చంద్రబాబుది నోరా..? అబద్ధాల ఫ్యాక్టరీనా?





–జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పని వ్యక్తిని చంద్రబాబు అంటారు
– చోడవరం చక్కెర ఫ్యాక్టరీ అందరికీ అవసరం
– బాబు హయాంలో సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు, పాల డయిరీలు మూత పడాల్సిందే
– పోలవరాన్ని బాబు పూర్తి చేయరు
– పోలవరం పూర్తి చేసి రైవాడ రిజర్వాయర్‌కు నీళ్లందిస్తాం 
– చంద్రబాబు పాలనలో అవినీతి, అన్యాయం, అహంకారం చూశాం
– ఇలాంటి మోసాలు చేసే వ్యక్తిని పొరపాటున కూడా క్షమించవద్దు
– ప్రత్యేక హోదాను తన లంచాలు, కేసుల కోసం తాకట్టు పెట్టారు
– 2014లో జగన్‌కు ఓటు వేస్తే..రాహుల్‌కు వేసినట్లే అన్నారు
– ఇప్పుడు జగన్‌కు ఓటేస్తే..బీజేపీకి వేసినట్లేనని అంటున్నారు.
– చంద్రబాబు ఏ పార్టీతో ఉంటే అదే పార్టీ మంచిదంటాడు
– ప్రతీ పేదవాడి ముఖంలో ఆనందం చూడడానికి నవరత్నాలు అమలు
– మహిళలను మళ్లీ లక్షాధికారులను చేస్తాం
– పొదుపు సంఘాల రుణాలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం
– కార్పొరేషన్లను ప్రక్షాళన చేస్తాం

విశాఖ: చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనను వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తూర్పారబట్టారు. ఎన్నికల్లో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా, అన్ని చేశామని అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబుది నోరా..? అబద్ధాల ఫ్యాక్టరీనా అని ప్రజల తరఫున వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక మహిళలను లక్షాధికారులను చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కే.కోటపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.


బాబు సీఎం కావడం మా ఖర్మ అంటున్నారు..
ఈ నియోజకవర్గంలో అడుగుపెడుతూ నడక సాగిస్తున్నప్పుడు ఇక్కడి రైతన్నలు నా వద్దకు వచ్చి అన్నా..ఈ ప్రాంతపు నియోజకవర్గానికి, ప్రజలకు చోడవరం చక్కెర ఫ్యాక్టరీ చాలా అవసరమన్నారు. దాదాపుగా 24 వేల మంది రైతులు ఈ చక్కెర ఫ్యాక్టరీపై ఆధారపడి బతుకుతున్నామని చెప్పారు. మా ఖర్మ చూడండి అన్న..ఎప్పుడు చంద్రబాబు సీఎం అయినా సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు, డయిరీలు మూతపడాల్సిందే. గతంలో కూడా చోడవరం ఫ్యాక్టరీని రూ.45 కోట్ల నష్టాల్లోకి నెట్టేశారు. ఆ తరువాత శనగకాయలకు, బిస్కెట్లకు, తన బంధువులకు అమ్మే కార్యక్రమం చంద్రబాబు చేశారు. కోర్టుకు వెళ్తే తప్ప దాన్ని ఆపుకోలేకపోయామని చెబుతున్నారు. మా అదృష్టం కొద్ది నాన్నగారు సీఎం అయ్యారు. రూ.45 కోట్లు నష్టాల్లో ఉన్న చోడవరం చక్కెర ఫ్యాక్టరీని ఆధునీకరించారన్నా..అక్కడ పవర్‌ ప్లాంట్‌ పెట్టారు. టన్నుకు రూ.4 వేలు రాయితీలు ఇచ్చారు. ఆ నష్టాన్ని పూడ్చి రూ.45 కోట్ల లాభాల్లోకి తెచ్చారన్నా..మా ఖర్మ చూడండి అన్నా..లాభాల్లో ఉన్న ఈ చెక్కర ఫ్యాక్టరీ చంద్రబాబు పాలనలో రూ.100 కోట్ల నష్టాల్లోకి వెళ్లిందన్నా..దగ్గరుండి చంద్రబాబు నష్టాల్లోకి నెట్టుతున్నారు. చక్కెర మార్కెట్లో క్వింటాల్‌ రూ.3 వేలు పలుకుతుంటే. ఈ చక్కెర తడిసిందని చంద్రబాబు బినామీ సుజనా చౌదరి బంధువుకు రూ.1100 క్వింటాల్‌ చొప్పున కట్టబెట్టారన్నా అని వాపోతున్నారు. ఇదే ఫ్యాక్టరీలో మోలాసిస్‌ తయారు చేస్తారు. టన్ను మోలాసిస్‌ రూ.6 వేలు ఉంటే, రూ.2500 చొప్పున అమ్ముతున్నారు. అసలు చంద్రబాబు సీఎం పదవికి  అర్హుడేనా అంటున్నారు. చంద్రబాబు మా జీవితాలతో ఆడుకుంటున్నారని చెబుతున్నారు.

బాబు పాలనలో పోలవరం పూర్తి అవుతుందన్న నమ్మకం లేదు
మరోవైపు రైవాడ రిజర్వాయర్‌కు సంబంధించిన నీటిని దశాబ్ధాలుగా విశాఖకు తరలిస్తున్నారు. ఈ నీటిని పూర్తిగా రైతులకు అందిస్తే వీరి జీవితాలు బాగుపడుతాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రైవాడ రిజర్వాయర్‌లో నీటిని పెంచవచ్చు. చంద్రబాబు హయాంలో పోలవరం పూర్తి అవుతుందన్న నమ్మకం నాకు ఏ కోశాన లేదు. మీకేమైనా ఉందా? పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు అవినీతిమయం చేశారు. రేట్లు పెంచి, తనకు సంబంధించిన బినామీలను నామినేషన్‌ పద్దతిలో సబ్‌ కాంట్రాక్ట్‌లు కట్టబెడుతున్నారు. మంత్రి యనమల వియ్యంకుడు రెట్టింపు స్థాయిలో దోచకుంటున్నారు. ఎవరి హయంలో పోలవరం ఎవరు పూర్తి చేయాలో దేవుడు రాసిపెట్టాడు. రైవాడకు పూర్తిస్థాయిలో నీటిని అందిస్తాం.

పేరుకే మంజూరు..నిధులు నిల్‌
చోడవరం నుంచి దేవరాపురం, గౌరవరం రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయని, ఇసుక రవాణా చేసి రోడ్లు గుంతలు పడ్డాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. సీఎం పదవిలో ఉండి ఎవరైనా మాట ఇస్తే జరిగిపోతుందని నమ్ముతాం. మాడుగులకు డిగ్రీ కాలేజీ ఇస్తామన్నారు. ఇంతవరకు భవనాలు కట్టలేదని చెబుతున్నారు. పేరుకు మంజూరు..కట్టడానికి డబ్బులు లేవు. ఇది చంద్రబాబు పరిపాలన
– నీరు–చెట్టు కింద ముసిడిపల్లె, నాగరాజ చెరువు, రెడ్డివాడ కొత్త చెరువు, అనేక చెరువుల్లో ఏకంగా పొక్లైన్లు పెట్టి తాటిచెట్టు అంత లోతుకు తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. అడుగో, రెండు అడుగులో తవ్వితే రైతులకు ఉపయోగపడుతుంది. మట్టిని మా కళ్ల ఎదుటే దారుణంగా అమ్ముకుంటున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. చెరువులు తవ్వినందుకు బిల్లులు లాగేస్తున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

అధ్వాన్నమైన పాలన
అన్నా..నాన్నగారి హయాంలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే అక్షరాల పేదవాడికి 42 వేల  ఇళ్లులు కట్టించారని చెబుతున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఊరికి నాలుగు ఇళ్లులు కూడా కట్టలేని అధ్వాన్నమైన పాలన చూస్తున్నాం. మాడుగుల మండలంలోని బొడ్డేరుమీద ఉన్న ఆయకట్టు 500 మంది రైతులకు మేలు చేస్తుంది. హుద్‌హుద్‌ వచ్చినప్పుడు ఈ కట్ట తెగిపోయింది. ఇంతవరకు పట్టించుకోవడం లేదు.
– మాకు మూడేళ్ల క్రితం పీహెచ్‌సీ ప్రారంభించారు. అక్కడ కనీసం ఒక్క బెడ్‌ కూడా లేదని చెబుతున్నారు. మౌలిక సదుపాయాలు లేవని చెబుతున్నారు. 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే నాన్నగారి హయాంలో కుయ్‌..కుయ్‌ అంటూ 20 నిమిషాల్లో వచ్చి ఆ పేదవాడికి భరోసాగా ఉండేది. ఈ రోజు 108కు ఫోన్‌ కొడితే డీజిల్‌ లేదంటున్నారు. మొన్న గుళ్లిపల్లెకు చెందిన ఓ యువకుడు మరణించాడని చెబుతున్నారు.
– ఉత్తరాంధ్రలో దాదాపుగా 200 మంది జ్వరాలు వచ్చి చనిపోయారని చెబుతున్నారు. ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉందా? ఇంతదారుణంగా పాలన సాగిస్తున్నారు.

ఇదీ బాబు నైజం..
చంద్రబాబు పాలనలో అబద్ధాలు, అన్యాయాలు, అరాచకాలు, మోసాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు నైజాన్ని చూస్తే..తప్పుడు పనులన్నీ చంద్రబాబు చేస్తారు. ఆ తప్పుడు పనుల నెపాన్ని వేరే వారి మీదకు నెట్టేయడానికి పదే పదే అబద్ధాలు చెబుతారు. ఈ పెద్ద మనిషికి తోడు నలుగురు మంత్రులు టీవీల వద్దకు వచ్చి అబద్ధాలు చెబుతారు. ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా అదే చంద్రబాబు అబద్ధాన్ని నిజమని చెప్పడానికి ఊదరగొడుతూ చెబుతున్నారు.

ముస్లిం యువకులపై తప్పుడు కేసులు
చంద్రబాబు ఈ మధ్యకాలంలో తాజాగా అబద్ధాలు ఎంతటి స్థాయిలో చెప్పారంటే..నిన్న గుంటూరు మీటింగ్‌లో అల్లర్లు సృష్టించి, అమాయకులైన ముస్లిం యువకులను ఇరికించామని వైయస్‌ఆర్‌సీపీ నేర ప్రవృత్తికి ఇది నిదర్శమని అన్నారు. సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు గుంటూరులో ముస్లింల మీటింగ్‌లు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారిని రమ్మన్నది ఎవరయ్యా?  చంద్రబాబు పిలుపు పుచ్చుకొని ముస్లింలు మీటింగ్‌కు వెళ్లి కొంత మంది చంద్రబాబు మోసాలు, అబద్ధాలు చూడలేక సీఎంను నిలదీస్తు ప్లకార్డులు పట్టుకున్నారు. వారు అడిగింది ఏంటో తెలుసా? చంద్రబాబు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అన్నారు. ముస్లింలకు కేబినెట్‌లో మంత్రి పదవులు ఇవ్వని ప్రభుత్వం మొట్ట మొదటిది మీదే అని నిలదీస్తే..వారిని చంద్రబాబు ఏం చేశారో తెలుసా? ఆ పిల్లలను 30 గంటల పాటు ఎక్కడ ఉంచారో తెలియకుండా పోలీసు స్టేషన్లలో నిర్భందించారు. ఆ పిల్లలను కొట్టారు, హింసించారు. అంతటితో చంద్రబాబు ఊరుకోకుండా, ఆ పిల్లలను దేశాన్ని విభజించమని అడిగినట్లు తప్పుడు కేసులు పెట్టారు. చంద్రబాబు అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్లు మన దేశాన్ని విభజించమని అడిగినట్లు దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించారు. చంద్రబాబు అసలు మనిషేనా? ఈ పెద్ద మనిషి చేసిన మోసం, అన్యాయానికి వైయస్‌ఆర్‌సీపీ నాయకులు స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శిస్తే..వైయస్‌ఆర్‌సీపీ నాయకులను కూడా అరెస్టు చేయించారు. అక్కడి డీఎస్పీ శ్రీనివాసరావు అదే రోజు సాయంత్రం అరెస్టు అయిన పిల్లలు ఏ పార్టీకి చెందిన వారు కాదని చెబితే..మరుసటి రోజు వారు వైయస్‌ఆర్‌సీపీ మనుషులు అని తప్పుడు కేసులు పెట్టించారు. చంద్రబాబు నీది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా అని అడుగుతున్నాను.
– కాపుల ఉద్యమం సందర్భంగా తునిలో చంద్రబాబు దగ్గరుండి రైలును తగులబెట్టించారు. ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నేరాన్ని నెట్టారు. తప్పుడు కేసులు పెట్టంచి అనేక మంది అమాయకులు, ఆడవాళ్లపై, ఎస్సీలపై కేసులు పెట్టించారు. 
ఇప్పటి వరకు ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారు. ఇప్పుడు మళ్లి వైయస్‌ఆర్‌సీపీ ట్రైన్‌ తగులబెట్టించిందని చెబుతున్నారు. 

మీ అందరి తరఫున ప్రశ్నిస్తున్నా..
 ఎన్నికలప్పుడు రైతులకు బేషరత్తుగా రుణాలన్నీ రూ.87 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్ల పాలనలో కనీసం రైతుల వడ్డీలో నాలుగో వంతు కూడా మాఫీ చేయలేదు. ఈయన ఏంమాటారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేశానని చెబుతున్నారు. చంద్రబాబు నీది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా?
– పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి, ఒక్క రూపాయి కూడా మాపీ చేయకుండా ఇప్పుడు మాఫీ చేశానని శాలువాలు కప్పించుకుంటున్నారు. చంద్రబాబు నీది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా? అని అడుగుతున్నాను.
– ఊరికి పది ఇళ్లు కూడా కట్టించలేదు. నాలుగున్నరేళ్ల కాలం అయిపోయింది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని చెబుతున్నారు. మరో 19 లక్షల ఇళ్లులు ఈ ఆరు నెలల్లో కడుతారట. అయ్యా చంద్రబాబు నీది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా? అని అడుగుతున్నాను.
– ఎన్నికలకు ముందు బెల్టుషాపులు ఎత్తేస్తా అన్నారు. సీఎం కాగానే తొలి సంతకం పెట్టారు. మన ఇళ్ల ముందే, గుడి, బడి పక్కనే ప్రతి ఊర్లోనే రెండు, మూడు బెల్టుషాపులు పెట్టారు. ఇప్పుడేమో బెల్టు షాపులు ఎత్తేశానని చెబుతున్నారు. అయ్యా చంద్రబాబు నీది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా?
– చంద్రబాబు ఇవాళ ఇసుక ఉచితంగా ఇస్తున్నామని చెబుతున్నారు. రెండు యూనిట్ల ఇసుక రూ.16 వేలకు అమ్ముతున్నారు. చంద్రబాబు నీది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా?
– ఎన్నికల ప్రణాళిక అని తీసుకువచ్చారు. అది పవిత్ర పుస్తకం లాంటిది. ప్రతిది చేయాల్సిన ధర్మం ఏ రాజకీయ నాయకుడిపైన ఉంటుంది. చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా 99 శాతం నెరవేర్చానని చెబుతున్నారు. మీ అందరి తరఫున అడుగుతున్నాను..అయ్యా చంద్రబాబు నీది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా?
– చంద్రబాబు హయాంలో అక్షరాల 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. టెట్‌1, టెట్‌2, టెట్‌ 3 అంటూ ఫీజులు గుంజుతున్నారు. విశాఖలో మీటింగ్‌ పెట్టి రూ.20 లక్షల పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్నారు. మీ అందరి తరఫున అడుగుతున్నాను..చంద్రబాబు నీది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా
– రాష్ట్రంలో ఒక కోటి 70 లక్షల ఇళ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నారు. లేదంటే నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచచ్చారు. ఎన్నికలకు ఆరు నెలలు ముందు కేవలం 10 లక్షల మందికి అది కూడా నాలుగు నెలల కోసమట నెలకు రూ.1000 ఇస్తారట. అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. చంద్రబాబు నీది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా
– ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రం బాగుపడుతుందని అందరికి తెలుసు. ఎన్నికలకు ముందు చంద్రబాబు హోదా సంజీవని అన్నారు. 15 సంవత్సరాలు తెస్తానని ఊదరగొట్టారు. ప్రత్యేక హోదాను తన లంచాల కోసం కేంద్రానికి తాకట్టు పెట్టారు. హోదా కన్నా ప్యాకేజీ బెటర్‌ అ న్నారు. ఏ రాష్ట్రానికి  ఇవ్వనన్ని నిధులు మన రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి ఇప్పుడు విడాకులు ఇచ్చి మొదటి భార్య చెడ్డదని చెబుతున్నారు. కేంద్రంపై పోరాటమట. ధర్మ పోరాటం అంటున్నారు. మీ అందరి తరఫున అడుగుతున్నాను. చంద్రబాబు నీది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా?
– 2014కు ముందు జగన్‌కు ఓటు వేస్తే రాష్ట్రాన్ని విభజించిన రాహుల్‌ గాంధీకి ఓటు వేసినట్లే అన్నారు. గుర్తుందా అన్నా..అక్కా..అప్పుడు బీజేపీతో జత కట్టారు. ఇప్పుడేమో జగన్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లు అంటున్నారు. ఆయన బీజేపీతో ఉంటే బీజేపీ మంచిది. కాంగ్రెస్‌తో ఉంటే కాంగ్రెస్‌ మంచిది. రెండో భార్యతో కాపురం చేస్తే మొదటి భార్య చెడ్డది.  మీ అందరి తరఫున అడుగుతున్నాను. చంద్రబాబు నీది నోరా..అబద్ధాల ఫ్యాక్టరీనా?
– జీవితంలో ఒక్క అబద్ధం కూడా ఆడని వ్యక్తిని సత్యహరిశ్చంద్రుడు అంటారు. జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పని వ్యక్తిని నారా చంద్రబాబు అంటారు. చంద్రబాబు పాలనలోఇంతటి దారుణాలు చూస్తున్నాం. అన్యాయాలు, మోసం, అవినీతి, అరాచకాలు, అహంకారం చూశాం. ఇలాంటి వ్యక్తిని పొరపాటున కూడా క్షమించవద్దని కోరుతున్నాను. ఈ వ్యవస్థ మారాలి. విశ్వసనీయత, నిజాయితీ రావాలి. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి మాటను కూడా ఆ పార్టీ నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి.
– పొరపాటున కూడా చంద్రబాబును క్షమిస్తే..రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలుసా? రేపు పొద్దున ఈ పెద్ద మనిషి మీ వద్దకు వచ్చి మైక్‌ పట్టుకొని మీ చెవులు ఖాళీగా ఉన్నాయా అని చూస్తారు. మొదట ఎన్నికల్లో చెప్పిన 98 శాతం హామీలు నెరవేర్చానని చెబుతారు. ఇక మీరు చిన్న చిన్న అబద్ధాలు, మోసాలు చెబితే నమ్మరని చంద్రబాబుకు బాగా తెలుసు. ఈ సారి చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్ముతారా? నమ్మరు అని తెలుసు. కేజీ బంగారు ఇచ్చిన చంద్రబాబును నమ్మరని తెలుసు కాబట్టి ప్రతి ఇంటికి బోనస్‌ బెంజి కారు ఇస్తానంటారు. నమ్మరని తెలుసు కాబట్టి ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల డబ్బు పెడతారు. డబ్బులు ఇస్తే వద్దనకండి. రూ.5 వేలు కావాలని డిమాండు చేయండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి తీసుకున్నదే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయమని కోరుతున్నాను. అబద్ధాలు చెప్పేవారు, మోసం చేసేవారిని బంగాళఖాతంలో కలిపేయండి.  ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. అందుకోసం వైయస్‌ జగన్‌కు మీ అందరి తోడు, దీవెన కావాలి.
 – రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తున్నామని చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలని నవరత్నాలు ప్రకటించాం. ఈ రోజు మీటింగ్‌లో నవరత్నాల్లో నుంచి మనందరి ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తామన్నది ప్రతి అక్కకు, చెల్లెమ్మకు ఏం చేస్తామన్నది చెబుతాను.  ఇళ్లు బాగుండాలంటే అక్కచెల్లెమ్మ లక్షాధికారి కావాలని ఆ దివంగత నేత వైయస్‌  రాజశేఖరరెడ్డి ఒక స్వప్నాన్ని చూశారు. బ్యాంకుల్లో పావలావడ్డీ, సున్నా వడ్డీకే రుణాలు ఇప్పించారు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. రుణాలు మాఫీ చేయకపోగా, బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ డబ్బులు చెల్లించలేదు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ..ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాల్లో ఎంతైతే బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయో ఆ మొత్తం అప్పంతా నాలుగు దఫాలుగా మాఫీ చేసి నేరుగా మీ చేతికే ఇస్తానని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు హామీ ఇస్తున్నాను. మళ్లీ సున్నా వడ్డీ విప్లవాన్ని తీసుకువస్తాను. 
– నాన్నగారు కలలు కన్న స్వప్నం ప్రతి అక్కా, చెల్లెమ్మ లక్షాధికారి కావడమే. అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది. రాష్ట్రం బాగుంటుంది. కార్పొరేషన్లను ప్రక్షాళన చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రుణాలు అంఆందజేస్తాం. వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 45 ఏళ్లకే పింఛన్లు అందిస్తాం.
– ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేస్తాం. మీ గ్రామంలోనే పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. మీకు రేపు పొద్దున పింఛన్లు, ఇల్లు, రేషన్‌కార్డులు కావాలన్నా, వైయస్‌ఆర్‌ చేయూత పథకం కావాలన్నా..ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అఫ్లికేషన్‌ పెట్టిన 72 గంటల్లోనే మీకు అందజేస్తాం. మొట్ట మొదటి ఏడాది గ్రామ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేస్తాం. రెండో ఏటా లబ్ధిదారులను ఏర్పాటు చేసి వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా కార్పోరేషన్‌ రుణాలు అందజేస్తాం. ఇందులో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత తెచ్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, తోడుగా ఉండమని, అండగా ఉండమని ప్రాధేయపడుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.


 
Back to Top