బాబువన్నీ 420 బుద్దులే

– ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు..
– ఒక పూట దీక్ష..కొంగ జపం..దొంగ దీక్ష
– గాంధీని చంపిన గాడ్సే దీక్ష చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది బాబు దీక్ష
– చంద్రబాబు అబద్ధాలు క్లైమాక్స్‌కు చేరాయి
– బాబు నటన పద్మ భూషణ్‌కు ఏ మాత్రం తక్కువ కాదు
– రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబు కాదా?
– ప్రత్యేక హోదా రాకపోవడానికి ఆయనే కారణం
– హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేశారు
– టీడీపీ 20 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వచ్చేది
– నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతాం
– రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌
– పెట్టుబడి సాయం కింద ఏటా మే నెలలో రూ.12,500
– రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం
– ప్రకృతి విపత్తుల నిధికి రూ. 4 వేల కోట్లు కేటాయిస్తాం
– ఆవులు, గేదెలు కొనుక్కోవడానికి సబ్సిడీ ఇస్తాం
– సాగునీటి ప్రాజెక్టులు యుద్ధప్రాతిపాదికన పూర్తి చేస్తాం
కృష్ణా జిల్లా: చంద్రబాబువన్నీ కూడా 420 బుద్దులే అని, ఆయన నటనకు పద్మ భూషణ్‌ కూడా తక్కువే అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. 20 మంది ఎంపీలు ఉండి కూడా ఏమీ సాధించలేని చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. ఒక పూట దీక్ష..కొంగ జపం..దొంగ దీక్ష అని అభివర్ణించారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం నూజివీడు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 
– ఈ రోజు పొద్దునుంచి ఎండలు తీక్షణంగా ఉన్నా కూడా వేల మంది నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఒకవైపు ఉన్న కష్టాలు చెబుతూ అర్జీలు ఇచ్చారు. మరో వైపు అన్నా..మేమంతా నీకు తోడుగా ఉంటామని చెప్పారు. ఏ ఒక్కరికి ఈ ఎండలో నిలబడాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. అయినా కూడా చిక్కని చిరునవ్వులతో ప్రేమానురాగాలు పంచుతున్నారు. ఆత్మీయతలు చూపుతున్నారు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు
– ఈ రోజు ఈ ప్రాంతంలో అడుగుపెడుతూనే ఒక వ్యక్తి ఆ దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన మంచి పనిని గుర్తుకు తెచ్చారు. నాన్నగారు చేసిన అభివృద్ధి గురించి చెబుతూ..అన్నా గ్రామీణవిద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యనందించేందుకు మహానేత మా ప్రాంతానికి అడిగిన వెంటనే త్రిపుల్‌ ఐటీని ఇచ్చారని చెప్పారు. ఇదే నూజివీడు పట్టణంలో తాగునీటికి ఇబ్బందిగా ఉందని ప్రతాప్‌ అన్న అడిగిన వెంటనే రూ.100 కోట్లు మంజూరు చేసి కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత వైయస్‌రాజశేఖరరెడ్డిది అని చెబుతుంటే సంతోషంగా ఉంది. ఇదే పట్టణంలో పేదలకు 5 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఇదే నియోజకవర్గంలో రెండు ఎత్తిపోతల పథకాలను చేపట్టి బీడు భూములకు సాగునీరు  ఇచ్చారని రైతులు చెబుతుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. మామిడి పంటకు ఈ ప్రాంతం ప్రసిద్ధి అని తెలుసుకొని ఇదే ప్రాంతంలో మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెట్టారని ఈ ప్రాంతం ప్రజలు చెబుతుంటే గుండె ఆనందంతో కేరింతలు కొట్టింది. 

– మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత నిజంగా మనం సంతోషంగా ఉన్నామా గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. చంద్రబాబు పాలనలో ఒక్కటైనా మంచి పని చేశారా? చంద్రబాబు సిగ్గు పడాలి. నాన్నగారి హయాంలో త్రిపుల్‌ఐటీని స్థాపిస్తే..నాన్నగారు చనిపోయిన తరువాత ఆ ట్రిపుల్‌ ఐటీని నడపలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ కళాశాలలో 8 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరు ఎందుకు చనిపోయారన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వానికి మనసు లేదు అని చెప్పడానికి వేరే నిదర్శనం లేదు. నూజివీడు త్రిబుల్‌ ఐటీ సిబ్బంది ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మనవత్వం లేని ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదు. నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ దాకా నాగార్జున సాగర్‌ కాల్వపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. ఈ కాల్వకు నికర జలాల కేటాయింపులు ఉన్నాయి. రాష్ట్ర విభజన నుంచి ఇదే పరిస్థితులు కొనసాగుతున్నా..అడిగే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. భూగర్భ జలాలు అడుగంటి పోయి, మామిడి తోటలను రైతులు నరికి వేస్తున్నారు.
– నాలుగేళ్లుగా మామిడి రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పంట దిగుబడులు లేవు. ధరలు కనిపించడం లేదు. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాన్నగారి హయాంలో మామిడి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పరిశోధన కేంద్రంలో ఒకరిద్దరు మాత్రమే పని చేస్తున్నారు. నూజివీడు మామిడిపై చంద్రబాబు శ్రద్ధ ఏముందో అర్ధం చేసుకోవచ్చు.
– అన్నా..నాన్నగారి హయాంలో ఐదు వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆ పేదవాడి ఇళ్ల స్థలాలను టీడీపీ నేతలు ఆక్రమించుకుంటుందని బాధితులు చెబుతున్నారు. కోర్టు దాకా వెళ్తే గానీ అడ్డుకోలేని పరిస్థితి ఉంది. చంద్రబాబు చేసే ప్రతిదీ స్కామే. ఇల్లు ప్లాట్లు కట్టిస్తామని చెబుతున్నారు. ఇందులో స్కామ్‌ దాగి ఉంది. అడుగు ప్లాట్‌ కట్టడానికి రూ.1000కి మించదు. చంద్రబాబు చివరకు పేదల వద్ద నుంచి కూడా లంచాలు తీసుకునే స్థితికి వచ్చారు. ప్లాటు పొందిన పేదవాడు 25 ఏళ్ల పాటు కంతులు కట్టాలట. ఇంత కన్న అన్యాయం ఎక్కడైనా ఉంటుందా?
– చంద్రబాబు క్యాంపు ఆఫీస్‌ పక్కనే కృష్ణా నదిలో ఎడాపెడా ఇసుకను తవ్వెస్తున్నారు. అడ్డగోలుగా వేలాది లారీల్లో లక్షల టన్నుల ఇసుక తవ్వెస్తున్నారు. సీఎం కళ్ల ఎదుటే ఇసుక మాఫియా జరుగుతోంది. ఎమ్మెల్యే దగ్గరుంచి మొదలైతే కలెక్టర్ల దాకా, చిన్నబాబు నుంచి పెద్ద బాబు దాకా లంచాలే. పైన చంద్రబాబు ఇసుక నుంచి మట్టి, మద్యం, బొగ్గు, కరెంటు కొనుగోలు, కాంట్రాక్టర్లు, రాజధాని భూములు, చివరకు గుడి భూములు కూడా వదలకుండా లంచాలు తీసుకుంటున్నారు.  కింద గ్రామాల్లో మేయడానికి జన్మభూమి కమిటీలకు అప్పజెప్పారు. పించన్‌ కావాలన్నా లంచాలే..రేషన్‌ బియ్యం కావాలన్నా లంచాలే..చివరకు మరుగు దొడ్డి కవాలన్నా లంచాలే. 
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో జరిగేది ఏమిటంటే మోసాలు, అబద్ధాలు, అవినీతి, అన్యాయాలు చేస్తున్నారు. ఈ నాలుగు పాదాల మీద రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారు.  ఈ నాలుగేళ్లలో చంద్రబాబు మోసం చేయని వ్యక్తి ఎవరు ఉండరేమో? 
– ఎన్నికల సమయంలో రైతుల పంట రుణాలు బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బ్యాంకుల నుంచి వేలం నోటీసులు ఇంటికి వస్తున్నాయి. ఆయన చెప్పిన రుణమాఫి పథకం రైతులకు వడ్డీలకు సరిపోవడం లేదు.
– ఇదే పెద్ద మనిషి అక్కా చెల్లెమ్మలను వదిలిపెట్టలేదు. ఆడవాళ్లు కంట తడి పెడితే ఇంటికి  అరిష్టం అంటారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో కంట తడి పెట్టని అక్కా చెల్లెమ్మలు లేరు. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా?
– జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు. జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు..ఇంటింటికి మనిషిని పంపించి చంద్రబాబు సంతకం పెట్టి ఈ లేఖ ఇచ్చారని, మీ పిల్లాడు చదువుకోకపోయినా ఫర్వాలేదు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రూ.96 వేలు మాకు బాకీ పడ్డావని చంద్రబాబును నిలదీయండి. 
– ఇదే పెద్దమనిషి ఎవరిని వదిలిపెట్టలేదు. ఎన్నికల్లో లాభాల కోసమని ఎన్నికల ప్రణాళిక అంటూ టీడీపీ మేనిఫెస్టో అంటూ గొప్పగా చూపారు. అందులో ప్రతి కులానికి ఒక పేజీ పెట్టారు. ఎన్నికలు అయిపోయిన తరువాత అన్ని వర్గాలను మోసం చేశారు.
– నాలుగేళ్లుగా మోసాలు, అబద్ధాలు చూశాం. అన్నీ కూడా క్లైమాక్స్‌కు చేరాయి. చంద్రబాబు నటనలో పద్మభూషన్‌కు ఏమాత్రం తగ్గడు. నిన్ననే చంద్రబాబు నటన కనిపించింది. ఏప్రిల్‌ 20వ తేదీ ఆయన పుట్టిన రోజు. నాలుగో నెల 20వ తేదీ అంటే 420 అని అర్ధం. ఆయన బుద్ధులన్నీ 420 బుద్దులే. దీక్షలు చేస్తారు. అది కూడా 420 దీక్షనే. 12 గంటల దీక్షకు ఫోజు కొడుతూ రూ.30 కోట్లు ఖర్చు చేశారు. అన్నా..చంద్రబాబు ప్రతి ఒక్కరిని మోసం చేశారని రైతులు అంటున్నారు. బతకడానికి అవస్థలు పడే మాకు మోసం చేశారని అక్కా చెల్లెమ్మలు అంటున్నారు. అన్నా..ఇవాళ జాబ్‌ కోసం ఎక్కడికి వెళ్లాలన్నా అని నిరుద్యోగులు అంటున్నారు. ఎవరైనా మా ఊర్లోకి వచ్చి డబ్బులు తీసుకొని మోసం చేస్తే అలాంటి వ్యక్తిపై పోలీసు స్టేషన్‌లో 420 కేసు పెట్టమా అన్నా అని అంటున్నారు. చంద్రబాబుపై 420 పెట్టాలా? 840 కేసు పెట్టాలా అంటున్నారు..
– చంద్రబాబుది కొంగ జపం..దొంగ దీక్ష. ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటు పొడిస్తే..నిన్న దీక్షలో ఎన్‌టీ రామారావు డూప్‌ చంద్రబాబుకు దీవెనలు ఇస్తున్నట్లు డ్రామాలు చూశాం. నిజంగా ఈయన గారి డ్రామా ఏ స్థాయిలో ఉందంటే గాంధీజీని చంపిన గాడ్సే దీక్ష చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది చంద్రబాబు దీక్ష. 
– చంద్రబాబు దీక్ష చూసినప్పుడు ఒక కథ గుర్తుకు వస్తుంది. అనగనగ ఒక ముద్దాయి ఉండేవాడు. ఆ ముద్దాయిని పోలీసులు కోర్టు బోనులో నిలబెట్టారు. కొద్ది సేపటికీ జడ్జీ గారు వచ్చారు. జడ్జి రాగానే ఈ ముద్దాయి బోరున ఏడుపు మొదలుపెట్టారు. సార్‌ అమ్మానాన్న లేని వాడిని సార్‌ మానవత్వం చూపండి అని మొరపెట్టుకున్నారట. ఈయన ఇంతగా ఏడ్చుతున్నారని జడ్జి పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ను అడిగారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లేచి సార్‌ ఈయన గారిని నమ్మకండి..తన సొంత తల్లిదండ్రిని చంపి బోన్‌లో నిలబడ్డారు సార్‌ అని చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడానికి చంద్రబాబు కారణం కాదా?తెలంగాణకు వెళ్లి తానిచ్చి లేఖ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు కారణం కాదా? దుగ్గిరాజు పట్నం రాకపోవడానికి ఈయన కాదా కారణం. పోలవరం పనులు నిలిచిపోవడానికి చంద్రబాబు కారణం కాదా?ఇన్ని పాపాలు చేసిన ఈ మనిషి ఇవాళ కోర్టులో ముద్దాయి లాగా చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారు.
– అయ్యా చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నావ్‌..ఆ రోజు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టారు. అదే రోజు మీ ఎంపీలు కూడా రాజీనామా చేసి దీక్షచేపట్టి ఉంటే కేంద్రం దిగి వచ్చేది కాదా? ఆ రోజు రాజీనామాలు చేయలేదు. ఇవాళ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతూ..దొంగ దీక్షలు చేస్తున్నారు. ఇదే చంద్రబాబు నిన్న మీటింగ్‌లో తనకు 25 ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తామంటున్నారు. ఇవాళ చంద్రబాబుకు 20 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు. అదే 20 మంది ఎంపీలు నా వద్ద ఉంటే వారితో రాజీనామా చేయించి ఢిల్లీలో దీక్ష చేపట్టే వాడిని. చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. రాజకీయ నాయకుడు చెప్పింది చేయకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలి. 
– చంద్రబాబును పొరపాటున క్షమిస్తే రేపు పొద్దున ఏం చేస్తారో తెలుసా? చిన్న చిన్న అబద్దాలకు, మోసాలను నమ్మరని చంద్రబాబుకు తెలుసు. రేపు పొద్దున మీ వద్దకు వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ఎన్నికల సమయంలో చెబుతారు. నమ్ముతారా? కేజీ బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి బెంజి కారు కొనిస్తా అంటారు. నమ్మడని చంద్రబాబుకు తెలుసు. ప్రతి ఇంటికి మనిషిని పంపించి రూ.3 వేలు డబ్బు చేతిలో పెడతారు. రూ.3 వేలు డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే. కానీ ఓటు మాత్రం మనసాక్షి ప్రకారం వేయమని కోరుతున్నాను. అబద్దాలు చెప్పేవారిని, మోసాలు చేసేవారిని బంగాళఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది. ఈ వ్యవస్థను మార్చాలంటే జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం వస్తుంది.
– రేపు పొద్దున మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేయబోతున్నామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూసేందుకు నవరత్నాలు ప్రకటించాం. రైతుల కోసం మనం ఏం చేస్తామన్నది ఇవాళ చెబుతున్నాను.
– ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉందో మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. ఇవాళ రైతు అస్తవ్యస్త పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నారు. మనం అధికారంలోకి వచ్చాక రైతులకు మనం ఏం చేస్తామంటే  రైతు పంట వేసే సమయంలో పెట్టుబడి కోసం సమస్య ఎదుర్కొంటాడు. జూన్‌ మాసం కోసం ఎదురు చూసే సమయంలో పెట్టుబడుల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గితే అప్పుడు లాభాలు వస్తాయి. ఇందు కోసం మనం ఏం చేస్తామంటే..
1. ప్రతి రైతుకు 9 గంటల పాటు పగటి పూట ఉచిత విద్యుత్‌ ఇస్తాం
2. రైతులకు పెట్టుబడులు తగ్గాలంటే రైతులు రుణాలు తీసుకున్నప్పుడు వడ్డీలు తగ్గాలి. చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది మోసమైతే..ఆయన చేసిన అన్యాయం ఏంటంటే రైతులకు సంబంధించిన వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టడం లేదు. ఏ రైతు కూడా ఇవాళ బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు అందడం లేదు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు తీసుకున్న పంట రుణాలకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాం.
3. ప్రతి రైతు జూన్‌ మాసం కోసం ఎదురు చూస్తాడు. వర్షాలు కురిసిన వెంటనే పంటలు వేసుకునేందుకు రైతులు పడని అగచాట్లు ఉండవు.  ప్రతి రైతుకు పెట్టుబడి కోసం మే మాసంలో రూ.12,500 ఇస్తాం. ఎకరా పొలం ఉన్న రైతుకు 80 శాతం పెట్టుబడి డబ్బులు వచ్చినట్లే. ఆ డబ్బుతో రైతులు ఏదో ఒకటి చేసుకోవచ్చు.
– ఇవాళ రైతులు బోర్లు వేస్తు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి సందర్భంలో ప్రతి రైతుకు ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమం చేపడుతాం. మోటర్‌ కనెక్షన్‌ కూడా ఇప్పించి తోడుగా ఉంటాం. 
– కష్టపడి రైతులు పంట పడిస్తే గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంది. ఏ పంటకు కూడా మద్దతు ధర లేదు. సీఎం చంద్రబాబు తానే దళారీగా మారడంతో రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. హెరిటేజ్‌ షాపుల్లో మూడు, నాలుగు రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రతి రైతుకు హామీ ఇస్తున్నా..పంట వేయకముందే రేటు ప్రకటించి, అదే రేటుకు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చూస్తాం. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థీరికరణనిధి ఏర్పాటు చేస్తాం.
– రైతులు వ్యవసాయంతో పాటు పాడి ఉంటే లాభాలు వస్తాయి. రైతులకు పాడి ఉండాలి. లీటర్‌ పాలకు ఏ రేటు వస్తుందని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు తన హెరిటేజ్‌ పాల డయిరీతో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. కో–ఆపరేటివ్‌ సొసైటీ ఉన్నప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సహకార రంగంలోని డయిరీలు మూత పడుతున్నాయి. మనందరి ప్రభుత్వం వచ్చాక కో–ఆపరేటివ్‌ డయిరీలు లె రిపిస్తాం. ప్రతి లీటర్‌కు రూ.4 ప్రోత్సహకంగా అందజేస్తాం. ప్రతి రైతు ఆవులు, గేదెలు కొనుగోలు చేసేందుకు సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటాం. 
– అనుకోకుండా కరువు, అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతు అవస్థలు పడుతారు. అలాంటి సమయంలో తోడుగా ఉండేందుకు కరువు వచ్చినా..అకాల వర్షం వచ్చినా కూడా తోడుగా ఉండేందుకు రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైఫరిత్యాల నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటాం. 
– మండలాన్ని ఒక యూనిట్‌గా చేసుకొని రైతు తాను పండించిన పంటను ఎలా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేసేందుకు గోడౌన్లు ఏర్పాటు చేస్తాం.
– రైతులకు సాగునీరు సమయానికి వస్తాయన్న భరోసా ఉంటే పంటలు వేసుకునేందుకు ధైర్యం వస్తుంది. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులతో డబ్బులు ఎలా సంపాదించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాను. వీటిలో ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా..సలహాలు ఇవ్వాలనుకున్నా మీ అందరికీ తెలుసు..నేను ఎక్కడ ఉంటానో..ఎవరైనా రావచ్చు..అర్జీలు ఇవ్వవచ్చు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా..
 

తాజా వీడియోలు

Back to Top