చంద్రబాబు సీఎంగా అర్హుడా?



– నాలుగేళ్లుగా చంద్రబాబు అమరావతి, పోలవరం సినిమాలు చూపిస్తున్నాడు
– మోసం చేయడంలో బాబు పీహెచ్‌డీ చేశారుl
– పోలవరం చంద్రబాబు కల అంటున్నారు
– గోదావరి పుష్కరాల్లో 29 మందిని బాబు పొట్టన పెట్టుకున్నారు
– దేవుడి సొమ్మును కూడా లూటీ చేసిన వ్యక్తి చంద్రబాబు
–బాబు పాలనలో దయ, కరుణ అన్న పదాలకు అర్థమే లేదు
– రాష్ట్రంలో రాజ్యంగం లేదు. చట్టాలు వర్తించవు
– అక్కచెల్లెమ్మలకు కూడా వెన్నుపోటు పొడిచారు
– రాష్ట్రంలో ఏ వ్యవస్థ చూసినా అవినీతిమయమే
– దారుణంగా, దుర్మార్గంగా చంద్రబాబు పాలన
– చంద్రబాబు మెదుడు ఓ క్షుద్ర ప్రపంచం
– అవినీతిలో ఏపీ నంబర్‌ వన్‌ అని జాతీయ సర్వేలు చెబుతునాయి
– చంద్రబాబు ప్రతి వర్గాన్ని మోసం చేశారు
– మీ అందరీ ఆశీస్సులు కావాలి
– పేదవాడి కోసం వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు
– 108కు ఫోన్‌ కొడితే 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వస్తుందనే నమ్మకం ఉందా?
– క్యాన్సర్‌ పేషెంట్‌కు రూ.7 నుంచి 8 లక్షలు ఖర్చు చేయాలి
– వెయ్యి రూపాయల బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం
 

రాజమహేంద్రవరం: చంద్రబాబు అనే విలన్‌ ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడా అని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 187వ రోజు మంగళవారం వైయస్‌ జగన్‌ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. సాయంత్రం రాజమహేంద్రవరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

– ఈ జిల్లాలో ఈ రోజు అడుగుపెడుతూనే మీరిచ్చిన స్వాగతాన్ని ఈ జన్మలో మరిచిపోలేను. కన్నులెత్తి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం లేదు. ఇసుక వేస్తే రాలనంతగా ఈ రోజు నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఈ ఒక్కరికి కూడా ఇలా నడిరోడ్డుపై నిలవాల్సిన అవసరం లేదు. ఏఒక్కరికి కూడా ఈ ఎండా,వానలో నడవాల్సిన అవసరం లేదు. వానను, ఎండను, చెమటను, దుమ్మును పట్టించుకోకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపుతున్నారు. ప్రేమానురాగాలు చూపుతున్నారు. ఆత్మీయతలు పంచుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు
– ఈ రోజు జిల్లాలో అడుగుపెడుతూనే మొట్ట మొదటగా నాకు చెప్పింది ఏంటో తెలుసా? అన్నా..పోలవరం ప్రాజెక్టు చూడండన్నా..ఎలా ఉందో? దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు పరుగులు తీసిందన్నా..ఈ రోజు నత్తనడకనా సాగుతుందన్నారు. చంద్రబాబు రెండు అబద్ధాల సినిమాలు చూపిస్తున్నారు. ఒకటి అమరావతి సినిమా..మూడు నెలలకు, ఆరు నెలలకు గ్రాఫీక్స్‌ చూపించి అదిగో సింగపూర్, ఇదిగో జపాన్‌ అంటారు. గత నాలుగేళ్లుగా అమరావతి సినిమా చూపిస్తున్నారు. రెండో సినిమా పోలవరం ప్రాజెక్టు. ఈ సినిమాలో కాస్తా కలెక్షన్లు రాబట్టడానికి సోమవారం సోమవారం పోలవరం అంటారు. విషయం ఏంటంటే అమరావతి అన్న సినిమాలో నాలుగేళ్లు అయ్యింది ఇంతవరకు ఒక్క ఇటుక కూడా పడలేదు. ఈ సినిమాలో చాలా గొప్పగా చూపిస్తారు.
– పోలవరం ప్రాజెక్టు రెండో సినిమా. ఈ ప్రాజెక్టు పరిస్థితి పునాది దాటడం లేదు. ఈ రోజే మనం చూశాం. డయాఫ్రం వాల్‌ అంటే కేవలం పునాది గోడ. పునాది వేసి శంకుస్థాపన చేసిన చంద్రబాబు దీన్ని జాతికి అంకితం చేశారు. ఇంతవరకు కేవలం 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని జరగలేదు. ఇదే ప్రాజెక్టు 55 శాతం పూర్తి అయ్యిందని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. ఇందులో 70 శాతం పనులు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాదా పూరై్తంది. అయినా చంద్రబాబు సినిమా చూపిస్తారు. ఈ రోజు పునాది గోడలు జాతికి అంకితం చేస్తే ఎలా ఉందంటే. ఒక ఇల్లు కట్టడానికి ఆరుసార్లు శంకుస్థాపన చేసినట్లు ఉందన్నారు. ఇంటి నిర్మాణం పూర్తి కాకముందే గృహ ప్రవేశం చేసినట్లుగా ఉంది. చంద్రబాబు మోసం చేయడంలో పీహెచ్‌డీ తీసుకున్నారు. 
– పోలవరం ప్రాజెక్టు చైనాలోని ప్రాజెక్టు కంటే గొప్పదట. ఆయన కల పోలవరం ప్రాజెక్ట్‌ అంటున్నారు. 195 నుంచి 2004 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అప్పట్లో పోలవరం గురించి ఎందుకు పట్టించుకోలేదు బాబూ? ఇదే పెద్ద మనిషికి చిత్తశుద్ది ఎలాంటిది అన్నది ఆ రోజుల్లో వడ్డి వీరభద్రరావు చంద్రబాబు గురించి మాట్లాడారు. పోలవరం కోసం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడగని రోజు లేదని టీడీపీ ఎమ్మెల్యేనే విమర్శించారు. ఆయన పట్టించుకోలేని పరిస్థితి చూసి వడ్డీ వీరభద్రరావు ఢిల్లీకి సైకిల్‌పై వెళ్లి కేంద్రానికి వివరించారు. ఆ తరువాత కూడా చంద్రబాబులో ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైయస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం మీద చూపిన ప్రేమకు ముగ్ధుడై కాంగ్రెస్‌లో చేరారు. ఇంత దారుణంగా చంద్రబాబు చిత్తశుద్ది ఉందని ఆ పార్టీ నేతలే పేర్కొన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు ఆటంకాలు సృష్టించారు. ఈ తరుణంలో వడ్డీ వీరభద్రరావు పోలవరం వద్ద చంద్రబాబు తీరుపై గుండు గీయించుకున్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు రూ.58 వేల వరకు అంచనాలు పెంచారు. ఈ ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తానని చెప్పి..ఇప్పుడేమో 2019లో పూర్తి చే స్తానని చెవిలో పువ్వులు పెడుతున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.13 వేల కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు అసలు మనిషేనా? నాలుగేళ్లలో ఆయన ఈ ప్రాజెక్టుకు ఎంత కేటాయించారు. 
– అన్నా..చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు. భక్తి లేదు. దేవుడి సొమ్ము ఎవరైనా తిన్నారంటే అంతకంటే పాపాత్ముడు ఎవరు లేరంటారు. చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడు అంటే గోదావరి పుష్కరాల పేరుతో రూ.2 వేల కోట్లు దుర్వినియోగం చేశారు. ఘాట్ల నిర్మాణం, రోడ్డు నిర్మాణాలంటే వర్కులన్నీ కూడా తన బినామీలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 
– భక్తితో, త్రికరణశుద్ధితో చేయాల్సిన పనిని కూడా రాజకీయ కోణంలో చూసే వ్యక్తి సీఎం పదవికి అర్హుడా? పుష్కరాల్లో షూటింగ్‌ పేరుతో సినిమా హీరోగా కనిపించాలని ఆరాటపడి..చంద్రబాబు వీఐపీ ఘాట్లో స్నానం చేయకుండా పుష్కరఘాట్‌కు వచ్చి తాను తీసే సినిమాలో చక్కగా పడాలని ప్రజలను ఆపేశారు. ఒక్కసారిగా భక్తులను వదలడంతో తొక్కిసలాటలో 29 మందిని బలి తీసుకున్న చంద్రబాబు అనే విలన్‌ రాజకీయాల్లో ఉండటానికి అర్హుడేనా?
– ఇదే నియోజకవర్గంలో అడుగుపెట్టగానే ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు..అన్నా..గోదావరికి ఇటుసైడ్, అటుసైడ్‌ టీడీపీ నేతలు ఇసుకను వదలడం లేదు. మంత్రి జవహార్, ఇక్కడ ముసలి ఎమ్మెల్యే ఇసుకను దొచుకుంటున్నారు. చిన్నబాబుకు ఇంతా, పెద్ద బాబుకు ఇంత ఇచ్చి దోచుకుంటున్నారని చెప్పారు.
– ప్రతి రోజు మా కళ్ల ముందే వేలాది లారీలతో ఇసుకను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కలెక్టర్లు మాట్లాడటం లేదు. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు, చిన్నబాబుకు, పెద్ద బాబుకు ఇంత కమీషన్లు అందుతున్నాయి.
–నాన్నగారి హయాంలో పోలవరం బాధితులకు 2700మందికి ఇల్లు నిర్మించారు. మిగిలిన వారికి ఇళ్ల స్థలాలు వైయస్‌ రాజశేఖరరెడ్డి పంపిణీ చేశారు. మహానేత చనిపోయిన తరువాత మా ఇళ్ల స్థలాలపై కన్నేసి, చంద్రబాబు లాక్కొని ప్లాట్లు కడుతారని అంటున్నారన్నా అంటున్నారు. పేదవాళ్ల ఇళ్ల స్థలాలు వదలకుండా అవినీతికి పాల్పడుతున్నారు. ప్లాట్ల పేరుతో చంద్రబాబు స్కాంలకు పాల్పడుతున్నారు. ఈ పేదవాడు కంతులు చెల్లిస్తే..చంద్రబాబుకు లంచాలా?
– ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు ప్లాట్లు ఇస్తే ఆ ప్లాట్లు వద్దనకండి. మీ అందరికి హామీ ఇస్తున్నాను. రేపొద్దున దేవుడి ఆశీర్వదించి..మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పేదవాడి మీద ప్లాట్ల కోసం తీసుకున్న అప్పును మాఫీ చేస్తానని మాట ఇస్తున్నాను.
– చంద్రబాబు హయాంలో జరుగుతున్న పాలనను మీరంతా చూస్తున్నారు. నాలుగేళ్లు పూర్తి అయ్యింది. మరో ఆరు నెలలు, ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక్కసారి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. నాన్నగారు ఇదే దారిలో పాదయాత్రకు వస్తే ఇదే రీతిలో నాన్నగారిని ఆశీర్వదించారు. నాన్నగారి పాలనలో మానవత్వం చూశాం. 2003లో పాదయాత్ర పూర్తి అయిన తరువాత మీ ఆశీస్సులతో సీఎం అయ్యాక ఇక్కడి నుంచి 18 స్థానాలు ఇచ్చి ఆశీర్వదించారు. నాన్నగారు పేదవాడికి తోడుగా ఉండే పరిపాలన ఇచ్చారు. నాన్నగారు సీఎం కాకముందు పెద్ద చదువులు చదవాలంటే విశాఖ, గుంటూరుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. నాన్నగారు సీఎం అయ్యాక రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీ తీసుకువచ్చారు. మనసెరిగిన రాజన్న పాలన కాబట్టి అగ్రికల్చర్‌ కాలేజీ తీసుకువచ్చారు. కాకినాడలో జెఎన్‌టీయూ అనుబంధ కళాశాల ఏర్పాటు చేశారు. పోలవరం కుడి, ఎడమ కాల్వలు దాదాపుగా పూర్తి చేశారు. ఇదే జిల్లాలో 3 వేల కోట్లతో గోదావరి డెల్టా కాల్వల ఆధునీకీకరణ పనులు పూర్తి చేశారు. ప్రజల నుంచి వచ్చాడు కాబట్టి ..గోదావరి నదిపై నాలుగో బ్రిడ్జి వచ్చింది. రాజమండ్రిలో ఏయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ పనులు వైయస్‌ఆర్‌ హయాంలోనే మొదలయ్యాయి. పేదరికం పోవాలంటే చదువులు అవసరం అని ఆ మహానేత స్వప్నాన్ని చూశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందించారు. నాన్నగారి హయాంలో దేశంలోనే పోటీ పడి పేదవాడికి ఇల్లు కట్టించారు.   ఎప్పుడు ఎరగని విధంగా 68 లక్షల పింఛన్లు ఇచ్చారు. ఉచితంగా రైతులకు కరెంటు ఇచ్చారు. ఎవరు ఎక్కడా చూడని విధంగా రైతులకు మద్దతు ధరలు కల్పించారు. రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూశారు. ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారిని చేయాలని పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. ఇంకా ఎన్నేన్నో కార్యక్రమాలు చేసి ఆ దివంగత నేత పేదవాడి గుండెల్లో ఇల్లు కట్టుకున్నారు. ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండేలా పాలన సాగించారు.
– చంద్రబాబుకు ఈ జిల్లాలో 14 స్థానాలు ఇస్తే..మన పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను చంద్రబాబు సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. 19 మంది ఎమ్మెల్యేలకు 17 మంది చంద్రబాబు పంచన చేరారు. ఇంత మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ఈ జిల్లాకు చంద్రబాబు ఏం చేశారు. అధికారాన్ని కట్టబెట్టిన జిల్లాకు ఏం చేశారని మీ అందరి తరఫున అడుగుతున్నాను. ఈ పెద్ద మనిషి హయాంలో మనం చూసింది ఏంటో తెలుసా? బాబు సీఎం అయ్యాక దేశంలోనే అన్నింటి కన్నా అవినీతి రాష్ట్రం ఏపీ నంబర్‌ వన్‌గా చేశారు. చంద్రబాబు పాలనలో మనం చూసింది ఏంటి అంటే జపాన్‌కు చెందిన సంస్థ కూడా బీహార్‌ కంటే ఏపీలోనే అవినీతి ఉందని తేల్చింది. రాజధాని బూముల్లో స్కాంలు, విశాఖ బూముల్లో స్కాం,  ఇసుక, మట్టి, కరెంటు కొనుగోలు, మద్యం, చివరకు గుడి భూములు వదలకుండా అవినీతికి పాల్పడుతున్నారు. పైన చంద్రబాబు తింటుంటే కింద గ్రామాల్లో మేయడం కోసం జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను తయారు చేశారు. పింఛన్లు, రేషన్‌కార్డులు కావాలన్నా లంచాలే. చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచాలే.
– చంద్రబాబు హయాంలో చూసింది ఏంటి అంటే..వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు అక్షరాల 63 శాతంవ్యవసాయంపై ఆధారపడ్డ రైతులను అడ్డగోలుగా ముంచారు. అక్కచెల్లెమ్మలను వదలకుండా వెన్నుపోటు పొడిచారు. 
– నాలుగేళ్ల క్రితం ఈ పెద్ద మనిషి ఏమన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వలేదు..ప్రతి ఇంటికి నెల నెల రూ.2 వేలు ఇస్తానని శఠగోపం పెట్టారు. పిల్లలను నట్టేట ముంచారు. అబద్ధాల కోరు చంద్రబాబు. మన రాష్ట్రానికి జాబులు రావాలంటే ప్రత్యేక హోదా అవసరం. ప్రత్యేకహోదాను అమ్మేసిన ఘనుడు చంద్రబాబు. ఎన్నికలకు ముందు ఏమన్నారు. మద్యంతో పిల్లలు చెడిపోతున్నారని అన్నారు. సీఎం కాగానే మద్యాన్ని తీసేస్తాను. బెల్టుషాపులు ఎత్తేస్తా అన్నారు. ఇవాళ మినరల్‌ వాటర్‌ లేని గ్రామం ఉందో లేదో తెలియదు కానీ, మందు షాపు లేని గ్రామం ఉందా? 
– సంతోషం కోసం సాయంత్రం పూట ఒక పెగ్గు మంచిదని చంద్రబాబు చెబుతారు. ఈ పెద్ద మనిషి క్యాబినెట్లో ఉన్న మంత్రి బీరు హెల్త్‌ డ్రింక్‌ అంటారు. ఇంతగా ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు.
– ఈ పాలనలో మనం చూసింది ఏంటి అంటే..రుణాలు మాఫీ కాలేదు. సాగునీరు, తాగునీరు లేదు. కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్, ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు. రేషన్‌షాపుకు వెళ్తే బియ్యం తప్పా మరేమి ఇవ్వడం లేదు. స్కూల్‌ ఫీజులు బాదుడే బాధుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. ఈ పాలన చూసి సిగ్గుపడు చంద్రబాబూ?
– రాష్ట్రంలో రాజ్యంగం లేదు. చట్టాలు వర్తించడం లేదు. ఏపీని అవినీతిమయం చేశారు. నాలుగేళ్ల క్రితం చంద్రబాబు ప్రతి కులాన్ని, వర్గాన్ని మోసం చేస్తూ టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇవాళ ఆ మేనిఫెస్టో ఎక్కడుంది. ఇంత దారుణంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. ఈ పాలనలో నీతి, న్యాయాలు, దయ, కరుణ ఉండదు. ఈ పదాలకు అర్థం తెలియదు. ఆయన నోరు అబద్ధాల ఫ్యాక్టరీ, ఆయన మెదుడు చూస్తే అది ఒక క్షుద్ర ప్రపంచం. ఈయనది దుర్మార్గ పాలన.
 – మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చెబుతున్నారు. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసేవారిని పొరపాటున క్షమించకండి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత రావాలి. ఈవ్యవస్థ మారాలంటే జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు, అశీస్సులు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఏదైనా రాజకీయ నాయకుడు ఎన్నికల్లో హామీ ఇచ్చి నెరవేర్చకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతోంది. చంద్రబాబును పొరపాటున క్షమిస్తే.. రేపు పొద్దున ఈ పెద్ద మనిషి ఏం చెబుతాడో తెలుసా?..చిన్న చిన్న అబద్ధాలకు మీరు మోసపోరని ఆయనకు తెలుసా. రేపు ఎన్నికల్లో చంద్రబాబు మీ వద్దకు వచ్చి బుకాయిస్తారు. 98 శాతం హామీలు నెరవేర్చానని చెబుతారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా?. బోనస్‌గా ప్రతి ఇంటికి బెంజి కారు ఇస్తానంటారు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. నమ్ముతారా? రూ.3 వేలు డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే.. మనజేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే అదంతా. ఓటు వేసే సమయంలో మాత్రం మీ మనసాక్షి ప్రకారం వేయండని కోరుతున్నాను. అబద్ధాలు చెప్పేవారిని, మోసం చేసేవారిని బంగా ఖాతంలో కలిపేయండి. 
– రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది నవరత్నాలు ప్రకటించాం. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలని నవరత్నాలు ప్రకటించాం. ఈ మీటింగ్‌లో నవరత్నాల్లో నుంచి పేదవాడికి ఆరోగ్యం కోసం ఏం చేస్తామన్నది ఇవాళ చెబుతాను.
– ఇవాళ ఒక్కసారి మీ అందరూ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. ఇవాళ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే ఉచితంగా ఆపరేషన్‌ చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపించే పరిస్థితి ఉందా? ఒక్కసారి మహానేత పాలనను గుర్తు చేసుకోండి. పేదవాడు అప్పుల పాలు అయ్యేది రెండే రెండు సందర్భాల్లో ఒకటి వైద్యం, రెండోది విద్య కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. మహానేత పాలనలో 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే చాలు కుయ్‌ కుయ్‌ అంటూ 20 నిమిషాల్లోనే ఆ పేదవాడి ఇంటికి అంబులెన్స్‌ వచ్చి బాగలేని ఆ పేదవాడిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా వైద్యం అందించేవారు. అటువంటి 108 అంబులెన్స్‌ 20 నిమిషాల్లో వస్తుందా?  ఇవాళ పేదవాడు అనారోగ్యం పాలైతే ఎవరైనా మంచి ఆసుపత్రి ఎక్కడ ఉందని వెతుకుతాడు. మంచి ఆసుపత్రులు అన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ కట్‌ అంటున్నారు. ఎవరైనా రోగికి క్యానర్‌ వస్తే కీమో థెరఫీ చేయాలి. కనీసం 7, 8సార్లు చేస్తే తప్ప వ్యాధి నయం కాదు. క్యాన్సర్‌ పేషేంట్‌కు కీమో థెరఫి చేయడం లేదు. కేవలం రెండు సార్లు మాత్రమే కీమో థెరఫీ చేస్తారట. వైద్యం అందక ఆ పేషేంట్‌ అటునుంచి అటే పైకెల్లే పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీ పరిస్థితి దయాణీయంగా ఉంది. చిన్న పిల్లలకు మూగ, చెవుడు ఆపరేషన్‌ చేయించాలంటే ఆరోగ్యశ్రీ వర్తించదంటున్నారు. కనీసం రూ.6 లక్షలు ఖర్చు అవుతుంది. ఇవాళ కిడ్నీ రోగులకు డయాలసిస్‌ చేయాలంటే ప్రతిసారి రూ.2 వేలు ఖర్చు అవుతుంది. వారానికి రూ.6 వేలు ఖర్చు అవుతంంది. ఏడాదికి రూ.2 లక్షలు అవసరం. ఇవాళ కిడ్నీ షేషేంట్లకు డయాలసిస్‌ చేయడం లేదు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించడం లేదు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఆరోగ్యశ్రీ ఉంది.
– మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపేదవాడికి హామీ ఇస్తున్నాను. నాన్నగారు పేదవాడి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే..నాన్నగారి కొడుకుగా జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. వెయ్యి రూపాయలు వైద్యం ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొని ఉచితంగా చేయిస్తాం. అంతేకాదు..ఆపరేషన్, ఉచిత ౖÐð ద్యం ఇవ్వడమే కాదు..ఆపరేషన్‌ చేయించుకున్న రోగికి డాక్టర్‌ విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తే..ఆ సమయంలో కూడా డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటాను. ప్రతి పేదవాడికి ఉచితంగా ఆపరేషన్‌ చేయిండమే కాదు..పేదవాడికి విశ్రాంతి సమయంలో డబ్బులు ఇస్తాం. అంతేకాదు..దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ప్రతి నెల రూ.10 వేల పింఛన్‌ ఇస్తాం. ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో మార్పులు తీసుకొని వచ్చి మహానేత మాదిరిగా పేదవాడి గుండెల్లో గుడి కట్టుకునేలా ప్రయత్నం చేస్తాను. నవరత్నాల్లోని మిగిలిన అంశాలు రాబోయే మీటింగ్‌ల్లో చెబుతాను. ఇందులో ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున కోరుతున్నాను. 




 

తాజా వీడియోలు

Back to Top