నైతికతకు పెద్ద పీట

హైదరాబాద్ : విశ్వసనీయులకు సరైన స్థానం కల్పిస్తామని సంకేతం ఇచ్చేందుకే
విజయసాయిరెడ్డి ని రాజ్యసభ సీటు కోసం ప్రతిపాదిస్తున్నట్లు వైయస్సార్సీపీ
అధ్యక్షులు వైయస్ జగన్ ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలు,
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశం తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ
సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ మనుషుల మధ్య సంబంధాలను డబ్బుతో కొనాలని చంద్రబాబు
యత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు ఇవాళ చేస్తున్న రాజకీయాలు దుర్మార్గమైనవని ఆయన
మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు అదే ఎమ్మెల్యేలను నట్టేట
ముంచుతున్నారని విమర్శించారు.ఒక్క మాట కోసం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. పార్టీ ఎలాంటి
సందర్భాల్లో పుట్టుకొచ్చిందో అందరికీ తెలుసన్నారు. సాయిరెడ్డి విలువలకు
కట్టుబడ్డారని, తనకు వ్యతిరేకంగా చెప్పమని ఆయనపై ఒత్తిడి
తెచ్చారని వైఎస్ జగన్ అన్నారు.  కానీ సాయిరెడ్డి సత్యాన్ని నమ్ముకున్నారని, వాస్తవాలనే చెప్తానని స్పష్టం చేశారన్నారు. అందుకే తనపై కేసుల సందర్భంగా ఆయనను
కూడా నిందితుడిగా చేర్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా
సాయిరెడ్డి నైతిక విలువలకు కట్టుబడి, అండగా ఉన్నారన్నారు.  

 

తాజా ఫోటోలు

Back to Top