యూటర్న్‌ తీసుకునే అలవాటు లేదు

– స్థానిక ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకొని ఓట్లు వేయించుకున్నారు
– ఎమ్మెల్యే వర్మ తమకు కన్నీరు పెట్టిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు
– కాకినాడ సెజ్‌ భూములను రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు బాబూ?
– ప్రత్యేక హోదాను బాబు తీసుకురాలేకపోయారు
– పోలవరం పునాదులకే పరిమితమైంది
– రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది
– కాపులను అణచి, వేధించిన బాబు మోసగాడా? కాపులకు అండగా ఉన్న వైయస్‌ జగన్‌ మోసగాడా?
– ప్రతి కులాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది
– వైయస్‌ జగన్‌ మోసం చేయడు, చేయలేనిది చేస్తానని చెప్పడు
– కాపు రిజర్వేషన్లపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు
– బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

తూర్పు గోదావరి : కాపులను అణచి, వేధించిన బాబు మోసగాడా? కాపులకు అండగా ఉన్న వైయస్‌ జగన్‌ మోసగాడా అని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు.  మోసగాడే ఎదుటివారిని మోసగాడు..మోసగాడు అంటున్నారని, కాపుల రిజర్వేషన్ల విషయంలో మోసం చేసింది ఎవరూ చంద్రబాబు అని ఆయన నిలదీశారు.  రిజర్వేషన్ల విషయంలో ఎవరు మోసం చేశారో కాపులకు తెలుసు అన్నారు. 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని సుప్రీం కోర్టు చెప్పిందని, సుప్రీం కోర్టు చెప్పిన దానిపై బాబు హామీ ఇవ్వడం మోసం కాదా అని ప్రశ్నించారు. యూటర్న్‌ తీసుకునే అలవాటు తనకు లేదని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. కాపుల విషయంలో బీసీలకు అన్యాయం జరుగకుండా రిజర్వేషన్లు కల్పించాలని మొదటి నుంచి చెబుతున్నామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పిఠాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 

– ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు..అన్నా..టీడీపీ ప్రభుత్వం వచ్చి నలుగున్నర సంవత్సరాలు అయ్యింది. మాకు ఈ ప్రభుత్వం మంచి చేయకపోయినా ఫర్వాలేదు. హాని చేయకపోతే అదే చాలు అంటున్నారు. అన్నా..ఇక్కడి ఎమ్మెల్యే మా వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని, ఆ ఫోటోలను ఫ్లెక్సీలుగా చేసి ఊరూరా పెట్టి ఓట్లు వేయించున్నారన్నా..ఇపుడు నాలుగేళ్లుగా ఆ ఎమ్మెల్యే మాకు కన్నీళ్లు పెట్టిస్తున్నారని చెబుతున్నారు. అన్నా..నీరు చెట్టు పథకం కింద కుమారపురం, తమ్మాయి చెరువు, రాయవరం, రాపర్తి, కమిడిదొడ్డిలో దాదాపు 25 చెరువులను తవ్వేశారు. ఏ చెరువు చూసినా తాటిచెట్టు అంతా లోతు తవ్వారని చెబుతున్నారు. చెరువులు తవ్వినందుకు బిల్లులు, మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని, మా నియోజకవర్గంలోనే రూ.100 కోట్లు దోచేశారని చెబుతున్నారు.
– ఈ నియోజకవర్గంలో అధికార బదిలీ కావాలంటే అంతో ఇంతో లంచాలు ఇవ్వాల్సిందేనట. చివరికి ఇక్కడి ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఎంపీడీవో గుండెపోటుతో చనిపోయారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
– పిఠాపురం పట్టణంలో శ్రీపాద వల్లభస్వామికి చెందిన రూ.100 కోట్ల ఆస్తులను కొట్టేసేందుకు చేయని ప్రయత్నం లేదని చెబుతున్నారు.
– ఏరియా ఆసుపత్రిలో చిన్న పిల్లలకు భవనం కట్టాలని ట్రస్ట్‌ ప్రయత్నం చేస్తే..ఆ పనులు దక్కలేదని ఇక్కడి ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని చెబుతున్నారు.
– ఇదే నియోజకవర్గంలో ఏలేరు ప్రాజెక్టు ఆధునీకికరణ చాలా అవసరమని చెబుతన్నారు. అటువంటి పనులు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి రూ.138 కోట్లతో మొదలుపెట్టారని, మహానేత చనిపోవడంతో ఆ పనులు నత్తనడకనా సాగుతున్నాయి. నిజంగా రైతులపై వీరికి ఎంత చిన్నచూపు ఉందో ఇదే సాక్షం. కెనాల్‌ అభివృద్ధికి వైయస్‌ఆర్‌ నిధులు కేటాయించినా పనులు ముందడగు వేయడం లేదు.
– కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూ నిర్వాసితులు నా వద్దకు వచ్చారు. అన్నా..చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడుతారు. పని అయిపోయిన తరువాత మరో మాట మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఆ రోజు కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూములు తిరిగి ఇప్పిస్తానని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూములు జగన్‌కు సంబంధించినవని ఆ రోజు ఏరువాక కార్యక్రమంలో చంద్రబాబు ఆరోపించారని, అయ్యా చంద్రబాబు ఆ భూములను రైతులకు ఇవ్వమంటే ఇంతవరకు ఎందుకు ఇవ్వడం లేదు.
– కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూములు తిరిగి ఇస్తామన్న చంద్రబాబు ఈ రోజు కూడా ఇవ్వడం లేదు. రైతులందరూ కూడా చంద్రబాబు సీఎం అయిన తరువాత ఆందోళన చేస్తే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించారు.
– యూ.కొత్తపల్లి మండలంలోని ఉప్పుటేరు వద్ద షిప్పింగ్‌ హర్బార్‌ నిర్మిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన తరువాత మోసం చేశారు. ఇదే నియోజకవర్గంలో  ఇది రెండు మోసం.
– చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఊరికి పది ఇళ్లు కూడా కట్టించలేదు. ఎక్కడా పేదవారికి సెంట్‌ స్థలం ఇవ్వడం లేదని, మహానేత ఇచ్చిన ఇళ్ల స్థలాలను లాక్కుంటున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. అన్నా..నాన్నగారి హయాంలో ఇదే నియోజకవర్గంలో 15 వేల ఇళ్లు కట్టించారని చెబుతుంటే నిజంగా సంతోషమనిపించింది. దాదాపుగా 37 ఎకరాల స్థలాలు పంపిణీ చేశారని చెబుతున్నారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఆ ఇంటి స్థలాన్ని ఈ ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటుంటే వైయస్‌ఆర్‌సీపీ తోడుగా నిలబడిందని చెబుతున్నారు.
– ఈ నియోజకవర్గం ఉప్పాడ చీరలకు, చేనేత చీరాలకు ప్రఖ్యాతి గాంచింది. ఒక్క చీర నేయడానికి మూడు రోజులు పడుతుంది. గతంలో ఒక్క చీరకు రూ.1500 వచ్చేదని, ఇప్పుడు రూ.1000 కూడా రావడం లేదని చెబుతున్నారు. సంఘాల ద్వారా ఆర్డర్లు రావడం లేదని చేనేతలు చెబుతున్నారు. ఉన్న సబ్సిడీలు కూడా ఊడబెరకారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో చేనేత రంగం ఉంది.
– రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు ఏంటి? మనకు ఉన్న సమస్యలు ఏంటీ అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఈ నాలుగున్నర సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. రైతులకు ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేవు. రైతులకు సున్నా వడ్డీ, పావలా వడ్డీలు లేవు. చంద్రబాబు పాలనలో పిల్లలకు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటడం లేదు. చంద్రబాబు పాలనలో కాంట్రాక్టర్ల నుంచి ఇసుక, మట్టి, మద్యం, రాజధాని భూములు, చివరికి గుడి భూములు కూడా వదలడం లేదు. 
– చంద్రబాబు పాలనలో ఇవాళ చూస్తున్నది ఏంటి అంటే బాదుడే బాదుదు. ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు, ఇంటి పన్నులు, స్కూల్‌ ఫీజులు చూసినా బాదుడే బాదుడు. ఇంటర్‌ చదవాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఏడాదికి రూ.65 వేల ఫీజులు ఉన్నాయి. ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటున్నారు.
– చంద్రబాబు పాలనలో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఇవాళ్టికి పుస్తకాలు ఇవ్వడం లేదు. స్కూళ్లకు పంపించాలంటే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్ల వైపు చూస్తున్నారు. ఆ స్కూళ్లు నారాయణ, చైతన్యవే. ఈ ఇద్దరు కూడా చంద్రబాబు బినామీలే. దగ్గరుండి చంద్రబాబు స్కూళ్లను మూత వేయించి పరిస్థితి కనిపిస్తుంది. నాసిరకం యూనిఫాం కూడా ఇవ్వడం లేదు. ఖాళీగా ఉన్న 20 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయడం లేదు.
– మధ్యాహ్న భోజన పథకానికి చంద్రబాబు ఐదు నెలలుగా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. సరుకులకు  బిల్లులు ఇవ్వకపోతే నిర్వాహకులు పిల్లలకు భోజనం ఎలా పెడతారు? నిర్వాహకులు ఎలా బతుకుతారు. ఇలాంటి పాలనను ఏమనాలి?. ఈ థకంలో 85 వేల మంది నిర్వాహకులు అప్పులపాలవుతున్నారు. వీరికి ముష్టి వేసినట్లు రూ.1000 ఇస్తున్నారని, ఇలాంటి పరిస్థితి నుంచి దారుణంగా వారిని తొలగిస్తూ ప్రైవేట్‌ సంస్థలకు ఈ పథకాన్ని కట్టబెడుతున్నారు.
– చంద్రబాబు ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టారు. బాబు వచ్చాడు జాబు రాలేదు. ఉన్న జాబులను ఊడగొడుతున్నారు. మ«ధ్యాహ్న భోజనం పథకం అక్కాచెల్లెమ్మలు విశాఖకు వెళ్తే దారుణంగా లాఠీ చార్జీ చేసి గాయపరిచారు.
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచారు.  పక్కనే సూరంపాలెంలో ఇంజినీరింగ్‌ కాలేజీలో ఫీజులు రూ.95 వేలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.30 వేలే ఇస్తున్నారు. నిరుడి ఫీజులు ఇంతవరకు ఇవ్వడం లేదు. మిగిలిన రూ.60 వేలు ఎక్కడి నుంచి కట్టాలి అన్నా..అంటున్నారు. స్టూడెంట్‌ లోన్‌ తీసుకున్నాను. దానికి వడ్డీ ప్రతి నెల రూ.2 వేలు కడుతున్నానని వికాస్‌ అనే విద్యార్థి చెప్పాడు. ఇంత కష్టపడి చదివినా జాబులు రావడం లేదు. వడ్డీలు కట్టేందుకు మిగిలిన పొలం, స్థలం అమ్ముకుంటున్నామని ఆ పిల్లాడు అంటున్నారు.
– ఆరోగ్యశ్రీ పరిస్థితి గమనించండి. ఈ పథకం చంద్రబాబు పాలనలో పడకేసింది. గర్భిణులకు కాన్పులు చేయాలంటే కూడా సరైన వైద్యం అందడం లేదు. 108కు ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్‌ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. డీజిల్‌ లేదన్న సమాధానం వినిపిస్తోంది. మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు.
– గతంలో రేషన్‌ షాపుల్లో బియ్యం, కందిపప్పు, పామాయిల్, గోదుమ పిండి, కారంపొడి, పసుపు, చింతపండు ఇచ్చేవారు. ఇవన్నీ కూడా రూ.180లకే ఇచ్చేవారు. ఇవాళ బియ్యం తప్ప వేరేవి ఇవ్వడం లేదు. అందులో కూడా కోతలు విధిస్తున్నారు. 
– గ్రామాలకు వెళ్తే మనకు కనిపించేది ఏంటో తెలుసా? మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు కనిపించడం లేదు. చంద్రబాబు పాలనలో మందు షాపు లేని గ్రామం కనిపించదు. ఫోన్‌ కొడితే మినరల్‌ వాటర్‌ తీసుకుని ఎవరు రావడం లేదు. మందు బాటిల్‌ తీసుకొస్తున్నారు. 
–చంద్రబాబు డ్రామాలు చూస్తే ఆశ్చర్యమనిపిస్తోంది. మొన్న జగ్గంపేటలో నేను మాట్లాడిన మాటలను వీళ్లు ఎంత వక్రీకరించారో చూశాం. చంద్రబాబుకు మద్దతు పలుకుతున్న కొందరు పెద్దలు, ఎల్లోమీడియా వ్యాఖ్యలు చూసినప్పుడు నిజంగా రాజకీయాలు కూడా ఈ స్థాయికి దిగజారిపోతాయా అనిపించింది. ఒక మోసగాడు తానే మోసం చేసి, ఆ మోసాన్ని పక్కన పెట్టి ఎదుటి వారిని మోసగాడు అంటున్నారు. ఇంతదారుణంగా రాజకీయాలు తయారు అయ్యాయి. ఎవరు మోసం చేశారు? కాపు సామాజిక వర్గంలో ఎవరు మోసం చేశారో అందరికి తెలుసు. ఎన్నికలకు ముందు పలానిది చేస్తానని చెప్పి, ఆ తరువాత అధికారంలోకి వచ్చి చేయకపోవడాన్ని మోసం అనరా? చంద్రబాబు మోసం అన్నది ఏ స్థాయిలో ఉన్నది అనడానికి నిన్న జరిగిన ఘటనే. ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ఒకవైపు జాట్లు, పటేళ్లు, గుజ్జర్లు ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్ల గురించి అడుగుతున్నారు. మన రాష్ట్రంలో కూడా కాపు సోదరులు ఇదే డిమాండు చేస్తున్నారు. రిజర్వేషన్లు అన్నది 50 శాతందాటకూడదన్నది సుప్రీం కోర్టు జడ్జిమెంట్‌.  ఇటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం దశాబ్ధాలుగా పరిష్కారం చూపడం లేదు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు హామీ ఇవ్వడం మోసం కాదా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు..సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదాని ఉన్నా కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టింది మోసం కాదా? కాపులను అణచివేస్తున్నప్పుడు వారికి తోడుగా ఉన్న జగన్‌ మోసగాడా సమాధానం చెప్పండి. కాపుల ఉద్యమాన్ని తీవ్రతరం చేసే వరకు చంద్రబాబుకు కమిషన్‌ వేయాలన్న ఆలోచన రాలేదు. ఆయన వేసిన కమిషన్‌లో చైర్మన్‌ సంతకం లేకుండానే తూతు మంత్రంగా  అసెంబ్లీలో తీర్మానం చేసింది ఎవరు. పశ్నించిన జగన్‌ మోసగాడా?
– నాలుగేళ్లు చంద్రబాబు, బీజేపీ కలిసి సంసారం చేశారు. అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో కాపులను బీసీ జాబితాలో చేస్తానన్న చంద్రబాబు మోసగాడు కాడా? చంద్రబాబు మాదిరిగా నేను కాని మాటలు చెప్పలేనని అనడం తప్పా? కాపుల అభివృద్ధి కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పారు. ఇప్పటి దాకా రూ.1300 కోట్లు ఇచ్చిన వ్యక్తి చేసింది మోసం కాదా?
– జగన్‌ అనే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.10 వేల కోట్లు  ఇస్తానని చెప్పడం మోసమా?. వక్రీకరిస్తున్న ఈ పెద్దలందరికీ చెబుతున్నాను. కాపుల రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఒక్కటే. బీసీలకు అన్యాయం చేయకుండా, వారి హక్కులను కాపాడుతూ, కాపుల రిజర్వేషన్లకు మేం మద్దతుగా ఉంటానని చెబుతున్నాను. ఇటువంటి దారుణమైన మోసాలు, అబద్ధాలు చూస్తే బాధనిపిస్తుంది.
– ఎల్లోమీడియా ఉందని, మద్దతు పలికే వారు ఉన్నారని ఇష్టరాజ్యంగా రాజకీయం చేయడం అన్యాయం కాదా? 
– ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కులానికి చంద్రబాబు ఒక పేజీ కేటాయించారు. మత్స్యకారులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరితే తాట తీస్తామన్నది నిజం కాదా? అన్ని కులాలను చంద్రబాబు మోసం చేశారు.
– నాలుగున్నరేళ్ల పాలనలో మోసాలు, అన్యాయాలు చూశాం. మీరంతా మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు హీరో నచ్చుతాడా? విలన్‌ నచ్చుతాడా? ఆ హీరో ఎందుకు నచ్చుతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ హీరో అబద్ధాలు ఆడరు కాబట్టే అందరికి నచ్చుతాడు. జగన్‌ అనే వ్యక్తి అబద్ధాలు చెప్పడు, మోసం చేయడు. చేయలేనిది చెప్పడు. కులాలకు సంబంధించి కొన్ని విషయాల్లో ప్రయత్నం చేస్తామని మాత్రమే చెబుతానని, అంతకు మించి చెబితే ఎవరూ నమ్మవద్దు
– ఈ చెడిపోయిన వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత రావాలి. అటువంటి వారినే ప్రజలు, దేవుడు దీవిస్తాడు. ఈ వ్యవస్థలో మార్పు రాకపోతే మన పిల్లలు రాజకీయ నాయకులను చూస్తే ఛా అనే పరిస్థితి వస్తుంది. ఈ వ్యవస్థ మారాలంటే జగన్‌ ఒక్కడి వల్లే సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం వస్తుంది.
– అబద్ధాలు చెప్పే వారిని, మోసం చేసేవారిని పొరపాటు క్షమిస్తే..రేపు పొద్దున చంద్రబాబు ఏం చేస్తారో తెలుసా? ఎన్నికలప్పుడు మీ అందరి వద్దకు వచ్చి మైక్‌ పట్టుకొని మీ అందరి చెవిలో పువ్వు ఉందో లేదో చూస్తారు. ఆ తరువాత ఎన్నికల ప్రణాళికలో 98 శాతం పూర్తి చేశానని చెవిలో క్వాలీఫ్లవర్‌ పెడతారు. తరువాత ఆయన మైక్‌ పుచ్చుకొని చిన్న చిన్న అబద్ధాలు నమ్మరని ఆయనకు బాగా తెలుసు. రేపు పొద్దున చంద్రబాబు తనకు ఓటు వేయమని అడుగుతూ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. దానికి బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటారు. అయినా నమ్మరని తెలిసీ ప్రతి ఇంటికి సాధికార మిత్రలను పంపిస్తారు. వారు వచ్చి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బులు పెడతారు. డబ్బులు ఇస్తే మాత్రం వదనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి లాక్కున్నదే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అబద్ధాలు చెప్పేవారిని, మోసం చేసే వారిని బంగాళ ఖాతంలో కలిపే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది
– రేపు పొద్దున దేవుడి ఆశీర్వాదం, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు ఇది వరకే నవరత్నాలు అనే పథకాలను ప్రకటించాం. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే థ్యేయంగా నవరత్నాలు ప్రకటించాం. ఇందులోని అన్ని అంశాలను ఒకే మీటింగ్‌లో చెబితే సమయం సరిపోదని, ఒక్కో అంశాన్ని చెబుతున్నాను. ఈ మీటింగ్‌లో పేదవారి పిల్లల చదువుల విషయంలో మనం ఏం చేస్తామన్నది చెబుతున్నారు. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా భరిస్తాం. అంతేకాదు హాస్టల్‌ ఖర్చుల కోసం ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 20 వేలు ఇస్తాం. మీ చిన్న పిల్లలను ఏ బడికి పంపించినా సరే ఆ తల్లి ఖాతాలో ఏడాదికి రూ. 15 వేలు జమా చేస్తామని మాట ఇస్తున్నాను. ఇందులో ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వండి. ఎవరైనా సలహాలు ఇవ్వవచ్చు. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతూ..మరొక్కమారు మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా..

 
Back to Top