అంబేద్కర్ పేరు వాడుకోవటం దారుణం: వైఎస్ జగన్

హైదరాబాద్) కాల్ మనీ సెక్సు
రాకెట్ కుంభకోణం మీద చర్చను మళ్లించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును
వాడుకొంటున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. సెక్సు రాకెట్ లో
మహిళల్ని లొంగదీసుకొని 200 పైగా వీడియో టేపులు తీశారని, ఇంతటి దారుణమైన
వ్యవహారాన్ని దారి మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇందుకు అంబేద్కర్
పేరుని వాడుకొంటున్నారని ఆయన నిలదీశారు. హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహానికి
పాలాభిషేకం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో అజెండా లో
లేకపోయినప్పటికీ అంబేద్కర్ సేవల మీద చర్చ జరుపుదామంటూ పక్కదారి పట్టించే ప్రయత్నం
చేస్తున్నారని అన్నారు. అయిదు రోజుల అసెంబ్లీలో రోజంతా ఈ విషయం మీద చర్చిద్దాం
అంటున్నారని, కానీ ఇదే ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతి, వర్థంతి, రాజ్యాంగం ఆమోదించిన
రోజున కానీ ఏమీ మాటలాడలేదని గుర్తు చేశారు. స్టేట్ మెంట్ పేరుతో చంద్రబాబు కుట్రలు
చేస్తున్నారని మండిపడ్డారు. 

Back to Top