మచిలీపట్నం: ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచే వైఎస్ జగన్ బందర్ లో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కృష్ణా జిల్లా కొత్త మాజేరు లో విష జ్వరాల బారిన పడి 20 మంది దాకా చనిపోయారు. ఈ సంగతి తెలుసుకొని బాధ్యత గల ప్రతిపక్ష నేత గా వైఎస్ జగన్ అక్కడ పర్యటించారు. గ్రామంలో వైద్య సౌకర్యాలు లేకపోవటంపై మండిపడ్డారు. గ్రామస్తులకు వైద్య సాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతున్నా, పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది. ఈ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ ఈ కార్యక్రమం చేపట్టారు.