కనిపిస్తే బాబును కొడతారని భయం

వీఎన్‌పల్లి: భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశ్యంతోనే పాదయాత్ర చేపట్టానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా.. నేటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. మూడురోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కమలాపురం నియోజకవర్గ వీఎన్‌పల్లికి చేరుకున్న వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ప్రజలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే... 

రాజకీయాల్లో ఒక మాట ఇస్తే ఆ మాట నిలబడాలని, ఆ మాటకు కట్టుబడి ఉండాలనే సిద్ధాంతాలు రాజకీయ వ్యవస్థలోSలేకుండా కనుమరుగైన పరిస్థితి. రాజకీయ వ్యవస్థ మారాలంటే చైతన్యం ప్రజల దగ్గర నుంచి రావాలి. రాజకీయ నాయకుడు మైక్‌ పట్టుకొని పలానా నేను చేస్తానని మాట చెప్పి.. ఆ వాగ్ధానాన్ని ఆ రాజకీయ నాయకుడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయాల నుంచి పక్కకు తప్పుకునే పరిస్థితి ఉండాలి. అప్పుడే రాజకీయ విశ్వసనీయతకు అర్థం ఉంటుంది. 

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసింది. చంద్రబాబు రూ. 87,612 వేల కోట్ల రుణాలు పూర్తిగా.. బేషరుతుగా మాఫీ చేస్తానని చెప్పాడు. ఇక్కడున్న రైతన్నలు చెప్పిండి.. మీ రుణాలన్నీ మాపీ అయ్యాయా..? రుణాలు మాఫీ చేయకుండా పూర్తిగా మోసం చేసిన పరిస్థితి.
ప్రియతమ నేత దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి (నాన్నగారి) హయాంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీతో రుణాలు వచ్చేవి. రైతన్నలకు కూడా సున్నా వడ్డీకే రుణాలు అందేవి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నా వడ్డీ పక్కనబెట్టేశారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, రైతులను పూర్తిగా మోసం చేశాడు. ఎడమ చేత్తో దోచేయడం.. కుడిచేత్తో మనకు ఏదో చేస్తున్నట్లుగా ఫోజులు కొట్టడం.. ఇదే బాబు పరిపాలన తీరు. 
 
ఎన్నికలకు ముందు ఏ గోడ మీద చూసినా మనకు కనిపించిన రాతలు ఏమిటీ.. టీవీ ఆన్‌చేస్తే బాబు రావాలి అన్న ప్రకటనలు వచ్చేవి.. అది కాక జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి... బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఇవ్వేకాక జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. నేటికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 45 నెలలు గడుస్తుంది.. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు రూ. 90 వేలు బాకీ పడ్డారు. చంద్రబాబు గురించి చెప్పుకుంటూ పోతే ఎంత సమయం అయినా సరిపోదు.. 

పక్కనే సర్వరాయసాగర్‌ నాన్నగారి హయంలో ప్రాజెక్టు 85 శాతం పూర్తయ్యింది. మిగిలిన 15 శాతం పనులను పూర్తి చేయడానికి చంద్రబాబు నాలుగు సంవత్సరాలు పట్టింది.. అయినా పనులు ఇంకా పూర్తి కాలేదు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కింద 44 వేల క్యూసెకులతో ఫడ్‌ఫ్లో కెనాల్‌ ఉంది. అది పూర్తి చేసివుంటే గడ్డికోట, సర్వరాయసాగర్‌ ప్రాజెక్టులు పూర్తయితే, ప్రాజెక్టులన్నీ నీటి కుండాల్లా ఉండేవి. ప్రతి రైతు మొహంలో చిరునవ్వు కనిపించేది. కానీ నత్తనడకన పనులు సాగుతున్నాయి. ఇంతటి దారుణంగా పరిపాలన జరుగుతుంటే చంద్రబాబును ప్రశ్నిస్తే రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయని, భవిష్యత్తులో మంచి జరుగుతుందనే ఆశ కల్పిస్తూ ప్రతి రైతుకు తోడుగా నిలిచేందుకు పాదయాత్ర చేస్తున్నా.. పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి సామాజిక వర్గాన్ని కలుస్తా.. ప్రతి ప్రాంతాన్ని సందర్శిస్తా.. మీరు చెప్పిన ప్రతి సూచనలు, సలహాలు తీసుకుంటా.. 

ప్రతి ఇంట్లో చిరునవ్వులు ఉండాలని నవరత్నాలను ప్రకటించాం.. ప్రజలు ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగా నవరత్నాల్లో కూడా మార్పులు చేస్తాం.. చివరికి ఎన్నికల ప్రణాళిక రూపొందుతుంది. చంద్రబాబు మాదిరిగా మోసాలు ఉండవు.. చంద్రబాబు మ్యానిఫెస్టో నెట్‌లో కనిపించదు.. కనిపిస్తే చంద్రబాబును కొడతారనే భయం.. ఎందుకు కొడతారో తెలుసా... చెప్పిందొకటి.. చేసేదొకటి..కాబట్టి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలు దిద్దిన మ్యానిఫెస్టో పెడుతుంది. అది కూడా కేవలం 2, 3 పేజీలు మాత్రమే ఉంటుంది. చేసేది పెడతాం.. చెప్పినవే కాదు. చెప్పనివి కూడా చేస్తాం.. తరువాత 2024 ఎన్నికల్లో చెప్పిన ప్రతి అంశం చేశాం.. ఆశీర్వదించండి అని చెబుతాం.. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకు ముందడుగు పడాలంటే ప్రజల నుంచి చైతన్యం రావాలి. అందుకే మిమ్మల్ని తోడుగా నిలబడాలని కోరుతున్నా.. 
Back to Top