ఢిల్లీ నుంచి గల్లీ దాక పోరాటం చేశాం

  • అవసరానికి వాడుకొని, ఆతర్వాత వెన్నుపోటు పొడవడం బాబు నైజం
  • తన స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెట్టాడు
  • హోదా కోసం బంద్ లు, దీక్షలు చేశాం, వినతిపత్రాలు ఇచ్చాం
  • ఇప్పటివరకు 10 యువభేరి సదస్సులు నిర్వహించాం
  • హోదా పోరాటంలో అందరి తోడ్పాటు కావాలి
  • అనంత యువభేరిలో యువతకు వైయస్ జగన్ దిశానిర్దేశం
అనంతపురంః ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సింది పోయి...యువభేరికి వచ్చే విద్యార్థులపై కేసులు, పీడీ యాక్ట్ పెడతామని బెదిరించే పరిస్థితికి వచ్చాడని వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి యువభేరి కార్యక్రమానికి  ఎన్ని ఒత్తిడిలు వచ్చినా బేఖాతరు చేయకుండా ఆప్యాయతలు చూపిస్తూ ఇక్కడకు వచ్చిన ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి వేదికపైనున్న మేధావులు, ప్రొఫెసర్లకు ....ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్న దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో తోడు నిలిచిన ప్రతి ఒక్కరికి వైయస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ లో విద్యార్థులకు ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి దిశానిర్దేశం చేశారు. అందరం ఒక్కటై ప్రత్యేకహోదాను సాధించుకుందామని పిలుపునిచ్చారు. హోదా ఇచ్చేదాక ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే......



గుంటూరులో 9వ యువభేరి జరిగింది. ఆ తర్వాత విద్యార్థులకు పరీక్షలు, సెలవులు అనంతరం అడ్మిషన్స్ సెప్టెంబర్ దాకా జరిగాయి. అక్టోబర్ మాసంలో యువభేరి ద్వారా మళ్లీ మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. గత మూడున్నరేళ్లుగా హోదా కోసం మీ అందరి ఆశీస్సులతో  కలిసికట్టుగా ఒక్కటై పోరాటాలు చేశాం. అనంతలో జరుగుతున్నది 10వ యువభేరి. హోదా కోసం ముఖ్యమంత్రే పోరాటం చేసయాల్సిందిపోయి కేసులు పెడతామని విద్యార్థులను భయపెట్టే పరిస్థితికి వచ్చాడు. 

ప్రత్యేకహోదా కోసం ఢిల్లీ నుంచి గల్లీ దాక పోరాటాలు చేశాం. మూడు ధర్నాలు జరిగాయి. రెండు నిరాహార దీక్షలు జరిగాయి. మంగళగిరిలో బాబు పాలనను, ఆయన చేసిన మోసాలను ఎండగడుతూ, హోదాను ఆయన తూట్లు పొడిచిన పరిస్థితుల మీద రెండ్రోజుల పాటు దీక్షలు చేశాం. గుంటూరులో ఏడురోజులపాటు నిరవధిక నిరాహార దీక్ష చేశాను.  ప్రతిపక్షనేత నిరాహార దీక్ష నేపథ్యంలో మోదీపై బాబు ఒత్తిడి తీసుకొస్తడని అందరం ఆశపడ్డాం. కానీ, ఆయన రెండ్రోజుల్లో వస్తున్నాడని తెలియగానే, బలవంతంగా అర్ధరాత్రి పోలీసులను పంపించి ఏడురోజులు దీక్ష చేసిన ప్రతిపక్ష నేత (వైయస్ జగన్) దీక్షను భగ్నం చేశారు. పోనీ,  మోడీని ఏమైనా అడిగారా అంటే అదీ లేదు. ఆరోజు బాబు హోదా ఊసుకూడ ఎత్తలేదు. 

రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ హోదా కోసం రెండు బంద్ లకు పిలుపునిచ్చింది. రాష్ట్రం హోదా కోరుకుంటుంది. పార్లమెంట్ సాక్షిగా మాట ఇచ్చారు. హోదా ఇవ్వండని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్న బాబు బంద్ కు సపోర్ట్ చేయాల్సింది పోయి, ఆరోజు ఆర్టీసీ బస్సులు తిప్పించే ప్రయత్నం చేశాడు. బంద్ తోనైనా  హోదా వస్తుందని అందరం ఆరాటపడుతుంటే...దాన్ని ఎలా విఫలం చేయాలా అని బాబు ఆలోచనలు సాగాయి. అయినా అన్ని అధిగమిస్తూ ఢిల్లీకి వెళ్లి ప్రధాని, రాష్ట్రపతి అందరినీ కలిశాం.  మూడున్నర సంవత్సర కాలంలో మూడు, నాలుగుసార్లు వినతిపత్రాలు ఇచ్చాం. చట్టసభలైన పార్లమెంట్, అసెంబ్లీలో కూడ ప్రతి సమావేశంలో హాదా అంశాన్ని తీసుకొచ్చాం. కచ్చితంగా ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ మా శాససనభ్యులు, ఎంపీలు గట్టిగా పోరాటం చేశారు. ప్రతి బహిరంగ సభలోనూ హోదా గురించి ప్రస్తావన తీసుకొస్తూనే ఉన్నాం. ప్లీనరీలో కూడ హోదా కోసం ప్రత్యేకంగా తీర్మానం కూడ చేయించాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడ మూడున్నరేళ్లుగా హోదా మనకు వచ్చిందా అని తిరిగిచూస్తే ఏమీ  లేదు. పాలకులు హోదాను పక్కనబెట్టారు.

అధికారంలో ఉన్నవారి చెవులు మూసుకుపోయిన పరిస్థితిలోనూ మనం మాత్రం పోరాటాలు కొనసాగిస్తున్నాం. హైదరాబాద్‌ నగరాన్ని ఆధునికంగా మార్చుకోవడానికి 60 ఏళ్లు పట్టింది. విభజన తర్వాత అలాంటి నగరాన్ని మనం కోల్పోయాం. అందుకే పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ఐదుకోట్ల మంది ఆంధ్రులకు హామీ ఇచ్చారు.  హోదా పేరుతో ఓట్లు పొంది, అధికారంలోకి వచ్చినవాళ్లు కొద్ది రోజుల్లోనే ప్లేటు ఫిరాయించారు. ఎన్నికలకు ముందు తిరుపతి సభలో నరేంద్ర మోదీ, చంద్రబాబులు చేసిన ప్రసంగాలతో పాటు పలు సందర్భాల్లో బాబు ప్రత్యేకహోదాను హేళన చేస్తూ మాట్లాడిన మాటలను  విద్యార్థులకు వీడియో ప్లే చేసి చూపించారు. 

రెండూ అబద్ధాలే..!
ప్రత్యేక హోదా రాష్ట్రాల్లోని 6.2 శాతం జనాభాకు 1.58 లక్షల కోట్టిచ్చారు, మరి 4కోట్ల ఆంధ్రులకు ఏమిచ్చారు? ప్రత్యేక హోదా ఎంత అవసరమో ప్రజలందరికీ అర్థమైనా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం అర్థం కావడంలేదు. కేవలం తన స్వార్థం కోసం ఆయన హోదాని పణంగా పెట్టారు. మాట్లాడితే, 14 ఆర్థిక సంఘం ఇవ్వడం లేదని, హోదాను మించిన ప్యాకేజీ తీసుకొచ్చానని బొంకుతున్నారు. ఈ రెండూ అబద్ధాలే. దేశంలో 11 రాష్ట్రాలకు హోదా ఉన్నమాట వాస్తం. మనకు మాత్రం హోదాగానీ, ప్యాకేజీకానీ లేదన్నదీ నిజం. రాష్ట్రాలకు వివిధ రూపాల్లో కేంద్రం ఎన్ని నిధులిచ్చాయనే దానిపై 2017, ఏప్రిల్‌ 11న ఆర్థిక మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల జనాభా 7.51 కోట్లు, అంటే దేశ జనాభాలో 6.2 శాతం. వీళ్లకు కేంద్రం 2016-17లో 1.58 లక్షల కోట్లు ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన మొత్తం(9.7 లక్షల కోట్లులో) ప్రత్యేక హోదా రాష్ట్రాలకే 14.06 శాతం నిధులు వెళ్లాయి. మరి దేశజనాభాలో 4.08 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేవలం 44 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. అదే హోదా ఉండి ఉంటే ఇంకా మెండుగా నిధులు వచ్చేవి.

ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు, ఆస్పత్రులు, స్కూళ్లు వస్తాయి. అవి వస్తేనే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. హోదా ఉంటే పరిశ్రమలకు పన్ను మినహాయింపులు ఉంటాయి. కొత్త పరిశ్రమలు పెట్టగోరేవారు చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి రారు.. పన్ను మినహాయింపులు ఉంటేనే ముందుకొస్తారు. ఇది నిజం కాబట్టే విభజన సమయంలో అధికార, ప్రతిపక్షాలు హోదాపై గట్టిగా మాట్లాడాయి. బాబు హోదా పదేళ్లు కాదు 15ఏళ్లు కావాలి, నేను సీఎం అయితే తెస్తాను అన్నాడు. హోదా సంజీవని అని ఆరోజు మాట్లాడాడు. ఎన్నికలయిపోయాయి. ప్రజలతో పనైపోయిన తర్వాత ఇవాళ వాళ్లు మాట్లాడుతున్న మాటలేమిటి..? హోదా ఏమైనా  సంజీవనా అని బాబు హేళన చేస్తున్నాడు.  ప్రస్తుతం అధికారంలో ఉన్న పెద్దలు ఆనాడు పార్లమెంటును సాక్షిగా చేస్తూ ఇచ్చిన మాటలను పట్టించుకోకపోతే ప్రజాస్వామ్య వ్యవ్సస్థలో ఎవరిని అడగాలి. వీరు చేసిన మోసాలకు ఎవరిని ప్రశ్నించాలని అడుగుతున్నా. హోదా అవసరం తెలిసిి కూడా బాబు తన స్వార్థం కోసం అమ్మేయడం బాధకలిగిస్తోంది. 

కరువు సీమ అనంతకు హోదా ఎంతో అవసరం..?
అనంతపురం జిల్లాకు హోదా చాలా చాలా అవసరం. రాజస్థాన్ లోని జైసల్మేర్ తర్వాత దేశంలో అతి తక్కువ వర్షాపాతం గల జిల్లా అనంతపురం. అనంతలో ఎక్కువ ప్రాంతం ఎడారిగా మారిపోతుందేమోనని అనంతపై ప్రేమ ఉన్న మనంతా భయపడుతున్నాం. మన రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అనంతపురం. అత్యధిక విస్తీర్ణం గల జిల్లా కూడ. అత్యధికంగా వలసలు పోతున్నా జిల్లా కూడ అనంతపురమే. ప్రతి ఏడాది 4,5లక్షల మంది పంటలు పండక , ఉపాధి లేక, ఉద్యోగాలు రాక, అప్పులు తీర్చలేక వలసలు పోతున్న జిల్లా కూడ అనంతపురమే. చివరికి ఆత్మహత్యలు చేసుకునే దాంట్లో మొదటి స్థానంలో ఉన్నది అనంతపురమే. ఈ జిల్లాకు హోదా అవసరం ఎంత ఉందో నేను చెప్పనవసరం లేదు. 
ఇవన్నీ కూడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.....మూడున్నరేళ్ల కాలంలో ఈపాటికే మనకు హోదా ఇచ్చి ఉంటే లక్షల ఉద్యోగాలు మన దగ్గరకే వచ్చేవి.  పరిశ్రమలు, హోటల్ లు, హాస్టిటల్స్ అన్నీ కట్టేవారు. ఇవాళ చదువైపోయాక ఉద్యోగాలొస్తాయన్న భరోసా క్షీణించిపోయిన పరిస్థితుల్లో...మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చుంటే చదువుకునే ప్రతి పిల్లాడికి భరోసా ఉండేది. ఉద్యోగం కోసం ఎక్కడికోపోవాల్సిన పనిలేదు. మన దగ్గరికే వస్తుందన్న భరోసా ఉండేది. కానీ, బాబు అధికారంలోకి ఉండి హోదా రాకుండా చేశారు. మూడున్నరేళ్లలో బాబు అబద్ధాలు చెప్పారు, మోసం చేశారు కాబట్టే హోదా కోసం మన పోరాటం సాగుతోంది.  ముఖ్యమంత్రి అనంతకు వచ్చినప్పుడు, అసెంబ్లీని సాక్షిగా చేస్తూ చాలా చెప్పారు. బాబు అనంతకు ఇచ్చిన హామీలకు సంబంధించి ఈనాడులో వచ్చిన కథనాలను చూపించారు. 

అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ కు అనుబంధ కేంద్రమన్నాడు. వాటి ఊసేలేదు.  జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనే ఎమర్జెన్సీ వార్డుకు పోతే  దిక్కులేని పరిస్థితి. ఇటీవలేఒకే రోజు పదిమంది చనిపోయిన ఘటన మనం ఈ మధ్యనే చూశాం. అనంతకు నూతన పారిశ్రమిక నగరం, స్మార్ట్ సిటీ,  బెంగళూరు-చెన్నై కారిడార్ దాంట్లోకి హిందూపురం తీసుకొస్తానన్నడు. కనీసం వాటికి టెంకాయ కూడ కొట్టిన పాపాన పోలేదు. అనంతలో టెక్స్ టైల్ పార్క్, ఫుడ్ పార్క్, ఎలక్ట్రానిక్స్ హార్డ్ వేర్ క్లస్టర్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్,  పుట్టపర్తిలో విమాన నిర్వాహణ, మరమ్మతుల కేంద్రం, ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్ట్ అంటూ నోటికొచ్చిన హామీలిచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ చెయ్యలేదు. ఇక హంద్రీనీవా పూర్తి కథ దేవుడెరుగు. ఇంతకుముందు ఫేజ్ 1 పూర్తి అయింది. దానికి పిల్లకాలువలు కూడ తవ్వించిన పరిస్థితి లేదు. అధికారంలోకి రావడం కోసం బాబు ఎవరినైనా మోసం చేస్తడు, వెన్నుపోటు పొడుస్తడు. అవసరమున్నప్పుడు వాడుకోవడం, అవసరం తీరాక వెన్నుపోటు పొడవడం బాబు నైజం. (బాబు హామీలిచ్చి ఏవిధంగా మోసం చేశాడో విద్యార్థులకు వీడియో క్లిప్పింగ్స్ ద్వారా చూపించారు).

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు : ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని అంటున్నారు. మరి అలాంటప్పుడు రాష్ట్రాలకు నిధులిచ్చే విషయంలో తేడాలు ఎందుకు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా. ఇటీవల జీఎస్టీని తెచ్చారు. అందులోనూ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు భారీగా మినహాయింపులు ఇచ్చారు. ప్రధాని సౌభాగ్య యోజన(కరెంట్‌ లేని ఇళ్లకు కనెక్షన్‌) పథకంలోనూ హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇదంతా వాస్తవమైతే, చంద్రబాబు తన దగ్గరున్న మీడియాతో హోదా వల్ల ప్రయోజనం లేదంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది దారుణం కాదా?

నంబర్‌ 2 నుంచి పాదయాత్ర : నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర మొదలవుతుంది. ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుంది. 6 నెలల్లో మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర జరుగుతుంది. యువభేరి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నియోజకవర్గ కోఆర్డినేటర్లు.. కాలేజీలకు వెళ్లి, విద్యార్థులను కలుస్తారు. ప్రజల మద్దతును కూడగడుతూ, అవసరమైనప్పుడు చివరి అస్త్రంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం. పోరుబాటలో భాగంగా రాబోయేరోజుల్లో ఇవన్నీ జరుగుతాయి. పిల్లలకు పరీక్షలనే ఉద్దేశంతో హోదా ఉద్యమానికి విరామం​ ఇచ్చాం. ఈ ఆరు నెలల కాలంలో ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడారా? జగన్‌ మాట్లాడితేనే ప్రత్యేకహోదా అనే పరిస్థితి మారాలి. పాలకులపై ఒత్తిడి పెరగాలి. ఆమేరకు మనం పోరాటాలు చేయాలి. అందుకోసం మీ అందరి తోడ్పాటు, సహకారం కావాలి. అప్పుడే మనం హోదాను సాధించుకుంటాం. ప్రత్యేక హోదా అంటే ఉద్యోగాల కోసం మన పిల్లలు ఎక్కడికో పోవాల్సిన పనిలేదు. చదువుకున్న మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అని గుర్తుంచుకోండి’’ అని జగన్‌ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.


తాజా వీడియోలు

Back to Top