గుంటూరుకు బ‌య‌లు దేరిన వైయ‌స్ జ‌గ‌న్‌

హైద‌రాబాద్‌) ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయస్ జ‌గ‌న్ హైద‌రాబాద్ నుంచి గుంటూరు జిల్లాకు బ‌య‌లు దేరారు. గ‌న్న‌వ‌రం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లాకు చేరుకొంటారు.అక్క‌డ‌ ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చేరుకొంటారు. ఇటీవల మట్టి పెళ్లలు విరిగిపడి సజీవ సమాధి అయిన కూలీల కుటుంబాల్ని ఆయన పరామర్శిస్తారు. ఏడు కుటుంబాల స‌భ్యుల‌తో మాట్లాడ‌తారు. అనంత‌రం గుంటూరు నగరానికి చేరుకొని అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను  పలకరిస్తారు.
వైయ‌స్ జ‌గ‌న్ రూట్ మ్యాప్ ను తుది విడ‌త ప్రోగ్రామ్స్ కోర్డినేట‌ర్ త‌ల‌శిల ర‌ఘురాం, జిల్లా పార్టీ అధ్య‌క్షులు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ప‌రిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అభిమానులు పాల్గొంటార‌ని ఈ సంద‌ర్భంగా రాజ‌శేఖ‌ర్ వెల్ల‌డించారు. 

 
Back to Top