బాబు తాగడు కానీ..జనం పీకలదాకా తాగేలా చేస్తాడు
– టీడీపీ నేతలు ప.గో జి ల్లాను లూటీ చేస్తున్నారు
– యధేచ్ఛగా ఇసుక దోపిడీ
– ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహశీల్దార్‌పై టీడీపీ ఎమ్మెల్యే దాడి
– పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే వీలుందా? 
– తణుకు వాసులకు 65 ఎకరాల్లో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మిస్తాం
–అగ్రిగోల్డు ఆస్తులు కొట్టేయడానికి బాబు స్కేచ్‌ వేస్తున్నారు
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే రూ.1100 కోట్లు కేటాయిస్తాం
– చంద్రబాబు చేతికి ఉంగరం, మెడలో చైన్‌ ఉండదు కానీ..ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులుంటాయి
– అబద్ధాలు, మోసాలు చేసే వారిని బంగాళఖాతంలో కలపండి
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు
– పేద పిల్లలు కూడా పెద్ద పెద్ద చదువులు చదవాలి
– మీ పిల్లలు ఏం చదువుతారో చదివించండి..నేను చదివిస్తాను
పశ్చిమ గోదావరి:  చంద్రబాబు మద్యం తాగడు కానీ..జనం పీకలదాకా తాగేలా చేస్తాడని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ఆయన చేతికి ఉంగరం, వాచీ లేదట, మెడలో చైన్‌ లేదంట కానీ..ఓట్లు ఖర్చు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు డబ్బులు ఉన్నాయని విమర్శించారు. 181వ రోజు  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

– ఎండకాలం అయినప్పటికీ, ఎండలు తీక్షణంగా ఉన్నప్పటికీ..ఈ రోజు పొద్దునుంచి నాతో పాటు వేలాది మంది అడుగులో అడుగులు వేశారు. ఒకవైపు కష్టాలు చెబుతూ. .అర్జీలు ఇస్తూ..మరో వైపు నా భుజాన్ని తడుతూ అన్నా..మేమంతా నీతో ఉన్నామని చెప్పారు. నాతో పాటు నడవాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. అయినా ఎండను ఖాతరు చేయలేదు. ఈ రోడ్డు మీదా, దుమ్ములో, దూళిలో నిలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా చిక్కని చిరునవ్వుతో ప్రేమానురాగాలు పంచుతున్నారు. ఆత్మీయతలు చూపుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు
– తణుకు నగరానికి ఓ ప్రత్యేక ఉంది. బ్రిటీష్‌ వారికే వణుకు పుట్టించిన చరిత్ర తణుకుకు ఉంది. స్వాతంత్య్ర పోరాటం చేసిన పట్టణాల్లో తణుకు ఒక్కటి. చాలా మంది పోరాటం చేసి జైలు పాలు అయ్యారు. ఇలాంటి చరిత్ర కలిగిన తణుకు పట్టణంలో ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే..నిజంగా తణుకు పట్టణానికి స్వాతంత్య్రం వచ్చిందా అని పిలుస్తోంది. ఇక్కడి ప్రజలు నాతో చెబుతూ..అన్నా..ఇరగవరం మండలం, రేలంగి గ్రామంలో టీడీపీ నాయకులకు, మిగిలిన వారికి గొడవలు జరిగితే ఎమ్మెల్యే కలుగజేసుకొని ఎస్‌ఐకి ఆదేశాలు ఇచ్చారన్నా..టీడీపీ నాయకులు దాడి చేసినా కూడా ఇరువర్గాలపై కేసులు పెట్టారని ఎస్‌ఐని, రైటర్‌ను ఇంటికి పిలిపించి నేలపై కూర్చోబెట్టి నిర్భందం చేశారని చెప్పారు. ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టి బొక్కలో పెట్టాల్సింది పోయి..ఆ ఎస్‌ఐ ఎమ్మెల్యేలపై కేసు పెడితే..ఆ ఎస్‌ఐని వీఆర్‌లోకి పంపించారు. నిజంగా గవర్నమెంట్‌ ఉద్యోగస్తులు పని చేసే అవకాశం ఉందా? ఈ జిల్లాలో ఓ ఎమ్మెల్యే చేస్తున్న ఇసుక మాఫియాను అడ్డుకున్న తహశీల్దార్‌ జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్లారు. ఇదే నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి చూస్తే బాధనిపిస్తోంది. ఈ జిల్లాలో 15 నియోజకవర్గాలు చంద్రబాబుకు ఇస్తే..ఆయన ఈ జిల్లాకు చేసింది ఏంటీ? అంటే సమాధానం చెప్పడం లేదు. మంచి చేయకపోగా, ఈ జిల్లాను లూటీ చేస్తున్నారు.
– ఇరగవరం మండలం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే..చంద్రబాబు అనుచరులు ఆ ఇళ్ల స్థలాలు బలవంతంగా లాక్కుంటున్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని గోదావరిలో ఇసుకను య«ధేచ్చగా తవ్వుకుంటున్నారు. ఇ క్కడ ఉన్న ఎమ్మెల్యేకు నెల నెల రూ.1.50 లక్షలు కమీషన్లు ఇస్తున్నారని ప్రజలు చెబుతుంటే బాధనిపించింది. కలెక్టర్‌ గారి కళ్ల ముందే ఇసుక తరలివెళ్తున్నా ఆయన మాట్లాడరు. ఎమ్మెల్యేలకు ఇంత, కలెక్టర్‌కు ఇంత, పెద్దబాబు, చిన్నబాబులకు కమీషన్లు ముడుతున్నాయి.
– ఈ జిల్లానే దేశానికి అన్నం పెట్టే జిల్లా అని అందరం అనుకుంటాం. ఈ జిల్లా వాసులు నా వద్దకు వచ్చి వాపోతున్నారు. సుమారు 40 వేల ఎకరాలు వరి సాగు అవుతుండగా దాల్వా పంటకు ప్రతి ఏటా నీరు వస్తుందో రాదో అని భయపడుతున్నామని రైతులు వాపోతున్నారు. పక్కనే గోదావరి నది ఉన్నా..దాల్వాకు నీరు రావడం లేదు. గింజ కట్టే సమయంలో అష్టకష్టాలు పడుతున్నారు. వరికి గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోతున్నారు. 
– అక్కచెల్లెమ్మలు నా వద్దకు వచ్చి అన్నా..మా పేరు చెప్పి టీడీపీ నాయకులు దోచుకుంటన్నారని ఐకేపీ సభ్యులు చెబుతున్నారు. దొంగ అకౌంట్లు మాపేరుతో ఓపెన్‌ చేసి డబ్బులు స్వాహా చేస్తున్నారని అక్కచెల్లెమ్మలు వాపోతున్నారు. అష్టకష్టాలు పడి రైతులు మిల్లర్ల వద్ద అమ్ముకుంటే డబ్బులు ఇవ్వడం లేదు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
– ఇదే నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు నాతో అంటున్నారు. నాన్నగారి హాయంలో హరిజనకాలనీలో వైయస్‌ రాజశేఖరరెడ్డి వెయ్యి ఇల్లు కట్టించారని చెప్పారు. నియోజకవర్గంలో 10 వేల ఇల్లు కట్టించారని చెప్పారు. 48 ఎకరాలను పేదవాడి కోసం ఇళ్ల పట్టాలు కేటాయిస్తే టీడీపీ హయాంలో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదని, ఆ ఇళ్ల స్థలాలు లాక్కుంటున్నారని చెబుతున్నారు.
– పక్కనే పరిశ్రమలు విడిచిపెట్టిన వ్యర్థాల కారణంగా జలాలు కలుషితమయ్యాయని, తాగడానికి నీరు లేదని అధికారులే హెచ్చరిక బోర్డులు పెడుతున్నారని వాపోతున్నారు. ఆ రోజుల్లో నాన్నగారు గోదావరి నుంచి పైప్‌లైన్‌ ద్వారా నీరు అందించారు. ఇవాళ రూ.30 ఓ క్యాన్‌ కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. నాలుగేళ్లుగా ఓవర్‌ హెడ్‌ ట్యాంకు కట్టించాలని కోరుతున్నా ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు.
– మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో దేవుడు ఆశీర్వదించి, మీ అందరి అశీస్సులతో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మిస్తానని మాట ఇస్తున్నాను.
– ఆగ్రిగోల్డు బాధితులు రాష్ట్రంలో 19 లక్షల మంది ఉన్నారు. ఆగ్రిగోల్డు ఆస్తులు అమ్మి, బాధితులకు న్యాయం చేయకుండా వాటిని స్వాధీనం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆగ్రిగోల్డు ఆస్తులు కొన్ని మినహాయించిన తరువాత సీడీఐ కొత్త లెక్కలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న తరువాత చంద్రబాబు తనకు సంబంధించిన ఎస్‌ఎల్‌ గ్రూప్‌ను తీసుకొచ్చారు. ఆగ్రిగోల్డు ఆస్తుల విలువలను పద్ధతి ప్రకారం తప్పించి దోచుకుంటున్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు దోచేస్తున్నారు. 
– చంద్రబాబు చేసిన నల్ల కార్యక్రమం అంతా చూశాం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. ప్రత్యేకహోదా తీసుకువస్తానని బిల్డప్‌ ఇ చ్చారు. తీరా చంద్రబాబు ఢిల్లీలో ఏం చేశారో తెలుసా? తెల్లవారుజామున 3 గంటలకు ఎస్‌ఎల్‌ గ్రూప్‌ సభ్యులతో చర్చలు జరిపారు. ఏ కార్యక్రమం చేసినా చంద్రబాబు గురించి విఫరీతంగా పబ్లిసిటీ చేసుకుంటారు. ఎస్‌ఎల్‌ గ్రూప్‌ సభ్యులతో భేటీకి సంబంధించి వార్తలు మీడియాలో రాకుండా చూసుకున్నారు. ఆగ్రిగోల్డు బాధితులకు ఒక్కటే చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.11 వందల కోట్లు ప్రభుత్వం చెల్లిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని అసెంబ్లీలో చెప్పినా పట్టించుకోలేదు. రూ.1100 కోట్లు వెంటనే కేటాయించి బాధితులకు న్యాయం చేస్తామని మాట ఇస్తున్నాను. ఆ తరువాత ఆ ఆస్తులను కాజేయాలని చూసినా ఈ పాలకులను ఏ బొక్కలోవేయాలో ఆలోచిస్తాం.
– చంద్రబాబు నిన్న విజయనగరంలో మాట్లాడుతూ..‘నేను వేలికి ఉంగరం వేసుకోను. చేతికి వాచ్‌లేదు’ అని చెప్పారు. టీవీలో ఆయన మాట్లాడిన మాటలు చూసి విస్తు పోయారు. ఇవాళ పాదయాత్రలో నా వద్దకు ఒకాయన వచ్చారు. అన్నా..మీ స్పీచ్‌లు వింటున్నాను. నా వద్ద ఒక కథ ఉందన్నా..అది మీ మీటింగ్‌లో చదవమని చెప్పారు. 
– ఆ కథ ఏంటంటే..అవునండి..చంద్రబాబు గారి వేలికి ఉంగరం, గడియారం ఉండదండి. చంద్రబాబు మాత్రం రెండు ఎకరాల నుంచి రూ.4 లక్షల కోట్లు సంపాదించారండి. హైదరాబాద్‌లో పెద్ద బంగాళ కూడా కట్టించుకున్నారు. వేల కోట్ల విలువ చేసే హెరిటేజ్‌ కంపెనీ ఉందండి. ఆ కంపెనీ షేర్లు ఎంతో తెలియదండి. టీడీపీ అధికారంలోకి రాగానే రేట్లు పెరిగాయండి. నోట్లు రద్దు కు ముందు రెండు రోజుల ముందు విఫరీతంగా పెరిగాయండి. ఫ్యూచర్‌ గ్రూప్‌కు అమ్ముకున్నారండి. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి నల్లధనం బయటకు వస్తుందని, ఆ నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోతారండి. ఆయనకు ఏమీ లేకపోయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తారండి. అవునండి బాబుగారికి మందు తాగే అలవాటు లేదండి..ప్రతి ఊర్లో బడి పక్కన, గుడి పక్కన బెల్టు షాపు లేని ఊరు లేదండి. చదువుకుంటున్న మా పిల్లలను తాగుబోతులను చేస్తున్నారు. ఆనందం కోసం సాయంత్రం ఓ పెగ్గు వేయాలని బాబు గారు ఆలోచన చెప్పారండి. బాబు గారు ఏ అమ్మాయి వంకా చూడలేదండి. కానీ, 69 ఏళ్ల వయసులో ఈ మనషి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎబ్బెట్టుగా ఉందండి. తిరకాసు ఏంటంటే పసిపిల్లలను, మహిళలపై అరాచకాలు జరుగుతున్నా ఆయన పట్టించుకోడండి. అవునండి బాబుగారికి ౖ«§ð ర్యం ఎక్కువండి. కాకపోతే ఒక్క విచారణకు సిద్ధపడండి. ఎప్పుడు ఆయనపై ఆరోపణలు వచ్చినా కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటాండి. కేసుల కోసం ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెడతారండి. ఎంపీల చేత రాజీనామాలు చేయించరండి. ఎందుకంటే ఆయన తరఫున పార్లమెంట్‌లో పోరాటం చేయాలి కదండి. ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయరండి. ఆయన ఎవర్ని మోసం చేయరండి. కానీ డ్వాక్రా రుణాలు మాఫీ చేయరండి. నిరుద్యోగ భృతి ఇవ్వనే ఇవ్వరండి. రీయింబర్స్‌మెంట్‌ ఫీజులు ఇవ్వడం లేదండి. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చలేదండి. తన పార్టీ ఎమ్మెల్యేలకు ఎలా దోచుకోవాలో ట్రైనింగ్‌ ఇస్తారండి. ఆయన చాలా నీతి కథలు చెబుతారండి. పంచభూతాలను మింగేస్తారండి. ఇసుక, మట్టి, బొగ్గు, కరెంటు, ఫైబర్‌ నెట్, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకొని చిలుక కొట్టుడు కొడతారండి. చివరకు ఏయిర్‌ ఏషియా కుంభకోణంలో ఉన్నారని ఇవాళ పేపర్లో చదివానండి. ఎంతైనా నలభై ఏళ్ల ఎక్సిఫిరియన్స్‌ కదా? బాబుగారే కంప్యూటర్‌ కనిపెట్టారు. సెల్‌ఫోన్‌ తెచ్చారండి. ఆయన కొడుక్కు మాత్రం హార్డ్‌వేరు, సాప్ట్‌వేరు నేర్పించలేకపోయారండి. ఆయనకు పప్పు అని బిరుదు ఇచ్చారండి. బాబుగారు చేప్పేవన్ని శ్రీరంగనీతులండి..ఆయన చేసేవిమాత్రం అన్నీ తప్పుడు పనులే అండి అని ఓ పెద్దాయన నా వద్దకు వచ్చి చెప్పారు.
– ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తానని చెప్పి చేయకపోతే ఆ నాయకుడు ఇంటికి వెళ్లాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది.
– రేపు పొద్దున చంద్రబాబును పొరపాటున క్షమిస్తే..మీ వద్దకు వచ్చి మైక్‌ పట్టుకొని పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారు. ఎన్నికల్లో చెప్పివన్నీ చేసేశానని చెబుతారు. అయినా మీరు నమ్మరని, రేపు పొద్దున ఏమంటారంటే..ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్ముతారా? నమ్మురు అని తెలుసు కాబట్టి..కేజీ బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి బెంజి కారు ఇస్తానంటారు. అయినా నమ్మరని ప్రతి ఇంటికి తన మనిషిని పంపించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. డబ్బులు ఇస్తే తీసుకోండి. అది మన డబ్బే..మన జేబుల్లో నుంచి తీసుకున్నదే. రూ.5 వేలు కావాలని డిమాండు చేయండి. కానీ..ఓట్లు వేసే సమయంలో ఇలా అబద్ధాలు చెప్పే వారు, మోసాలు చేసే వారిని బంగాళఖాతంలో కలిపేయండి. మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి.
– ఇ టువంటి అన్యాయమైన పాలన పోయి..దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ఈ మీటింగ్‌లో పేదవాడి చదువుల కోసం ఏం చేస్తామన్నది చెబుతున్నాను. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే చదువుల విప్లవం తీసుకువస్తాం. పేదవాడి కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే..నాన్నగారి కొడుకుగా జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు పిల్లాడి హాస్టల్‌ ఖర్చుల కోసం రూ.20 వేలు ప్రతి ఏటా చెల్లిస్తాం. అలాగే చిన్న పిల్లాడిని బడికి పంపించినందుకు ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తామని మాట ఇస్తున్నాను. చెడిపోయిన ఈ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.

 
 
Back to Top