తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని అమ్మేయమని ఎవరు చెప్పారు?


– నాగార్జున సాగర్‌ కుడి కాల్వలో నీళ్లున్నా పంటలు పండించుకోలేకపోతున్నారు
– ఎడమ కాల్వ ద్వారా తెలంగాణలో మాత్రం పంటలు పండిస్తున్నారు
– ఒక్క ఏడాది కూడా వరి వేసే పరిస్థితి లేదు
– కేసీఆర్‌ వద్ద ఉన్నది ఏంటీ? చంద్రబాబు దగ్గర లేనిదేంటీ?
–  అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆధారాలతో దొరికిపోయారు
– ఈ నాలుగేళ్లలో ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు
– రైతులు పంటలు అమ్ముకోవాలంటే లంచాలు అడుగుతున్నారు
– రాష్ట్రంలో జీఎస్టీతో పాటు టీఎస్టీ ఉంది
– నరసరావుపేటలో జీఎస్టీ, టీఎస్టీతో పాటు కేఎస్టీ కూడా ఉంది
– ప్రత్యేక హోదా వద్దని బాబుకు ఎవరు చెప్పారు
– చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు మీ అందరి తోడు, ఆశీస్సులు కావాలి
– నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతా
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే చదువుల విప్లవం తెస్తా
–  పేదల చదువులకు ఎన్ని లక్షలు ఖర్చైనా భరిస్తానని వైయస్‌ జగన్‌ హామీ
– నరసరావుపేట బహిరంగ సభలో ఆకట్టుకున్న దొంగ కథ

గుంటూరు: తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని అమ్మేయమని చంద్రబాబుకు ఎవరు చెప్పారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల తరఫున ప్రశ్నించారు. తప్పు చేసిన తనను అరెస్టు చేస్తే పోయేది మన ఊరి పరువు అని, తనను బలహీన పరిస్తే ప్రజలను బలహీన పరిచినట్లే అని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు అన్నారు. తప్పు చేసిన చంద్రబాబును ఎవరూ దండించకూడదని అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నట్లు మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 119వ రోజు గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేషజనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

ఈ రోజు ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. తీక్షమైన ఎండలను లెక్క చేయడం లేదు. ఒకవైపు వారి సమస్యలపై అర్జీలు ఇస్తున్నారు. మరోవైపు నా భుజాన్ని తడుతూ అన్నా..నీకు తోడుగా మేమంతా ఉన్నామంటూ నాతోపాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా ఈ ఎండలో నడవాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరికి ఈ నడిరోడ్డుపై, ఈ ఎండలో, దుమ్ములో నిలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా కూడా ఎండను ఖాతరు చేయకుండా, నడిరోడ్డు అన్న సంగతి చూడటం లేదు. చిక్కని చిరునవ్వుతో ప్రేమానురాగాలు పంచుతున్నారు, ఆత్మీయతలు పంచుతున్నారు. మీ అందరికి ప్రేమానురాగాలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 

–నరసరావుపేట నియోజకవర్గంలో అడుగు పెడుతూనే కష్టాలకు రకరకాల పేర్లు వస్తున్నాయి. రైతులు నా వద్దకు వచ్చి అన్నా..నాగార్జున సాగర్‌ కుడికాల్వ మా ప్రాంతానికి వస్తుందన్నా..నాలుగేళ్లుగా 140 టీఎంసీల నికర జలాల ఆయకట్టు ఉంది. అయినా మా ఖర్మ చూడన్నా..చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు..నాలుగేళ్లుగా వరి వేసుకునే అవకాశం లేదని రైతులు అంటున్నారు. అన్నా..నాగార్జున సాగర్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 310 టీఎంసీలు అయితే 270 టీఎంసీల నీరు ఉంటే మా ఖర్మ చూడండి అన్నా..సాగర్‌ కుడికాల్వకు నీరు ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఆ రైతుల నోటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు చేసుకుంటున్నారు. నాన్నగారి పాలనలో పుష్కలంగా నీరు ఇచ్చారన్నా..అని చెబుతున్నారు. పక్కనే తెలంగాణ ప్రాంతంలో నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ వెళ్తుంది. అక్కడ ప్రతి ఏటా వరి పండిస్తున్నారు. మరి రాష్ట్రంలో వరి కాదు కదా..అరుతడి పంటలకు నీరు ఇవ్వడం లేదని రైతులు అంటున్నారు. కేసీఆర్‌కు ఉన్నది ఏంటీ? చంద్రబాబుకు లేనిది ఏంటీ అని రైతులు అడుగుతుంటే..నిజంగా చంద్రబాబుకు లేనిది ఏంటో తెలుసా..అడ్డగోలుగా అవినీతితో సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డగోలుగా ఆడియో వీడియో టేపులతో దొరికిపోవడం, ఆ టేపులు కేసీఆర్‌ వద్ద ఉండటమే. నీళ్లు సరిగా ఇవ్వకపోవడంతో మాగాణి భూçముల్లో మెట్ట పంటలు సాగుచేయాల్సి వస్తోంది. వరి వేసుకోవాల్సిన భూముల్లో పత్తి, మిర్చి, జామాయిల్, సుబాబుల్‌ పంటలు వేసుకోవాల్సి వస్తోంది. ఇవాళ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు.

– నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశారు కాబట్టి అడుగుతున్నాను. ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? పత్తి పరిస్థితి చూస్తే ఉత్పత్తికి అయ్యే ఖర్చు రూ.5500, మద్దతు ధర మాత్రం రూ.3500 కొనే నాథుడు లేడు. ఇదే జిల్లాలో మిర్చి రైతులు రూ.2500లకు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ప్రతిపక్ష నేతగా నేను వచ్చి ధర్నా చేయాల్సి వచ్చింది. మినుములు రూ.4000 , పెసలు రూ. 4 వేలు కూడా దక్కడం లేదు. మొక్కజొన్న రూ.1150 కూడా దక్కడం లేదు. శనగ కనీస మద్దతు ధర రూ.4400 ఉంటే, రూ.3 వేలకు కొనుగోలు చేయడం లేదు. కంది, వరి, ఏ పంట చూసినా కూడా రైతన్నకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ప్రతి చోట కనిపిస్తోంది. 

– ఇదే నియోజకవర్గంలో మార్కెట్‌యార్డుకు వెళ్తే రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. రైతులు మార్కెట్‌యార్డులో ధాన్యం అమ్ముకోవాలంటే ఏ పార్టీ అని అడుగుతున్నారు. రైతులపై ఈ ప్రభుత్వం కక్షసాధింపు ^è ర్యలకు పాల్పడుతోంది. లంచాలతో పీల్చి పిప్పి చేస్తున్నారు. పంట అమ్ముకోవాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు పొందాలంటే లంచాలు ఇవ్వాలి. పురుగుల మందు చల్లడానికి వాడే స్పేయర్లు తీసుకోవాలంటే లంచాలు ఇవ్వాల్సిందే.

–  రాష్ట్రవ్యాప్తంగా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతి షాపు కూడా ఇవాళ చాలా మంది జీఎస్‌టీతో బాధపడుతున్నారు. మన రాష్ట్రంలో జీఎస్‌టీతో పాటు టీఎస్‌టీ అంటే తెలుగు తమ్ముళ్ల సర్వీస్‌ ట్యాక్స్‌ ఉంది. జన్మబూమి కమిటీల నుంచి ప్రాజెక్టుల దాకా ఏది జరగాలన్నా టీడీపీ నేతలకు లంచాలు ఇవ్వాల్సిందే. ఈ నియోజకవర్గంలో ఇంకో ట్యాక్స్‌కూడా ఉంది. కేఎస్‌టీ కూడా ఉంది. రైల్వే కాంట్రాక్టర్ల నుంచి రైతుల బూములు కొట్టేసేదాకా, విద్యుత్‌ కొనుగోలు నుంచి కోట్టప్ప కొండ వరకు కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు కట్టాల్సిందే. అపార్ట్‌మెంట్లు కట్టాలన్నా..కొత్త సినిమా విడుదల కావాలన్నా కేఎస్‌టీ కట్టాల్సిందే. లంచం..లంచం..లంచం.. చంద్రబాబు పాలనలో లంచాలు పుచ్చుకోవడంలో త్రిబుల్‌ డిజిట్‌కు చేరింది. 
– ఇదే నియోజకవర్గంలో ఇక్కడే నాకు అర్జీలు ఇచ్చారు. అన్నా..మెడికల్‌ కాలేజ్, పాలిటెక్నిక్‌ కాలేజీ కావాలని, ఫోర్‌లైన్‌ రోడ్డు కావాలని, మంచినీటికి ఇంకో రిజర్వాయర్‌ కావాలని అడుగుతున్నా..పట్టించుకునే నాథుడు లేడు. మన ప్రాంతంలోనే పరిపాలన ఎలా సాగిస్తున్నారో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు.  

– రాష్ట్రంలో నాలుగేళ్లుగా చంద్రబాబు పాలన మనమంతా చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు చెబుతున్నారు. ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని, మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టి మనకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించండి. మీలో ఏ ఒక్కరైనా కూడా సంతోషంగా ఉన్నారా? రైతులు, పొదుపు సంఘాల మహిళలు, చదువుకుంటున్న పిల్లలను సైతం చంద్రబాబు మోసం చేశారు. 

– చంద్రబాబు పాలనలోని అబద్ధాలు, మోసాలు, అధర్మం చూస్తే నాకు ఒక కథ గుర్తుకు వస్తోంది. అనగనగనా ఒక దొంగ ఉన్నాడట. ఆ దొంగ దొంగతనానికి వెళ్లి తప్పుడు పనులు చేస్తూ అడ్డగోలుగా దొరికిపోయాడట. ప్రజలు, వ్యవస్థలు ఆ దొంగను ప్రశ్నించాయట. ఆ దొంగ ఏమన్నారంటే ..నన్ను అరెస్టు చేస్తే పోయేది మన ఊరి పరువే అన్నాడట. ఆ మాట అంటు మరో మాట ఏమన్నారంటే మన ఊరిని బలహీన పరిచినట్లే అని అన్నాడట. ఈ మాటలు వినినప్పుడు ఎవరి మాటలు గుర్తుకు వస్తాయని అడుగుతున్నాను. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు మాటలు మాట్లాడుతూ..తనను బలహీనపరడం ద్వారా రాష్ట్ర్రాన్ని బలహీన పరచడం అవుతుందట. తెలుగు ప్రజలను బలహీన పరిచినట్లట. ఈ దొంగ, చంద్రబాబు ఇద్దరూ కూడా తప్పు చేసి కూడా అన్యాయంగా మాట్లాడుతున్నారు.

– అయ్యా చంద్రబాబు గారు ఈ మాదిరిగా తప్పులు చేయమని, అన్యాయం చేయమని, తప్పుడు పనులు చేయమని ఏ ప్రజలు చెప్పారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టమని ఏ ప్రజలు చెప్పారు బాబూ?. ఏ ప్రజలు చెప్పారు బాబు ..ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ తీసుకోమని, మీ తరుఫున అడుగుతున్నా..ఏ ప్రజలు చెప్పారు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని అమ్మేయమని చెప్పారు. అయ్యా..చంద్రబాబు ఓట్ల కోసం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు అవినీతి సొమ్ముతో కొనుగోలు చేయమని ఎవరు చెప్పారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపొమ్మని. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం మీ చేతుల్లోకి తీసుకోమని ఏ ప్రజలు చెప్పారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో అంచనాలు పెంచి లంచాలు తీసుకోమని ఏ ప్రజలు చెప్పారు? అయ్యా చంద్రబాబు..ఇసుక నుంచి మట్టి, మద్యం, బొగ్గు, కరెంటు కొనుగోలు, రాజధాని భూములు, గుడి భూములు దాకా మేయడానికి ఏ ప్రజలు చెప్పారు. అయ్యా చంద్రబాబు..ఏ ప్రజలు చెప్పారు. 23 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.30 చొప్పున ఇచ్చి సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు చేయమని ఎవరు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించవద్దు అని ఎవరు చెప్పారు. ఏ ప్రజలు చెప్పారు..రుణమాఫీ పేరుతో రైతులు, పొదుపు మహిళలను దారుణంగా మోసం చేయమని, జాబు రావాలంటే బాబు రావాలని జాబు ఇవ్వకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేయమని ఏ ప్రజలు చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను పూర్తిగా నీరుగార్చమని ఏ ప్రజలు చెప్పారు. ఎన్నికలప్పుడు బెల్టు షాపులు తీసేస్తామని చెప్పి, ఆ తరువాత మద్యాన్ని ఏరులై పారించమని ఏ ప్రజలు చెప్పారు. చంద్రబాబును గట్టిగా అడుగుతున్నాను..రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప ఏవి ఇవ్వవద్దని ఎవరు చెప్పారు. కరెంటు చార్జీలు పెంచి బాదుడు బాధమని ఎవరు చెప్పారు. పెట్రోల్, డీజిల్‌ మీద ఎక్కడ లేని విధంగా లీటర్‌ మీదా రూ.7 భారం వేయమని ఎవరు చెప్పారు. పండగ రోజు ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్‌ టికెట్లు అమ్మమని ఏ ప్రజలు చెప్పారు.

– ఇవాళ ఈ పెద్ద మనిషి ఇన్ని వెదవ పనులు చేస్తే ఎవరు కూడా ప్రశ్నించకూడదట. తనను బలహీన పరిస్తే రాష్ట్రం బలహీన పడుతుందట. సిగ్గులేకుండా రాష్ట్రాన్ని అమ్మేసిన ఈ వ్యక్తికి సిగ్గుందా? నాలుగేళ్లుగా ఇటువంటి అన్యాయమైన పాలనను చూశారు. అబద్ధాలు, మోసాలు అనే పునాదుల మీద నడుస్తోంది. ఇలాంటి పాలన పోయి రేపు పొద్దున ప్రజా ప్రభుత్వం రావాలి. 
– మోసాలు, అన్యాయం చేసిన వ్యక్తిని రేపు పొద్దున క్షమిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎన్నికల్లో చంద్రబాబు మీ వద్దకు వచ్చి చిన్న చిన్న అబద్ధాలకు నమ్మరు కాబట్టి..రేపు పొద్దున ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని చెబుతారు. నమ్ముతారా? నమ్మించడానికి కేజీ బంగారానికి బోనస్‌ అంటాడు. బోనస్‌ ఏంటో తెలుసా..ఇంటికో బెంజికారు కొనిస్తానంటాడు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి ప్రతి ఇంటికి మనిషిని పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేల డబ్బు పెడతారు.కానీ రూ.3 వేలు డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనకండి. రూ.5 వేలు గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జô బుల్లో నుంచి దోచేసిన సొమ్మే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయమని అందర్ని కోరుతున్నాను. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసే వారిని బంగాళఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలకు అర్థం వస్తుంది. ఈ వ్యవస్థ బాగుపడాలంటే ఒక్క జగన్‌ వల్ల సాధ్యం కాదు, జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థలోకి మార్పు వస్తుంది. విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది.

– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలను ప్రకటించాం. ఆ పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలని నవరత్నాలు ప్రకటించాను. నవరత్నాలలోని కొన్ని అంశాలను ప్రతి మీటింగ్‌లో చెప్పుకొస్తున్నాను. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాల నుంచి పేదవాడి చదువుల కోసం మనం ఏం చేయాలో చెబుతున్నాను.
–  ఇవాళ మన పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లుగా పెద్ద పెద్ద చదువులు చదివించే స్థితిలో ఉన్నామా?ఇవాళ ఇంజినీరింగ్‌ చదవాలంటే ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ముష్టి వేసినట్లు రూ.35 వేలు ఇస్తున్నారు. ఒక్కసారి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. చంద్రబాబు ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలపై ప్రేమ అంటారు. బీసీలపై నిజమైన ప్రేమ చూపింది ఒక్క దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే అని గర్వంగా చెబుతున్నాను. పేదవాడు అప్పులపాలు అయ్యేది వైద్యం,  పిల్లలను చదివించుకునేందుకు అప్పులు చేయాల్సి వచ్చేది. ఆ పేదవాడు కూడా సావుకారి కావాలని నాన్నగారు భరోసా ఇచ్చారు. పేదవాడు తన పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించేందుకు అప్పులపాలు కాకుండా ఉండేందుకు నాన్నగారు తోడుగా ఉన్నారు. ఇవాళ నాన్నగారు చనిపోవడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పేదవాడు తన పిల్లలను ఉన్నత చదువులు చదివించలేకపోతున్నారు. పిల్లలను చదివించేందుకు ఆ పేదవాడు అప్పులు చేయాల్సి వస్తోంది. నాన్నగారు వైయస్‌ రాజశేఖరరెడ్డి పేదవాడి కోసం ఒక్క అడుగు ముందుకు వేశారు. నాన్నగారి కొడుకుగా వైయస్‌ జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. మీ పిల్లలు ఏం చదువుతారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా నేను భరిస్తా. ఆ ప్రతి పేద పి ల్లాడిని ఇంజినీరింగ్, డాక్టర్‌ చదివించడమే కాదు..వారు హాస్టల్‌లో ఉండేందుకు అయ్యే ఖర్చుల కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ప్రతి పిల్లాడికి ఏడాదికి రూ.20 వేలు హాస్టల్‌ ఖర్చులకు ఇస్తాను. అంతేకాదు పేద వాడి కోసం రెండు  అడుగులు ముందుకు వేస్తాను. ఆ పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లు చదివించాలంటే ఆ పునాదులు చిట్టి పిల్లల నుంచి పడుతాయి. ఆ చిట్టిపిల్లలు బడులకు వెళ్తేనే మన తల రాతలు మారుతాయి. ఆ ప్రతి తల్లికి చెబుతున్నాను. ఆ తల్లి తమ బిడ్డలను బడికి పంపిస్తే చాలు..ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని చెబుతున్నాను. కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి తన పిల్లలను బడికి పంపిస్తేనే మన బతుకులు మారుతాయి. దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేయబోతున్నామో చెప్పాను. మిగిలిన అంశాలను రాబోయే మీటింగ్స్‌లో చెబుతాను. ఇందులో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ పడుకుంటానో, ఎక్కడ నడుచుకుంటూ పోతున్నానో మీ అందరికి తెలుసు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, తోడుగా ఉండమని కోరుతున్నాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు కోరుతూ..పేరు పేరున మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నా..


 
Back to Top