బాబు తానా అంటే..ఎల్లో మీడియా తందానా


– పోలవరం ప్రాజెక్టు వద్ద పని తక్కువ ..ప్రచారం ఎక్కువ 
– ప్రతి సోమవారం పోలవరం సినిమా చూపిస్తున్నారు
– బాబు చేసేందంతా అవినీతి..చూపించేంది సినిమా
–పోలవరం పునాది కూడా పూర్తి కాలేదు..అప్పుడే జాతికి అంకితమట
– అవినీతి సొమ్ముతో బాబు హైదరాబాద్‌లో ఇంద్రభవనం కట్టుకున్నారు
– వైయస్‌ఆర్‌ హయాంలో పోలవరంలో అత్యధిక శాతం పనులు జరిగాయి
– కాటన్‌ దొర స్థాయిలో వైయస్‌ఆర్‌ ఈ ప్రాంతానికి మేలు చేశారని చెబుతున్నారు
– బీజేపీతో కలిసినంత కాలం బాబుకు సమస్యలు గుర్తుకు రావు. 
– బీజేపీ–టీడీపీ నాలుగేళ్లు కాపురం చేశాయి
– కేంద్రంలో టీడీపీ రెండు మంత్రి పదవులు కూడా తీసుకుంది
– కడప స్టీల్‌ ఫ్యాక్టరీ బాబుకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?
– ప్రభుత్వ సొమ్ముతో పార్టీ పనులు చేయించుకుంటున్నారు
– మహిళా సాధికారిక మిత్రలు టీడీపీ బూత్‌ కమిటీ సభ్యులు
– 35 కుటుంబాలకు ఒక బూత్‌ కమిటీ సభ్యులట
– సీఎం చంద్రబాబే దళారీలకు నాయకుడు
– బాబు నటన చూస్తే ఆస్కార్‌ ఉత్తమ విలన్‌ అవార్డు ఆయనకే వస్తోంది
– కుటీర పరిశ్రమల మీద కూడా బాబు కరెంటు చార్జీలు పెంచారు
– రాష్ట్రంలో రాజ్యంగం లేదు. చట్టాలు లేవు
– మరుగుదొడ్లకు కూడా లంచాలు ఇవ్వాల్సిందే
– బాబు పాలనలో మందు షాపు లేని గ్రామం ఉందా?
 – మీ పిల్లల చదువులకు ఎన్ని లక్షలు ఖర్చైనా భరిస్తాం
– హాస్టల్‌ ఫీజు కింద రూ.20 వేలు
– చిట్టి పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తాం

తూర్పు గోదావరి: చంద్రబాబు పాలనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. నాలుగేళ్ల పాలనలో ఇసుక, మట్టి దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు ఏనాడు కడప స్టీల్‌ ఫ్యాక్టరీ గుర్తుకు రాలేదని ధ్వజమెత్తారు. పోలవరం అంచనాలు విఫరీతంగా పెంచి దోచుకున్నారని, అవినీతి సొమ్ముతో హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంద్రభవనం కట్టుకున్నారని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 190వ రోజు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

ఈ రోజు పొద్దటి నుంచి ఎండలతో పాటు చెమట కూడా తీవ్రంగా ఉంది. ఎండను, చెమటను లెక్క చేయకుండా నా వెంట వేలాది మంది అడుగులో అడుగులు వేశారు. ఒక వైపు కష్టాలు చెప్పుకుంటూ..మరో వైపు నా భుజాన్ని తడుతూ..అన్నా..మీ వెంటే ఉంటామని చెబుతున్నారు. ఇవాళ ఈ దుమ్ములో, దూళిలో నిలవాల్సిన అవసరం ఏ ఒ క్కరికి లేదు. ఇవేవి లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయతలు పంచుతునారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. ఆత్మీయతలు చూపుతున్నారు. మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు.
– ఈ రోజు ఈ ప్రాంతానికి రాగానే ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు నిజంగా చంద్రబాబు ఈ మాటలు వింటూ ఆయన తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లల్సిందే. అన్నా..మేం చాలా సినిమాలు చూస్తుంటాం. నెలకు ఒకటో రెండు సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. ఇదేం సినిమానో అర్థం కావడం లేదు. వారం వారం పోలవరం అంటూ సినిమా చూపిస్తున్నారు. పోలవరంలో పని తక్కువ..ప్రచారం ఎక్కువ అంటున్నారు. చేసేందంతా అవినీతి..చూపించేదంతా సినిమా. చంద్రబాబు మాత్రం పోలవరం సొమ్ముతో హైదరాబాద్‌లో ఇంద్రభవనం కట్టించుకున్నారు. ఆయన చూపిస్తున్నది సినిమా..డ్రామా అని ప్రజలకు తెలిసిపోయింది. ఆయన నటనకు తానా తందానా అంటే ఆయన ఎల్లో మీడియా. పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా చూపిస్తున్నది ఆశ్చర్యకరంగా ఉంది. పోలవరం ప్రాజెక్టులో పునాది గోడ కట్టి జాతికి అంకితం చేసిన నాయకుడు చంద్రబాబు ఒక్కరే. ఒకే ప్రాజెక్టుకు ఐదు సార్లు శంకుస్థాపన చేశారు. ఆరోసారి ఏకంగా జాతికి అంకితం చేశారు. ఇవన్నీ కూడా ఎల్లోమీడియా డయాఫ్రం వాల్‌ను చంద్రబాబు గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా కట్టినట్లుగా బిల్డప్‌. ఆయనే డయాఫ్రం వాల్‌ కనిపెట్టినట్లు బిల్డప్‌. దానికి ఆ పేపర్లు రాయడం..టీవీలు చూపించడం చూస్తే..ఇంతకన్న దిక్కుమాలని ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? 
– చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి చేసింది ఏంటో? పోలవరం ప్రాజెక్టు పనులు నాలుగేళ్లలో 20 శాతం కూడా పూర్తి కాలేదు. ఈయన మాత్రం మైక్‌ తీసుకుని 55 శాతం పూర్తి చేశానని గొప్పగా చెబుతున్నారు. ఆయన చెప్పే పనుల్లో 70 శాతం పనులు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి  హయాంలో పూర్తి అయినట్లు మాత్రం చంద్రబాబు చెప్పడం లేదు. ఈయన పోలవరం గురించి మాట్లాడటం ఆశ్చర్యం. పోలవరంలో ఇంతవరకు 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తి కాలేదు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారు. ఆ ప్రాజెక్టులో 50 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రిట్‌ పనుల్లో ఇప్పటికే 70 శాతం పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టు కడితే కిందకు నీళ్లు రావు. పోలవరాన్ని యుద్ధప్రాతిపాదిక పూర్తి చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని చంద్రబాబు కేంద్రంతో లాలూచిపడి తానే కడుతానని తీసుకున్నారు. ఈయన తీసుకున్న తరువాత పోలవరం ఖర్చుల వ్యయం రూ.53 వేల కోట్లకు పెంచుకున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక  ప్రతిది కూడా రేట్ల తగ్గాయి. పోలవరం ప్రాజెక్టులో మాత్రం చంద్రబాబు లంచాల కోసం విఫరీతంగా అంచనాలు పెంచారు. ఆ ప్రాజెక్టులో సబ్‌ కాంట్రాక్టర్లుగా తన బినామీలను నామినేషన్‌ పద్దతిలో తీసుకొచ్చారు. యనమల రామకృష్ణుడు ఈ సబ్‌ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఈ పెద్ద మనిషి పోలవరం అన్న ప్రాజెక్టును కట్టి రాష్ట్రానికి అందించాల్సింది పోయి..పోలవరం ప్రాజెక్టును లంచాల కోసం పిండి రాష్ట్రాన్ని బలహీన స్థితిలోకి తీసుకొచ్చారు. 
– అన్నా..చంద్రబాబు ఈ మధ్య కాలంలో ర్యాలీ ఫర్‌ రివర్స్‌ అంటూ మాతో ప్రమాణం చేయించారని పిల్లలు వచ్చి చెబుతున్నారు. ఈయన చేసింది ఏంటో చూడండన్నా..గోదావరి నదిని ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నారని ఇ క్కడి పిల్లలు చెబుతున్నారు. పిల్లలు కూడా చంద్రబాబును గమనిస్తున్నారు. అన్నా..మందపల్లి, అత్రేయపురం, తదితర గ్రామాల నుంచి ఇసుక రీచ్‌ల ద్వారా లక్షల టన్నుల ఇసుకను తొడుతున్నారన్నా అని చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం ఇసుక ఫ్రీ అంటారు. మాకు మాత్రం ఒక ట్రాక్టర్‌ కూడా ఉచితంగా ఇ వ్వడం లేదన్నా అంటున్నారు. మా పేరు చెప్పి వేలాది లారీల ఇసుకను తరలిస్తున్నారని చెబుతున్నారు. 
– చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటున్నారు. మీకు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారా? లేదు. ఇసుక టీడీపీ నాయకులు మాత్రమే ఫ్రీ.. కలెక్టర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా, చిన్నబాబు, పెద్దబాబు వరకు ఇసుక నుంచి లంచాలు వెళ్తున్నాయి. ఇవాళ దోచే కార్యక్రమాన్ని చూసి ఆశ్చర్యమనిపించింది. చివరకు ఇసుక, మట్టిని వదలిపెట్టడం లేదు. ఇలా దోచుకోవచ్చు అన్నది ఒక్క చంద్రబాబుకే తెలుసు.
–  రైతులు నా వద్దకు వచ్చి అన్నా..వరి వేసుకున్నాం. వరిని రూ.1130కి కొనుగోలు చేసే నాథుడు లేడన్నా..అంటున్నారు. అరటి సాగు ఈ ప్రాంతం బాగా ప్రసిద్ధి, ఇక్కడ ఎ్రరచెక్కర కేళి, అమృతం వంటి రకాలు పండిస్తున్నారు. పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెదరు క్రరలకు లక్షపైగా ఖర్చు అవుతుంది. మాకు ఈ రేటు గిట్టుబాటు ధర రావడం లేదన్నా అంటున్నారు. ఇంతకన్న తక్కువ క్వాలిటీ ఉన్న అరటì  హెరిటేజ్‌ షాపులో కేజీ రూ.35కు అమ్ముతున్నారు. రైతులకు మాత్రం రూ.20 కూడా రావడం లేదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ వ్యక్తి దళారీలకు నాయకుడిగా ఉన్నారు. మన ఖర్మకొద్ది మన సరుకును హెరిటేజ్‌లో పెట్టి మూడింతల రేట్లకు అమ్ముతున్నారు.  ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు.

–  అన్నా..అప్పుడెప్పుడో కాటన్‌ దొర గురించి విన్నామన్నా. మా ప్రాంతానికి సంబంధించిన కెనాల్‌ను అభివృద్ధి చేశారని గొప్పగా చెబుకుంటాం. ఆ తరువాత మా ప్రాంతానికి కాటన్‌ దొర తరువాత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అని చెబితే గర్వంగా అనిపించింది. పోలవరాన్ని పనులు పరుగులు పెట్టించారని చెప్పారు. గోదావరి పొంగుతున్నప్పుడు వరదలు రాకుండా ఉండేందుకు ఏటిగట్లు ప్రతిష్టంగా చేయించారని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఒక వ్యక్తి మంచి చేసి చనిపోయిన తరువాత ఇంత గొప్పగా చెబుతుంటే ఆనందమనిపించింది.
– నాన్నగారి హయాంలో ఇదే నియోజకవర్గంలో 13 వేల ఇల్లు కట్టించారు. 98 ఎకరాలను సేకరించి వేలాది మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిది. చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టించలేదంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఉపాధి లేదు..ఉద్యోగాలు రావడం లేదు. చంద్రబాబు మాత్రం తన సుందర ముఖారవిందాన్ని చూసి రాష్ట్రంలో 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఊదరగొడుతున్నారు. ఉన్న కుటిర పరిశ్రమలు మూతవేస్తున్నామని చెబుతుంటే ఆశ్చర్యమనిపించింది. ఆత్రేయపురంలో పూతరేకులకు ఫేమస్‌. ఆ కుటిర పరిశ్రమలో పనిచేసే అక్కచెల్లెమ్మల పరిస్థితి ఏంటంటే..చంద్రబాబు సీఎం అయ్యాక రోళ్ల మీద కూడా కరెంటు చార్జీలు పెంచారని చెబుతున్నారు. యూనిట్‌కు రూ.8 చెల్లించాల్సి వస్తుంది. ఒకవైపు కరెంటు బాదుడు. మరోవైపు జీఎస్‌టీ అంటూ బాదుడే బాదుడు. 5 నుంచి 12 శాతం రాబడుతున్నారు.
– నార్కేడ్‌పల్లి పచ్చళ్లు అమ్ముకునే వారి పరిస్థితి అంతే. కేజీ రూ.100 వరకు కూడా అమ్ముకోవడం లేదు. ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకోవాలంటే వెంటనే ఆర్టీఏ అధికారులు వచ్చి ట్యాక్సీలు కట్టాలని వేధిస్తున్నారు. కుటీర పరిశ్రమల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు బాధపడుతున్నారు. ఇంతకన్న దౌర్భగ్యమైన సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా?
– నాలుగేళ్లుగా ఈ పెద్ద మనిషి పరిపాలన చూశాం. అన్నా..సీపీఎస్‌ రద్దు చేయాలని ఉద్యోగస్తులు అంటున్నారు. ఉద్యోగ విరమణ తరువాత ఎలా బతకాలని అడుగుతున్నారు. ఆశా వర్కర్లు ఆరోగ్యశ్రీకి వారే దీపాలు. వారికి జీతాలు లేవు. పక్కన తెలంగాణలో రూ.6 వేలుఇస్తున్నారు. అంగన్‌వాడీలకు సంబంధించిన అక్కచెల్లెమ్మలకు నాలుగు నెలలుగా జీతాలు లేవు. పిల్లలకు అన్నం వండిపెడుతున్నా బిల్లులు లేవు. మహిళా సాధికారిత అన్నది ఎవరైనా ఆశీస్తారు. ప్రతి అక్కచెల్లెమ్మ లక్షాధికారి కావాలని అప్పట్లో వైయస్‌ఆర్‌ గొప్ప స్వప్నాన్ని చూశారు. అప్పట్లో వీఏవోలను, యానిమేటర్లను నియమించి పొదుపు సంఘాలను బలోపేతం చేసి వారికి పావలా వడ్డీకే రుణాలు ఇప్పించారు. ఇవాళ అలాంటి గ్రూపులకు రుణాలు అందడం లేదు. ఎప్పుడో ఒకసారి మా బతుకులు మారుతాయని, వైయస్‌ జగన్‌ సీఎం అవుతారని ఆశతో బతుకుతున్నారు. ఇవాళ చంద్రబాబు మహిళా సాధికారిత మిత్రలను ఏర్పాటు చేసుకున్నారు. వీరు బూత్‌ కమిటీ సభ్యులు. వారు పార్టీ పని చేస్తే..ప్రభుత్వం వేతనాలు ఇస్తుందట. 35 ఇళ్లకు ఒకరట. వీరు ఇంటింటికి వెళ్లి ప్రజలకు చంద్రబాబు గొప్పగా చేస్తున్నారని ప్రచారం చేయడం వీరి పని. ప్రభుత్వ జీతాలు ఇచ్చి పార్టీ పని చేయించుకుంటున్నారు. ఇంతకన్న దిక్కుమాలిన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండరు.
– చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రాజ్యంగం లేదు. చట్టాలు వర్తించడం లేదు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. అడ్డగోలుగా 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేశారు. వారిపై అనర్హత వేటు వేయకుండా కాపాడుతున్నారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ము చంద్రబాబుకు లేదు.
– ఇసుక, మట్టి, మద్యం, బొగ్గు, కరెంటు కొనుగోలు, కాంట్రాక్టులు, రాజధాని, విశాఖపట్నం భూములు వదలడం లేదు. చివరకు గుడి భూములు కూడా వదలడం లేదు. పైన చంద్రబాబు దోచుకుంటున్నారు. కింద గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలకు అప్పగించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలే. ఒక్కసారి ఈ పాలన గమనించండి.
– ఎన్నికలకు ముందుకు చంద్రబాబు ఏమన్నారు. పిల్లలు తాగి చెడిపోతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత తాగుడు తగ్గిస్తాను.బెల్టు షాపులు లేకుండా చేస్తా అన్నారు. ఇవాళ ఏదైనా గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉందో లేదో తెలియదు కానీ..ఏ గ్రామంలోనైనా మందు షాపు లేని గ్రామం ఉందా? ఈయనగారి కంప్యూటర్‌ పరిపాలనలో ఫోన్‌ కొడితే మినరల్‌ వాటర్‌ ఇంటికి రావడం లేదు..ఫోన్‌ కొడితే మందు ఇంటికి వస్తోంది. ఈ పాలనను గమనించండి. 
– చంద్రబాబు ఎన్నికలప్పుడు ఏమన్నారు. కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి..వస్తేనే తగ్గిస్తా అన్నారు. నాలుగేళ్ల తరువాత కరెంటు బిల్లులు ఎంతోస్తున్నాSయి. గతంలో రూ.50, 70, రూ.100 వచ్చేది. ఇవాళ కరెంటు బిల్లులు రూ.500, 1000 వరకు వస్తుంది. పెట్రోలు ధరలు బాదుడే బాదుడు. లీటర్‌కు రూ.7 బాదుడే బాదుడు. ఈయన ముఖ్యమంత్రి అయ్యేందుకు చంద్రబాబు ఏమన్నారు. రైతుల రుణాలన్నీ పూర్తిగా, బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫి కాలేదు. చిన్న పిల్లలను కూడా బాబు మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి నెలకు రూ.2 వేలు ఇస్తామన్నారు. ఇంత వరకు ఒక్క ఉద్యోగం లేదు. ఒక్క రూపాయి నిరుద్యోగ భృతి చెల్లించలేదు. నాలుగేళ్లు గుర్తుకు రాలేదు. ఆరు నెలల్లో ఎన్నికలు ఉంటే చంద్రబాబు ప్రజలు గుర్తుకు వస్తారు. కోటీ 70 లక్షల ఇల్లులు ఉంటే ఇప్పుడు కేవలం 10 లక్షలకు తీసుకొచ్చారు. ఇంటికి రూ.1000 చొప్పున చివరి నాలుగు నెలలు ఇస్తారట. ఇంతకన్న అన్యాయమైన సీఎం ఉంటాడా? నాలుగేళ్ల చంద్రబాబు హయాంలో పరిస్థితి చూస్తే..ఏదైనా పండగొస్తేఆర్టీసీ బస్సు ఎక్కాలంటే భయపడుతున్నారు. కొత్త సినిమా వస్తే టికెట్లు బ్లాక్‌లో అమ్ముతుంటారు.  ఇవాళ ఆర్టీసీ టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఇంతగా వ్యవస్థ దిగజారిందంటే ఇంతకన్న దారుణం ఉంటుందా? ఏఎన్‌ఎంలు, లెక్చరర్స్‌ ధర్నాలు చేస్తున్నారు. ఆసుపత్రిలో పసిపిల్లలను ఎలుకలు కొరికి చంపుతున్నాయి. బాబు హయాంలో రుణాలు మాఫీ కాలేదు. గిట్టుబాటు ధర అంతంటే. సాగునీరు లేదు. పేదలకు ఇల్లు లేదు. భూ పంపిణీ లేదు. కరెంటు, పెట్రోలు, ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు. చౌక దుకాణంలో బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. వేలి ముద్రలుపడటం లేదని కోతలు విధిస్తున్నారు. చివరకు స్కూల్‌ ఫీజులు చూస్తే బాదుడే బాదుడు. నారాయణ, చైతన్య అంటున్నారు. బాదుడే బాదుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా రూ.30 వేలకు మించి ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ పరిస్థితి అనారొగ్యపరిస్థితి. ఏ వ్యవస్థ చూసినా అవినీతిమయం. ఇవాళ రాష్ట్రంలో గొప్ప డ్రామాలు, యాక్టింగ్‌ జరుగుతోంది. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తోంది. ఆస్కార్‌ ఇచ్చే వారు ఏపీకి వచ్చి చూస్తే..మన సీఎం చేసే సినిమాలు, డ్రామాలు చూస్తే..ఉత్తమ విలన్‌ ఎవరికి పోదు..బాబుకే దక్కుతుంది. ఏ స్థాయిలో డ్రామాలంటే..కడపపై టీడీపీకి విపరీతమైన ప్రేమ. కడపకు స్టీల్‌ ఫ్యాక్టరీ రావడం లేదా? మేం ధర్నాలు చేస్తామంటూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నోట్లో నుంచి ఈ స్టేట్‌మెంట్‌ చూస్తే ఆశ్చర్యమనిపించింది. నాలుగేళ్లు బీజేపీతో టీడీపీ రొమాన్స్‌ చేసి సంసారం చేశారు. ఆ కాపురంలో కూడా ఒకరికి ఒకరు గొప్ప అంటూ పొగడుకున్నారు. కొత్త దంపతులు సంసారం చేసినట్లు చేశారు. వీరికి సాక్షంగా ఇద్దరు పిల్లలను కన్నారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులు. నాలుగేళ్లు చంద్రబాబుకు ప్రత్యేక హోదా, కొల్లేరు, దుగ్గిరాజపట్నం పోర్టు గుర్తుకు రాలేదు. నిరుడు జనవరి 27న ‘‘మనమే ఎక్కువ సాధించాం’’ చంద్రబాబు స్టేట్‌మెంట్‌. ఏ రాష్ట్రానికైనా ఇంతకన్న ఎక్కువ వచ్చిందా? ప్రతిపక్షానికి చంద్రబాబు సవాల్‌. నాలుగేళ్లలోబీజేపీని తిట్టడు. స్టీల్‌ ఫ్యాక్టరీని పట్టించుకోడు. ఆరు నెలల్లో ఎన్నికలు అని పెళ్లాని గబ్బు లేపడానికి బీజేపీని తిడుతున్నారు. నాపని అయిపోయిందని విడాకులు ఇచ్చిన తరువాత బీజేపీపై నిందలు. కాపులను బీసీలుగా మార్చాలన్నా..బోయలను ఎస్టీలుగా మార్చాలన్నా కేంద్రానిదే తప్పు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ గురించి కోర్టులో అఫిడవిట్‌ వేసే సమయంలో ఈ విషయాన్ని చంద్రబాబుకు ఎప్పుడో చెప్పామని కేంద్రం చెబుతోంది. ఇలాంటి అన్యాయమైన ముఖ్యమంత్రిని పొరపాటున క్షమించొద్దు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం రావాలి. ఏదైనా హామీ ఇచ్చి చేయకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. ఈ వ్యవస్థ బాగుపడాలంటే జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు, సహాయం కావాలి. వ్యవస్థలోకి మార్పు రావాలి.
– పొరపాటున ఇలాంటి అన్యాయం చేసే వ్యక్తులను క్షమిస్తే..రేపొద్దున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు మీ వద్దకు వచ్చి ఏం చెబుతారో తెలుసా? చిన్న చిన్న అబద్దాలు చెబితే నమ్మరని తెలుసు. రేపు ఎన్నికల్లో ఏం చెబుతారో తెలుసా? నేను చెప్పినవన్నీ 98 శాతం పూర్తి చేశానని అంటారు. అన్ని పూర్తి చేశాను కాబట్టి కొత్తవి చెబుతున్నా వినండి అంటారు. ఈ సారి నాకు ఓటేస్తే..ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా? నమ్మురు కాబట్టి ప్రతి ఇంటికి బెంజి కారు ఇస్తానంటారు. ప్రతి ఇంటికి మనిషిని పంపించి ప్రతి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బులిస్తే వద్దనకండి. రూ.5 వేలు కావాలని డిమాండు చేయండి. ఆ డబ్బంతా మనదే..మన జేబుల్లో నుంచి దోసేందిందే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయమని కోరుతున్నాను. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసేవారిని బంగాళఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురండి.
–రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాను. ఈ రోజు నవరత్నాల్లో నుంచి చదువుకునే పిల్లలకు ఏం చేస్తామన్నది చెబుతున్నాను.
– ఇవాళ చదువుకోవాలంటే గగనమైంది. ఇవాళ మన పిల్లలు ఇంజినీరింగ్, డాక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితిలో ఉన్నామా? ఏం చదివించాలన్నా..ఏడాదికి లక్షల్లో ఫీజులు, ప్రభుత్వం మాత్రం రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇ స్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. పేదవాడు పేదరికం నుంచి ఎప్పుడు బయటపడతాడంటే..ఆ కుటుంబం నుంచి ఒక్కడైనా ఇంజినీర్, డాక్టర్‌ కావాలి. నాన్నగారు చనిపోయిన తరువాత కథ మొదటికొచ్చింది. ఇవాళ మన పిల్లలను స్కూల్‌కు పంపించాలంటే ఫీజుల బాదుడే బాదుడు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత..నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..నాన్నగారి కొడుకుగా జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా నేను చదివిస్తాను. ఉచితంగా చదివించడమే కాకుండా..ప్రతి పిల్లాడికి చెబుతున్నాను. హాస్టల్‌ ఖర్చులకు ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం. అంతేకాదు..చిన్న పిల్లలను బడికి పంపిస్తే..తల్లి ఖాతాలో రూ.15 వేలు జమా చేస్తాం. నవరత్నాల్లో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నా..నేను ఎక్కడ ఉంటానో మీ అందరికి తెలుసు. ఎవరైనా రావచ్చు..అర్జీలు ఇవ్వవచ్చు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని చెబుతున్నాను. మీ అందరికి మరోమారు పేరు పేరు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నా..
 
Back to Top