‘నీరు–చెట్టు’ బాబు దోపిడీకి పరాకాష్ట– బ్యాంకుల్లో బంగారం ఇంటికి రాలేదు..నోటీసులు మాత్రం వస్తున్నాయి
– మండపేటలో పేపర్‌ కాలుష్యంతో ప్రజలు బాధపడుతున్నా
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలు చూశాం
– బాబు చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదు
– మట్టి, ఇసుక సహా అన్నింటిలోననూ దోపిడీనే
–నీరు– చెట్టులో చంద్రబాబు దోపిడీ పరాకాష్టకు 
– అబద్ధాలు చెప్పే వారిని, మోసాలు చేసే వారిని బంగాళఖాతంలో కలపండి
– సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తాం
– ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ సమయానికి వచ్చేలా చేస్తాం
– ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం
– మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా ఫర్వాలేదు
– హాస్టల్‌ ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు
– పిల్లలను బడికి పంపిస్తే రూ.15 చెల్లిస్తాం

తూర్పు గోదావరి: నాలుగున్నరేళ్లలో నీరు–చెట్టు పథకం చంద్రబాబు దోపిడీకి పరాకాష్టగా మారిందని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఇసుక, మట్టి సహా అన్నింటిని దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో  ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక సీపీఎస్‌విధానాన్ని రద్దు చేస్తానని, చదువుల విప్లవం తీసుకువస్తామని వైయస్‌ జగన్‌హామీ ఇచ్చారు.  సోమవారం ప్రజా సంకల్ప యాత్ర 209వ రోజు మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 

– నాలుగున్నర చంద్రబాబు పాలన క్లైమాక్స్‌కు వచ్చింది. ఈ నాలుగేళ్లు పాలన ఎలా సాగిందో ఇదే మండ పేట నియోజకవర్గంలో చూశాను. ఇక్కడ ప్రజలు, రైతులు పడుతున్న అవస్థలు చూశాను. అన్నా..ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నాయి. ఇసుక మట్టి దోపిడీ చేస్తున్నారు. మహిళా సంఘాలపై దాడులు చేస్తున్నారు. జన్మభూమి మాఫియా ఎక్కడా ఉండదేమో అని వాపోతున్నారు. ధాన్యం పండించిన రైతన్న అడుగుతున్నారు. అన్నా..చంద్రబాబు పాలనలో వరి మద్దతు ధర రూ.1550 అంటున్నారు. ఆ ధాన్యాన్ని అమ్ముదామంటే రూ.1150కి కూడా కొనే నాథుడు లేడు. బినామీ పేర్లతో టీడీపీ నాయకులు కొనుగోలు కేంద్రాల్లో దోచుకుంటున్నారు. ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయకుండా, ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అవినీతికి పాల్పడుతున్నారు.
– ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రజలు నాతో అన్న మాటలు..అన్నా ఇసుక దోపిడీ జరుగుతుందన్నా..ప్రతి జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు క్యాంపు ఆఫీస్‌ పక్కనే ఇసుక రీచ్‌లు కనిపిస్తున్నాయి. వేల లారీల్లో రవాణా చేస్తున్నారు. మన కళ్ల ముందే వేల లారీలు వెళ్తున్నాయి. అయినా ఏ కలెక్టర్‌ అడ్డుకోడు. పోలీసులు దగ్గరుండి లారీలను పంపిస్తున్నారు. పేరుకేమో ఇసుక ఫ్రీ అంటున్నారు. నేను అడుగుతున్నాను. మీకు ఇసుక ఫ్రీగా వస్తుందా? ఇసుక కేవలం చంద్రబాబుతో లంచాలు పంచుకునే వారికే ఇసుక ఉచితంగా వస్తోంది. నాలుగున్నర సంవత్సరాలుగా తోచేసిన తరువాత ఇవాళ చంద్రబాబు ఏమంటున్నారో తెలుసా? ఇవాళ ఇసుకను ప్రక్షాళన చేస్తానని మాట్లాడుతున్నారు. 
–ఇదే నియోజకవర్గంలోకి కపిలేశ్వరపురం తదితర ఇసుక రీచ్‌ల నుంచి దోపిడీ జరిగిందా? లేదా? అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళలపై లాఠీ చార్జ్‌ చేశారు. ఇదే చంద్రబాబు ఘనత ఏంటో తెలుసా? ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. చంద్రబాబు పుణ్యమా? అంటూ ఇసుక కొనాలంటే లారీ ఇసుక రూ.7 వేల నుంచి రూ.12 వేలకు అమ్ముతున్నారు.
– అన్నా..ఇక్కడ ఇసుక, మట్టి దేనిని వదిలిపెట్టడం లేదంటున్నారు. కేశవరం, ధర్మవరం ప్రాంతాల్లో మట్టిని అడ్డగోలుగా తవ్వుతున్నారు. ఇందులో ఇక్కడి ఎమ్మెల్యే పీహెచ్‌డీ చేశారని చెబుతున్నారు. మట్టితో కోట్లు సంపాదించుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఇక్కడ దోపిడీ పరాకాష్టకు చేరింది. ఇక్కడి దోపిడీని బయటి ప్రపంచానికి చూపించేందుకు స్థానికులు కోర్టుకు వెళ్లి మాకే నీరు–చెట్టు పనులు ఇప్పించండి ..మేమే ప్రభుత్వానికి అధనంగా డబ్బులు ఇస్తామని కోర్టు కూడా ఉత్తర్హులు ఇచ్చింది. అయినా కూడా వారికి మాత్రం ఈ పనులు ఇవ్వరు. కారణం టీడీపీ నాయకులకు కమీషన్లు రావు కదా?
– చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏమన్నారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. ఎన్నికల  ముందు భారీ డైలాగులు, ప్రకటనలు ఇచ్చారు. ఆయనొస్తున్నారని ఊదరగొట్టారు. ఆయన వచ్చారు..అక్క చెల్లెమ్మల మెడలోని మంగళసూత్రాలు ఇంటికి రాలేదు. ఇవాళ పరిస్థితి ఏంటంటే..బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు నేరుగా ఇంటికి వచ్చి దాడులు చేస్తున్నారు. తాళాలు వేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలోని భారతమాత, నవయుగ, దయామయుడు గ్రూపులకు తాళాలు వేశారు. 
– నాన్నగారి హయాం మాకు గుర్తు ఉందన్నా..ఈ నియోజకవర్గంలోనే 14 వేల ఇళ్లు మహానేత కట్టించారని చెబుతుంటే గర్వంగా అనిపించింది. పేదవారికి ఇళ్ల స్థలాల కోసం దాదాపు 199 ఎకరాల స్థలాలను పంపిణీ చేశారని చెబుతున్నారు. 1800 మంది లబ్ధిదారులకు మండపేట టౌన్‌లో ఇచ్చారని చెబుతున్నారు. మహానేత సేకరించిన ఆ భూముల్లో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతి ప్లాట్లు కడతానని ఏ రకంగా మోసం చేస్తున్నారో ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఎవరైనా పేదవాడి వద్ద నుంచి దోచుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు తప్ప మరెవ్వరికి ఉండదు. చంద్రబాబు ఇచ్చే ప్లాట్లు అడుగుకు రూ.2 వేల చొప్పున పేదలకు అమ్ముతారట. ఈ ప్లాట్లకు రూ.6 లక్షలు అవుతుందట, ఇందులో రూ.3 లక్షలు పేదవాడికి అప్పుగా ఇస్తారట. ఈ డబ్బులు 20 ఏళ్ల పాటు ప్రతి నెల రూ.3 వేల చొప్పున కట్టుకుంటూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు..కానీ 20 ఏళ్లు కట్టుకుంటూ పోవాల్సింది పేదవాడట. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఆ ప్లాట్లు తీసుకోండి. మనందరి ప్రభుత్వం వచ్చాక పేదవాడు కట్టాల్సిన రూ.3 లక్షలు మాఫీ చేస్తానని మాట ఇస్తున్నాను.
– చంద్రబాబు పాలన గురించి ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. అన్నా ..పక్కనే పరిశ్రమలు ఉన్నాయి. తీవ్ర కాలుష్యంతో బాధపడుతున్నాం. పట్టించుకునే నాథుడు లేడు. మండపేటలోని 60 పడకల కమ్యూనిటీ ఆసుపత్రిని వైయస్‌ఆర్‌ కట్టించారు. ఇప్పుడు ఆ ఆసుపత్రిలో ఎక్సెరే తీసే నాథుడు లేడు. శుభ్రం చేసే స్టాఫ్‌ కూడా లేదు. రాష్ట్రవ్యాప్తంగా పరిపాలన ఎలా సాగుతుందో ఇదే ఉదాహకరణ
– ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఇక్కడే చూస్తున్నాం. హామీలు ఎగురగొట్టిన ఏకైక వ్యక్తి చంద్రబాబు మాత్రమే కనిపిస్తారు. జన్మభూమి కార్యక్రమంలో చీరా, దోవితి అన్నారు. ఇంతవరకు ఎక్కడా ఇవ్వలేదు. 
– ఇవాళ ఈ పాలనను చూడమని చెబుతున్నాను. నాలుగేళ్ల బాబు పాలనలో మనం చూసింది మోసాలు, అబద్ధాలు చూశాం. ఈ సమయంలో నాకు ఓ చిన్న కథ గుర్తుకు వచ్చింది. 
– అనగనగా ఒక స్టూడెంట్‌ ఉండేవాడు. ఆ స్టూడెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ రాశాడు. ఆయనకు నూటికి పది మార్కులు కూడా రాలేదు. ఆ తరువాత చివరికి వాళ్లసాయం, వీళ్ల సాయం తీసుకున్నారు. కాఫీ కొట్టి అడ్మిషను సాధించుకున్నారు. తీరా సీట్‌ వచ్చిన తరువాత మన వాడు ఏ పరీక్ష రాసినా కూడా ఫెయిల్‌ అయ్యాడు. నాలుగేళ్లలో ఒక్క పరీక్ష కూడా పాస్‌ కాలేదు. అంతేకాదు మైనస్‌మార్కులు. ఐదేళ్లు వచ్చేసరికే అన్ని కలిపి ఒకేసారి రాస్తేనే తాను బయటపడగలుగుతారు. ఆ పరిస్థితి ఎలాగు లేదు. ఇలాంటి సమయంలో ఏం చేశారో తెలుసా? కాపీ కొట్టి బెదిరించడం, జిమ్మిక్కులు కొట్టి బయటపడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే విధంగా చంద్రబాబు గారడీ చేస్తున్నారు. అన్ని హామీలను ఎగురగొట్టారు. ఇప్పుడు చేయనిది చేసినట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అక్కడ స్టూడెంట్‌కు జీరో మార్కులు వచ్చినట్లు చంద్రబాబుకు కూడా సున్నా మార్కులే. రూ.87,600 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని 2014లో చెప్పిన చంద్రబాబు మాట తప్పారు. జూన్‌లోనే మాఫీ చేయాల్సి ఉండగా దాన్ని కత్తరించి చివరకు వడ్డీలకు కూడా ఇవ్వలేదు. దీన్నే చంద్రబాబు ఏమంటున్నారు. దేశంలోనే కనివినీ ఎరుగని రీతిలో రుణమాఫీ చేశారట. 
– పొదుపు సంఘాలకు సంబంధించి నయా పైసా కూడా మాఫీ చేయలేదు. ఇటీవల రుణాలు మాఫీ చేశానని చంద్రబాబు సన్మానాలు చేయించుకున్నారు. కొత్తగా ఒక్క  ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. ఊరికి నాలుగైదు ఇల్లు కట్టకపోయినా..ఏకంగా 19 లక్షల ఇళ్లు కట్టబోతున్నారని ప్రచారం చేయించుకుంటున్నారు. గారడీలు చేయడంలో చంద్రబాబును మించిన వారు ఎవరైనా ఉన్నారా? 
– చంద్రబాబు అధికారంలోకి వచ్చి 50 నెలలు అయినా..ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంది. ప్రతి ఇంటికి రూ.1 లక్ష బాకీ పడ్డారు. బెల్టు షాపులు రద్దు చేశామని, ఇసుక ఉచితంగా ఇస్తున్నామంటున్నారు. డీజిల్‌పై సబ్సిడీ ఇస్తున్నామని మత్స్యకారులకు అబద్ధాలు చెబుతున్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఊదరగొడుతున్నారు. నాలుగేళ్లలో గుర్తుకు రాని అన్నా క్యాంటీన్లు ఇవాళ గుర్తుకు వస్తున్నాయి. అదిగో అన్నా క్యాంటీన్లు వచ్చాయని భ్రమలు కల్పిస్తున్నారు.
– హాస్టళ్లలో నాలుగేళ్లలో ఒక్కసారి కూడా మెస్‌ చార్జీలు పెంచలేదు. ఇప్పుడేమో కోడికూర పెడతారట. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయని హోంగార్డులు, వీఆర్‌వోలు, అంగన్‌వాడీలకు వేతనాలు పెంచారు. ఇది కూడా పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం కంటే తక్కువే. వచ్చే ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని ప్రచారం చేయించుకుంటున్నారు.
– నాలుగేళ్ల పాటు ప్రత్యేకహోదాను నీరుగార్చారు. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం చంద్రబాబుకు సంబంధించిన ఎంపీ నిరాహారదీక్ష. నాలుగేళ్లుగా భూములు ఇవ్వమంటే పట్టించుకోలేదు. ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని బిల్డప్‌ ఇస్తున్నారు.
– ఉద్యోగస్తులు సీపీఎస్‌ రద్దు చేయాలని అడుగుతున్నారు. చంద్రబాబు పదో పీఆర్‌సీ బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. మూడు డీఏలు పెండింగ్‌లో పెట్టారు. ఇదే ఉద్యోగస్తులలో కొంత మందితో సన్మానాలు చేయించుకుంటున్నారు. ఇటువంటి అన్యాయమైన, మోసం చేసే పాలన దేశ చరిత్రలో ఎక్కడా ఉండదేమో ఏపీలో తప్ప.
–ఇటువంటి అన్యాయమైన పాలన పోవాలి. ఎవరైనా ఫలానిది చేస్తానని చెప్పి చేయకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే ఈ వ్యవస్థలో నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం వస్తుంది. ఈ వ్యవస్థ మారాలంటే జగన్‌కు మీ అందరి తోడు, ఆశీర్వాదం కావాలి. 
– చంద్రబాబు మోసాలను పొరపాటున క్షమిస్తే..రేపు పొద్దున ఏం చేస్తారో తెలుసా? చిన్న చిన్న అబద్ధాలు, మోసాలకు నమ్మరని ఆయనకు బాగా తెలుసు. రేపు ఎన్నికల్లో ఏమంటారో తెలుసా? 98 శాతం హామీలు నెరవేర్చారని చెవుల్లో క్వాలీఫ్లవర్‌ పెడతారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా?దానికి బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటారు. అయినా నమ్మరని చంద్రబాబుకు బాగా తెలుసు..అందుకే ప్రతి ఇంటికి చంద్రబాబు తన మనిషిని పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. డబ్బులు  ఇస్తే మాత్రం వద్దనకండి..రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం వేయండి. అబద్ధాలు ఆడే వారిని, మోసాలు చేసే వారిని బంగాళఖాతంలో కలపండి.
– ఇటువంటి అన్యాయమైన పాలన పోయి..మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలని నవరత్నాలు ప్రకటించాం. ఈ మీటింగ్‌లో కొన్ని అంశాలు మాత్రమే చెబుతున్నాను.
– సంక్షేమ పథకాలు పేదవాడికి అందాలంటే గవర్నమెంట్‌లో పని చేసే ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి. అప్పుడే పేదవారి కోసం పని చేస్తారు. సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని ఉద్యోగస్తులు అడుగుతున్నారు. రిటైర్డ్‌ అయిన తరువాత పనింఛన్‌ రాకపోతే ఎలా బతకాలని అడుగుతున్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీపీఎస్‌ విధానం రద్దు చేస్తానని చెబుతున్నాను. రిటైర్డ్‌మెంట్‌ తరువాత తిరిగి చూసుకుంటే ఏమి కనిపించడం లేదు. ప్రతి ఉద్యోగికి కూడా ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని మాట ఇస్తున్నాను. మూడు డీఏలు పెండింగ్‌లో పెట్టారు. వేతనాలు బకాయిలు ఉన్నాయి. ఉద్యోగులకు రావాల్సిన ప్రతిది సకాలంలో వచ్చేలా చూస్తాను.
– ఇవాళ మన పిల్లలను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా చదివించే స్థాయిలో ఉన్నామా? ఇంజినీరింగ్‌ ఫీజులు ఏడాదికి లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చేది ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. మిగతా ఫీజులు కట్టేందుకు ఆ తల్లిదండ్రులు ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి మార్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేసి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండేవారు. మహానేత మరణించిన తరువాత మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఈ పరిస్థితి మార్చుతాను. పేదవాడి కోసం నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా జగన్‌ అనే  నేను రెండు అడుగులు వేస్తాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది. అంతే కాదు హాస్టల్‌లో ఉండి చదువుకునే వారికి మెస్‌ చార్జీలు, బోర్డింగ్‌ చార్జీల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇచ్చి తోడుగా ఉంటాను. అలాగే మీ చిట్టి పిల్లలను ఏ బడికి పంపించినా కూడా ఆ తల్లి ఖాతాలో ప్రతి ఏడాదికి రూ.15 వేలు ఇచ్చి ప్రోత్సహిస్తాను. ఇందులో కూడా ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే నేను ఎక్కడ ఉంటానో మీ అందరికి తెలుసు. ఎవరైనా అర్జీలు తీసుకుని రావచ్చు. చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.


 
Back to Top