్లు తెరిచారంటూ వైఎస్‌ జగన్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. 
 

ఏడాది ఓపిక ప‌ట్టండి..
వైయ‌స్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం తరఫున రూ.2.30 కోట్లు చెల్లిస్తామని వైయ‌స్ జ‌గ‌న్ రైతుల‌కు హామీ ఇచ్చారు. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. ఆ చెల్లింపులన్నీ వెంటనే చేస్తాం అని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని తన మాటగా నష్టపోయిన రైతులకు చెప్పాలన్నారు. అఘాయిత్యాలకు పాల్పడి కుటుంబాల్లో కన్నీళ్లు నింపొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే...  రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేయడంపై వైయ‌స్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top