హైదరాబాద్) చనిపోయిన వారి పేరుని, దివంగతనేతల పేర్లను వివాదాల్లోకి లాగవద్దని ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ హితవు పలికారు. అనంతపురం నగరంలో మిస్సమ్మ భూముల వివాదం లో దివంగత మహానేత వై ఎస్సార్ ఫేరుని వివాదాస్పదం చేయటంపై ఆయన మండిపడ్డారు. దీనికి సంబంధించి సీఐడీ దర్యాప్తు జరుగుతోందని ప్రభుత్వమే లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిందని చదివి వినిపించారు. ఈ నెలాఖరు నాటికి దర్యాప్తు నివేదిక వస్తుందని తెలిపారని, అటువంటప్పుడు సభలో వివాదాస్పద ప్రకటనలు చేయటం తగదని హితవు పలికారు. అనంతపురం నగరంలో జరిగిన వ్యవహారం లో దివంగత మహానేత వైఎస్సార్ కు ఏరకంగా సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తుల మీద బురద చల్లటం తగని పని అని అభిప్రాయ పడ్డారు. తర్వాత కూడా టీడీపీ పక్షం నుంచి ప్రభాకర్ చౌదరి, మంత్రి పల్లె దాడిని కొనసాగించారు.