రైతులు, మైనారిటీలతో వైయస్‌ జగన్‌ భేటి

వేంపల్లె: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండో రోజు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వేంపల్లె గ్రామంలో రైతులతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు వైయస్‌ జగన్‌కు తెలిపారు. కొందరు రుణాలు మాఫీ కాలేదని, మరికొందరు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందలేదని ఫిర్యాదు చేశారు. పంటలు పండక అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధర కల్పించడం లేదు. పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేదని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. మీరే ఆదుకోవాలని, రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని రైతులు వైయస్‌ జగన్‌ను కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో విద్యా, ఉపాధి అవకాశాలు పొందామని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పునరుద్ధరించాలని మైనారిటీలు కోరారు. మరి కొందరు నిరుద్యోగులు తమకు ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని దగా చేశారని వాపోయారు. 
 

Back to Top