నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష..!

శరవేగంగా దీక్ష పనులు..!
అక్టోబర్ 7 నుంచి ఆరంభం..పచ్చనేతల్లో వణుకు..!

గుంటూరుః ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు సర్వం సన్నద్ధమవుతోంది. ప్రత్యేకహోదా సాధన కోసం ఈనెల 7 నుంచి వైఎస్ జగన్ గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే  నల్లపాడు రోడ్డులో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  దీక్షా వేదిక వద్ద మైదానాన్ని చదును చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు దీక్షాస్థలిని సందర్శించి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  హోదా కోసం వైఎస్ జగన్ కు మద్దతుగా రాష్ట్ర ప్రజానీకమంతా కదం తొక్కనుంది. 

ఆగని పోరు..నిరవధిక హోరు...!
రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించేందుకు వైఎస్ జగన్ చేయని పోరాటం లేదు. పచ్చసర్కార్ ఎన్ని కుయుక్తులు పన్నినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా అనుకున్నది సాధించేందుకు అలుపెరగని పోరు సలుపుతున్నారు. మంగళగిరిలో రెండ్రోజుల దీక్ష చేపట్టారు, ఢిల్లీలో మహాధర్నా నిర్వహించారు, అసెంబ్లీలో ప్రభుత్వం మెడలు వంచి తీర్మానానికి ఆమెదముద్ర వేయించారు. విశాఖ, తిరుపతిలలో యువభేరి నిర్వహించి సక్సెస్ అయ్యారు. ఐనా ప్రభుత్వం దిగిరాకపోవడంతో నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఏమైనా సంజీవనా అంటూ ఎగతాళి చేసిన వాళ్ల నోళ్లు మూయించేలా పోరాటాన్ని ఉధృతం చేశారు.

వైఎస్ జగన్ కు భయపడి...!
ప్రత్యేకహోదా వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపి విద్యార్థులు,యువత సహా ప్రజలందిరినీ మేలుకొల్పారు. వైఎస్ జగన్ ను చూసి భయపడిపోయిన పచ్చనేతలు తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు.  వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక దౌర్జన్యఖాండ ప్రదర్శించారు.  యువభేరి సదస్సులకు అనుమతులు నిరాకరించడం మొదలు విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. గుంటూరు ఉల్ఫ్ హాల్ లో గత నెల 26నుంచి వైఎస్ జగన్ దీక్ష సిద్ధంకాగా పోలీసులను ఉసిగొల్పి అడ్డుకున్నారు. పచ్చసర్కార్ కుట్రలు, కుతంత్రాలను పటాపంచలు చేస్తూ వైఎస్ జగన్ మున్ముందుకు సాగుతున్న తీరు ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

సిగ్గుమాలిన ప్రభుత్వం..!
పచ్చనేతల చేష్టలను ప్రజలు ఛీ కొడుతున్నారు. ఓముఖ్యమంత్రి అయి ఉండి ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సింది పోయి...అందుకోసం ఉద్యమిస్తున్న వైఎస్ జగన్ ను అడ్డుకోవడం పట్ల చీధరించుకుంటున్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టుపెట్టిన తీరుపై మండిపడుతున్నారు. దీక్షను అడ్డుకోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
Back to Top