ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసినవాడిని

  • ఆ కుటుంబాలు పడుతున్న బాధ వర్ణనాతీతం
  • రక్షణరంగం విమానాలు నడుపుతున్న తీరు బాధాకరం
  • ఘటన జరిగినప్పుడు మాత్రమే రియాక్ట్ అవ్వడం దారుణం
  • ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోవాలి
  • ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలి
  • విమాన బాధిత కుటుంబాలకు వైయస్ జగన్ పరామర్శ

విశాఖపట్నంః విమానం గల్లంతైన ఘటనలో ఆ కుటుంబాలు పడుతున్న బాధ వర్ణనాతీతమని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు.  ఆ బాధ, టార్చర్ ఏవిధంగా ఉంటుందో స్వయంగా అనుభవించానని కళ్లు చెమర్చుతూ అన్నారు. ప్రతీ సంవత్సరం విమాన ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇటీవల ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతైన సంఘటనకు సంబంధించి విశాఖపట్నంలో వైయస్ జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ  ఏమన్నారంటే....

వైయస్ జగన్ మాటల్లోనే..

  • ఇక్కడ  కుటుంబాలు పడుతున్న బాధను అందరికన్నాఎక్కువగా అర్థం చేసుకోగల వ్యక్తిని నేను.
  • ఆ రోజు కూడా నాన్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే ఎక్కడ ఉందో ఆచూకీ తెలియని పరిస్థితి.
  • రెండు మూడు రోజుల పాటు నాన్న వస్తాడు. ఎక్క డో దిగే ఉంటాడు. ఎవరికో కనబడ్డాడు. వస్తున్నాడన్న రకరకాల ఊహగానాల మధ్య బతికున్నాడో, చనిపోయాడో కూడా తెలియని పరిస్థితుల్లో కాలం గడిపా. 
  • ఆ బాధ, టార్చర్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. 
  • ఇక్కడి కుటుంబాలది కూడా అదే పరిస్థితి. ఘటన జరిగిన తర్వాత కనీసం ఏమైంది. ఎక్కడున్నారన్న పరిస్థితులు లేవు.
  • రక్షణరంగం విమానాలు నడుపుతున్న తీరు చూస్తే ఇంకా బాధాకరం
  • ప్రతీ సంవత్సరం ఇలాగే ఉంటుందన్నా, మనుషులు చనిపోతున్నారన్నా అని వారు చెబుతుంటే బాధ అనిపిస్తోంది.
  • విమానాలు సరిగా పని చేయడంలేదు. మూడుసార్లు మరమ్మతులు కూడా చేశారని తెలిసిన పరిస్థితుల్లో మనుషులను పంపించడం బాధాకరం.
  • ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోవాలి. జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఇలాంటివి పునరావృత్తం కాకుండా  గట్టి చర్యలు తీసుకుంటే తప్ప వ్యవస్థ బాగుపడదు.
  • పార్లమెంట్ లో దీనిపై మాట్లాడాలని ఇక్కడికి రాకముందు మా ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటితో రాజమోహన్ రెడ్డితో మాట్లాడా.
  • డిబేట్ లో పార్టిసిపెంట్ చేస్తామని చెప్పారు.  గట్టిగా అడగండి అని చెప్పా. ఢిపెన్స్ మినిస్టర్ దగ్గరకు కూడా వెళ్లి ఒత్తిడి తీసుకురావాలని చెప్పాను
  • ఘటన జరిగినప్పుడు మాత్రమే అప్పటికప్పుడు పట్టించుకోవడం మళ్లీ మరిచిపోవడం దారుణం.
  • మనదేశంలో విమానాలయినా, రైళ్లయినా అంతే అప్పటికప్పుడు రియాక్ట్ అవుతారు. మళ్లీ ప్రతీసంవత్సరం మామూలే.
  • వ్యవస్థను బాగుపర్చాలంటే మనలో చైతన్యం రావాలి.  ప్రశ్నించడం మొదలు పెట్టాలి. మా వంతుగా ఎంపీల ద్వారా ప్రతీ పని చేయిస్తున్నాం. 
  • ఈ సబ్జెక్ట్ మీద బాధ అనేది ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తిని కాబట్టి మీ అందరి సహాయం కావాలి. 
  • ఈ ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృత్తం కాకుండా తప్పును సరిదిద్దితేనే వ్యవస్థ బాగుపడుతుంది. 
  • రక్షణ రంగంలోనే కాలం చెల్లిన విమానాలతో మనుషులను ఎక్కిస్తున్నారంటే హ్యూమన్ లైఫ్ కు వాల్యూలేదన్నది స్పష్టంగా అద్దం పడుతోంది
  • ఇటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలు నడుస్తున్నాయంటే ప్రశ్నించాలి. అందరం కలిసికట్టుగా ప్రశ్నిద్దాం.
  • సీఎం చంద్రబాబు ఒక్కర్ని పరామర్శించి వెళ్లిపోవడం దురదృష్టకరం.                                                                                                                  అని వైయస్ జగన్ ఉద్విఘ్నంగా మాట్లాడారు. 

Back to Top