తుప్పు..పప్పు బిరుదులు సార్ధకం







– 98 శాతం వాగ్ధానాలు బాబు నెరవేర్చారట
– చెప్పనివి కూడా చంద్రబాబు చేశారట
– బాబు రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదు
– బీజేపీతో తెగదెంపులు చేసుకోగానే బాబుకు ప్రత్యేక హోదా గుర్తుకు వస్తుంది
– మహానాడులో తిట్ల తీర్మానాలు చేశారు
– అబద్ధాల ప్రోగ్రస్‌ రిపోర్టులు మహానాడులో చూపించారు
– ఎన్టీఆర్‌ కుర్చీ, పార్టీ, జెండా, ట్రస్టు బాబు లాక్కున్నారు
– బీసీలు జడ్జీలు కాకుండా బాబు లేఖ రాశారు
– తెలంగాణలో బీసీలకు సీఎం పదవట.
– ఉప్పు రైతులకు గిట్టుబాటు ధర లేదు. గిడ్డంగులు లేవు
– మత్స్యకారుల బోట్లకు డీజిల్‌పై సబ్సిడీ
– వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు
 – ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేశారు
– మనం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని పునరుద్ధరిస్తా
– వెయ్యి రూపాయల బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు
–రోగి విశ్రాంతి సమయంలో డబ్బులిస్తాం
– దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేల పింఛన్‌
– పింఛన్‌ రూ.2 వేలకు పెంపు
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌

పశ్చిమ గోదావరి: అంతర్జాతీయ అబద్ధాలు, మోసాల పోటీలు విజయవాడలో ముగిశాయని, ఇటీవల నిర్వహించిన మహానాడులో  చంద్రబాబు తుప్పు అనే బిరుదును, ఆయన కుమారుడు లోకేష్‌ పప్పు అనే బిరుదును సార్ధకం చేసుకున్నారని వైయస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. 1995 నుంచి 2018 వరకు అబద్ధాలు, మోసాల్లో చంద్బరాబు నంబర్‌ వన్‌ అయితే, నారా లోకేష్‌ రెండో స్థానంలో నిలిచారని అభివర్ణించారు. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారని ఆయన మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నరసాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

– ఇసుక వేస్తే కూడా రాలనంతగా జనం వచ్చారు. కనుచూపు మేర ప్రజలు కనిపిస్తున్నారు. 45 డిగ్రీల ఎండ ఉన్నా..ప్రజలు నా వెంట అడుగులో అడుగు వేస్తున్నారు. ఒక వైపున కష్టాలు చెప్పుకుంటూ..మరో వైపు అర్జీలు ఇస్తూ అన్నా..మేమంతా నీ వెంటే ఉన్నామని నాతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. ఈ ఎండలో..దుమ్ములో నిలవాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేనప్పటికీ చిక్కని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరికి  పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు
– ఈ నియోజకవర్గంలో అడుగుపెడుతూనే..ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటేంటో తెలుసా? అన్నా..చంద్రబాబుకు ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు వస్తామన్నా..ఎన్నికలు అయిపోయిన తరువాత గుర్తుకు రామన్నా..అదిగో రాజధాని..ఇదిగో రాజధాని అని అందరికి సినిమా చూపిస్తున్నట్లు..మాకు కూడా అదిగో వశిష్ట వారధి..ఇదిగో వశిష్ట వారధి అంటున్నారు. 2016లో హర్బర్‌ నిర్మిస్తున్నట్లు గొప్పలు చెప్పారు. బ్రిడ్జి నిర్మిస్తున్నామని చెప్పారు. స్వీట్లు కూడా పంచుకున్నారన్నా..ఈ రోజుకు ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదు. ఈస్టు గోదావరి జిల్లాకు వెళ్లాలంటే 40 కిలోమీటర్లు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నా..పని అయినపోయిన తరువాత మమ్మల్ని గాలికి వదిలేశారన్నా.. బీఏపీ తిప్ప వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు వస్తుందన్నా..
– చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హార్బర్‌ గురించి హామీ ఇవ్వడం మరిచిపోవడం ఇది రెండో సారి. బీఏపీ తిప్ప హర్బర్‌ పరిస్థితి గురించి మత్స్యకారులు చెబుతున్నారు. సీఎం అయ్యాక కొత్త బోట్లకు అనుమతించడం లేదన్నా అంటున్నారు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు ఫిషింగ్‌ హాలీడే..ఈ సమయంలో మాకు సరైన సాయం అందడం లేదన్నా అంటున్నారు. 
– ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నాడు. ఇల్లు కట్టిస్తామన్నాడు. ఇప్పటికి ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నా అంటున్నారు. మత్స్యకారులు చనిపోతే గతంలో వెంటనే పరిహారం ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రన్న భీమాతో ముడిపెట్టారు. సకాలంలో డబ్బులు రావడం లేదంటున్నారు.
– మనందరి ప్రభుత్వం అధికారంలోకివచ్చాక..ప్రతి మత్య్సకారుడికి హామీ ఇస్తున్నాను. కొత్త బొట్లకు రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను. విరామ సమయంలో ఇచ్చే రూ.4 వేలు పోయి, ప్రతి కుటుంబానికి రూ.10 వేలు  ఇస్తానని హామీ ఇస్తున్నాను. 
– మత్య్సకారులు ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని సముద్రంలోకి వెళ్తారు. ఇంటికి వచ్చే వరకు భయమే. అటువంటి ప్రతి సోదరుడికి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకారులు చనిపోతే రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇస్తున్నాను.
– మత్స్యకారులకు కార్పొరేషన్‌ కావాలని అడుగుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మనందరి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నాను.
– ఈ నియోజకవర్గంలో ఉప్పు రైతులు నా వద్దకు వచ్చారు. చంద్రబాబు సీఎం అయ్యారు.. మంచి చేస్తానని మాట ఇచ్చారు. ఇవాళ మా పరిస్థితి గమనించండి అన్నా అంటున్నారు. పది వేల కుటుంబాలు ఉప్పు సాగుపై ఆధారపడ్డారు. గిట్టుబాటు ధర రాక అవస్థలు పడుతున్నారు. సరుకులు నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు లేవు. దళారుల చేతిలో ఉప్పు రైతులు నష్టపోతున్నారు. రైతుల వద్ద రూ.1.50కు కొంటున్నారు. ఇదే హెరిటేజ్‌ షాపులో రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. రైతులు ఎక్కడికి పోవాలని అడుగుతున్నాను.
– నాలుగేళ్లుగా ఏదైనా ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని మీ అందరి తరఫున చంద్రబాబును నిలదీస్తున్నాను. వరి మద్దతు ధర రూ.1550 ఉంది, రైతు అమ్ముకోవాలంటే రూ.1100లకు కొనుగోలు చేసే నాథుడు లేడు. 
– ఈ నియోజకవర్గంలో చేతి అల్లికలపై 15 వేల మంది బతుకుతున్నారు. లేస్‌ ఇండస్ట్రీలో పని చేసేవారు నాన్నగారిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నాన్నగారి పాలనలో అల్లికలపై శిక్షణ ఇవ్వడమే కాకుండా నేరుగా అమ్ముకునే పరిస్థితి ఉండేదన్నా..ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కేజీ దారం అల్లేందుకు పది రోజులు పడుతుంది. కేజీ దారానికి రూ.200 వస్తుందన్నా.. గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు.
– మనందరి ప్రభుత్వం అధికారంలోకివచ్చిన తరువాత చేనేత వృత్తి, కళంకారి వృత్తికి పెట్టుబడి సబ్సిడీ కింద నెల నెల రూ.2 వేలు ఇస్తామని చెప్పామో? చేతి అల్లికల అక్కచెల్లెమ్మలకు ఇస్తాం.
– ఇక్కడి ప్రజలు నాతో మాట్లాడుతున్నారు. అన్నా..నరసాపురంవద్ద సముద్రం పాలవుతున్నా మంచినీటిని డైవర్స్‌ కాల్వకు మహానేత వైయస్‌ఆర్‌ నిధులు మంజూరు చేశారు. నాన్నగారు చనిపోయిన తరువాత పట్టించుకునే పరిస్థితి లేదు. దారి పొడవునా అక్క చెల్లెమ్మలు బాటిల్స్‌ తీసుకొచ్చి చూపిస్తున్నారు. అన్నా..మీరు పబ్లిక్‌ మీటింగ్‌లో ఈ బాటిల్‌ చూపించండన్నా..చంద్రబాబుకు చూపించండన్నా..ఇది చెరకు రసం కాదు చంద్రబాబు అని చూపండన్నా అని అక్క చెల్లెమ్మలు చెబుతున్నారు. బోర్లు వేస్తే ఉప్పునీళ్లు పడుతున్నాయి. మంచినీళ్లు రావడం లేదు. డ్రైన్లు సరిగా లేని పరిస్థితిలో చివరకు మంచినీళ్లు కూడా ఇవ్వని స్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తుందన్నా అంటున్నారు.
– ఇంత దారుణంగా పాలన సాగుతుంటే..ఎన్టీఆర్‌ జయంతి రోజు టీడీపీ మహానాడు నిర్వహించారు. ప్రతి ఒక్కరు రావడం జగన్‌ను తిట్టడం. జగన్‌ను తిట్టడానికి మూడు రోజుల పాటు అంతర్జాతీయ అబద్ధాల పోటీలు నిర్వహించారు. దానికి మహానాడు అని పేరు పెట్టారు. ఆ పోటీల్లో వంచన, అబద్ధాలు, దగా, కుట్ర, వెన్నుపోటు అనేక అంశాలపై పోటీ పెట్టారు. వరసగా 24వ సారి నారా చంద్రబాబు ఈ విద్యలన్నింటిలోనూ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచి తుప్పు అన్న బిరుదును నిలబెట్టుకున్నారు.  ఇదే పోటీల్లో రెండో స్థానంలో నారా లోకేష్‌..తనకు ఉన్న బిరుదు పప్పును తానూ నిలబెట్టుకున్నారు. మహానాడు అన్న ఈ వేడుకలో అబద్ధాలు ఆడటం ఎలా అని పీజీ చేసిన ఇద్దరు నాయకులకు ఇచ్చి మాట్లాడించారు. ఈ వేదికలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు కుర్చీని, పార్టీని, ట్రస్టును, జెండాను లాక్కున్నారు. ఆయన చావుకు కూడా కారణమైన ఈ వ్యక్తి ఎన్టీఆర్‌ ఫొటోకు దండేసి దండం పెడతారు. ఇదే చంద్రబాబు చేసిన కుట్రలు, మోసాలకు నిదర్శనం మహానాడు. ఏదైనా ప్లీనరీ జరుపుకుంటే ఆ పార్టీ ఏం చేశారో చెప్పాలి. ఏం చేస్తామన్నది చెప్పాలి. కొత్త వాగ్ధానాలు చెప్పకుండా మహానేత మాదిరిగా ఎన్నికలకు వెళ్తామని చెప్పే దైర్యం టీడీపీ నేతలకు లేదు. మహానాడు మీటింగ్‌లో తిట్ల తీర్మానాలు, అబద్ధాల ప్రోగ్రస్‌ రిపోర్టులు.
– నాలుగేళ్లు కేంద్రంలో బీజేపీతో సంసారం చేశారు.  బీజేపీ ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో మంత్రులుగా పనిచేశారు. నాలుగేళ్లు చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి అడగలేదు. కొత్త పెళ్లి కూతురును వెతుకునే సమయంలో ప్రత్యేక హోదా గుర్తుకు వస్తుంది. 2017లో నిర్వహించిన మహానాడులో ప్రత్యేక ప్యాకేజీకి తీర్మానం చేశారు. బీజేపీతోవిడాకులు తీసుకున్న తరువాత ప్రత్యేక హోదా కావాలి..బీజేపీ మోసం చేసింది. ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయని వేరే వాళ్లు మోసం చేస్తే..ఈయన చూస్తున్నారట. ఈ పెద్ద మనిషి మహానాడులో చేసిన తీర్మానాలు గమనించండి. 
– చంద్రబాబు 600పైగా హామీలు ఇచ్చారట..90 శాతం అమలు చేశారట. చెప్పనివి కూడా అమలు చేశారట. చంద్రబాబూ..నీవు సీఎంఅయ్యాక ప్రమాణ స్వీకారం చేసే సమయంలో పెట్టిన సంతకాలు ఏంటో తెలుసా? రైతుల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ కావాలంటే..బ్యాంకులో పెట్టిన బంగారంఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. మహానాడు లో మాత్రం మొత్తం రుణాలు మాఫీ చేశారట.
– పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశారట. ఒక్క రూపాయి అయినా చంద్రబాబు మాఫీ చేశారా? ఇదే పింఛన్ల గురించి మాట్లాడుతున్నారు. ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి 48 లక్షల పింఛన్లు ఉండేవి. ఈయన వచ్చాక 37 లక్షలకు తెచ్చారు. ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పింఛన్లు ఇస్తానని లీకులు
– ఆరోజు పెట్టిన తొలి సంతకం ఏంటో తెలుసా? రూ.2లకే 20 లీటర్ల మినిరల్‌ వాటర్‌ ఇస్తామన్నారు. ఈయన మినరల్‌ వాటర్‌ తాగి అంతా కేరింతలు కొడుతున్నారట. బెల్టు షాపులు రద్దు చేస్తానని మొదటి సంతకం చేశారు. ఇవాళ మినరల్‌ వాటర్‌ లేని గ్రామం ఉందో లేదో కానీ..బెల్టు షాపు లేని గ్రామం లేదు. 
– బీసీల గురించి ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నారు. బీసీలు జడ్జీలు కాకుండా చంద్రబాబు దగ్గరుండి లేఖలు రాశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరయ్య చంద్రబాబు లేఖను చూపించారు. ఈ పెద్ద మనిషి మహానాడులో ఏమన్నారో తెలుసా..తెలంగాణలో బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారట. ఏపీలో బీసీలను జడ్జీలు కాకుండా అడ్డుకుని, పక్క రాష్ట్రంలో సీఎంపదవి ఇస్తారట. ఇక్కడ సీఎంగా ఉన్న చంద్రబాబు గిరిజనులకు, మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇంతకన్న మోసం చేసే వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా?
– ఇలాంటి వ్యక్తులు ఉన్నారుకాబట్టే రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పురావాలి. దానికి ఒక్క జగన్‌ వల్ల మార్పు రాదు. జగన్‌కు మీ అందరి తోడు కావాలి. ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి.
– రేపు పొద్దున చంద్రబాబును పొరపాటున క్షమిస్తే..ఇక చిన్న చిన్న అబద్ధాలు నమ్మరని చంద్రబాబుకు బాగా తెలుసు. మీరు క్షమిస్తే..చంద్రబాబు మైక్‌ పట్టుకొని ఏం చెబుతారో తెలుసా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి బోనస్‌గా  బెంజి కారు అంటారు. అయినా నమ్మురు కాబట్టి ప్రతి ఇంటికి మనిషిని పంపిస్తారు. ప్రతిఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. డబ్బులు ఇస్తే మాత్రం వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మనజేబుల్లో నుంచి లాక్కున్నదే. కానీ ఓటు వేసే సమయంలో మీ మనసాక్షి ప్రకారం వేయండి. మోసాలు, అబద్ధాలు చెప్పే వారిని బంగాళఖాతంలో కలిసేలా ఓటు వేయండి.
– ఇటువంటి అన్యాయమైన పాలన పోయి...దేవుడి ఆశీస్సులతో, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాకా మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాను. ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు చూడటమే నవరత్నాలు రూపొందించాం. ఇవాళ మీటింగ్‌లో పేదవాడి ఆరోగ్యం కోసంమనం ఏం చేస్తామన్నది చెబుతున్నాను.
– ఇవాళ పేదవాడికి నిజంగా వైద్యం అందుతుందా? వైద్యం కోసం అప్పులపాలవుతున్నారు. ఒక్కసారి దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. పేదవాడు అప్పులపాలు అయ్యేది వైద్యం, విద్య. ఈ రెండు అంశాల్లోనే పేదవాడు అప్పులపాలు అయ్యేవాడు.  ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు దివంగత ముఖ్యమంత్రి ఒక స్వప్నాన్ని చూశారు. 108 అన్న నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు కుయ్‌..కుయ్‌ అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్‌ వచ్చి ఆ పేదవాడిని ఆసుపత్రికి చేర్పించేది. దేశంలో ఎక్కడ జరగని విధంగా రాష్ట్రంలోపరిపాలన అందించారు. మహానేత చనిపోయిన తరువాత ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉంది. ఇదే నియోజకవర్గంలో ఈ రోజే ఒక ఘటన చూశాను. ఈ నియోజకవర్గంలో నడుచుకుంటూ వస్తుంటే కుర్చీలో ఒక మనిషిని కూర్చోబెట్టారు. ఆ మనిషి 22 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేశానని లక్ష్మనరావు చెప్పాడు. ఒక రోజు ఇంటికివచ్చినప్పుడు రాత్రి సడన్‌గా పెరాలసిస్‌ వచ్చింది. ఒక పక్క శరీరం పని చేయడం లేదన్నా అన్నాడు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిందా అంటే ? ఒక్క రూపాయి కూడా సాయం అందలేదని ఆ లక్ష్మనరావు చెప్పాడు. మందుల కోసం నెలనెల రూ.2వేలు ఖర్చు చేస్తున్నాడు. ఏ పని చేతకాదు. ఇలాంటి వాళ్ల పరిస్థితి ఏంటీ? ఇవాళ 108కి ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే పరిస్థితి ఉందా?. ఇవాళ వినిపించే సమాధానం ఏంటో తెలుసా..మూడు నెలలుగా జీతాలు లేవని, అంబులెన్స్‌ రిపేరీలో ఉందని, డీజిల్‌ లేదన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. నెట్‌వర్క్‌ ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు వైద్యం చేయడం లేదు. ఆ ఆసుపత్రులకు ప్రభుత్వం బకాయిలు ఇవ్వడం లేదు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులు పేషేంట్లను ముట్టుకోవడం లేదు. మీలో ఎవరికైనా బాగాలేకపోతే..మంచి ఆసుపత్రికి వెళ్తారు. మంచి ఆసుపత్రిలన్నీ కూడా హైదరాబాద్‌లో ఉన్నాయి. అటువంటి హైదరాబాద్‌కు వైద్యం కోసం వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదట. క్యానర్స్‌ వస్తే కీమో థెరపీ చేయాలి. కీమోథెరపీ చేయాలంటే లక్షల్లో ఖర్చు వస్తుంది. ప్రభుత్వం మాత్రం రెండు సార్లు మాత్రమేకీమో థెరపీ చేస్తుందట. ఆ పేషేంట్‌ అటు నుంచి అటే పైకి వెళ్లే పరిస్థితి ఉంది. మన పిల్లలకు మూగ,చెవుడు ఉన్న చిట్టి పిల్లలకు ఆపరేషన్‌ చేయాలంటే కాంక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ చేయించాలి. ఆ రోజుల్లో నాన్నగారు ఉచితంగా చేయించేవారు. ఈ ప్రభుత్వం ఆపరేషన్‌ ఎగరగొట్టడానికి కారణాలు వెత్తుకుంటుంది.
–  ఈ వ్యవస్థను మార్చబోతున్నాను. రేపుపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకివచ్చాక ప్రతి పేదవాడికి హామీ ఇస్తున్నాను. మీ వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కింద వర్తింపజేస్తాను. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..నాన్నగారి కొడుకుగా జగన్‌ రెండుఅడుగులు ముందుకు వేస్తున్నాను.  ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఉచితంగా ఆపరేషన్‌ చేయిస్తాను. ఆపరేషన్‌ చేయించుకున్న పేదవాడు విశ్రాంతి తీసుకునే సమయంలో డబ్బులు కూడా ఇస్తాం. దీర్ఘ కాలిక రోగాలతో బాధపడుతున్న వారికి చెబుతున్నాను. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల రూ.10 వేల పింఛన్‌ ఇస్తానని మాట ఇస్తున్నాను.
– అవ్వతాతలకు వయసు పెరిగే కొద్ది ఖర్చులు ఎక్కువగా వుంటాయి. మందుల ఖర్చులు ఉంటాయి. వీరికి పింఛన్‌ పెంచాలన్న మనసు చంద్రబాబుకు రాదు. వారికి పింఛన్‌ పెంచితే లంచాలు చంద్రబాబుకు రావు కాబట్టి..అడగకపోయినా కాంట్రాక్టర్ల రేట్లు పెంచుతారు. ధరలు తగ్గినా కూడా కాంట్రాక్టర్లకు రేట్లు పెంచారు. అవ్వతాతాల కోసం మనందరి ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాను. అంతేకాదు ప్రతి నెల రూ.2 వేల పింఛన్‌ ఇస్తాను. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కల కోసం చెబుతున్నాను. పింఛన్‌ రూ.2 వేలు ఇవ్వడమే కాదు..పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తానని మాట ఇస్తున్నాను. వీటిలో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే ఎవరైనా రావచ్చు. నేనెక్కడ ఉంటానో మీ అందరికి తెలసు. ఎవరైనా రావచ్చు..అర్జీలు ఇవ్వవచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థనుమార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని పేరు పేరున కోరుతూ..సెలవు తీసుకుంటున్నా..





 

తాజా వీడియోలు

Back to Top