ఉద్యోగాల విప్లవం తీసుకువస్తా

– టీడీపీ ప్రభుత్వానికి మానవత్వం లేదు
– ప్రతి ఏటా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తాం
– గ్రామ సెక్రటేరియట్‌లో 1.50 లక్షల ఉద్యోగాలు
– అగ్రిగోల్డు బాధితులకు అండగా ఉంటా

చిత్తూరు: చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేశాడని, ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. మనందరి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కల్లూరులో శనివారం నిర్వహించిన మైనారిటీల సమ్మెళనంలో మైనారిటీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు జననేత సమాధానం ఇస్తూ వారిలో భరోసా కల్పించారు. ప్రతి ఏటా పరీక్షలు నిర్వహించి ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, గ్రామ సెక్రటేరియట్‌లో లక్ష యాభై వేల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖాముఖి ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..

జన్మభూమి కమిటీని కలువలేదని లోన్‌ ఇవ్వడం లేదు:  రషీదాబేగం
అన్నా..నేను మైనారిటీ లోన్‌కు దరఖాస్తు చేసుకున్నాను. బ్యాంకు అధికారులు కూడా లోన్‌ మంజూరు చేశారు. అయితే నేను జన్మభూమి కమిటీ సభ్యులను కలవనందుకు లోన్‌ ఇవ్వడం లేదన్నా..వారికి లంచం ఇవ్వకపోతే ఇలాంటి అన్యాం చేస్తారా అన్నా..మన ప్రభుత్వం వచ్చాక పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నా. ఒక ఇంట్లో ఒక్కరికే పింఛన్‌ ఇస్తున్నారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి.



వైయస్‌ జగన్‌: మన ప్రభుత్వం వచ్చాక ప్రతిగ్రామంలో సచివాలయం ఏర్పాటు చేస్తాం. మీకు ఏ పథకం కావాలన్నా 72 గంటల్లోనే మంజూరు చేస్తాం. ఇందు కోసం మీరు ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇలా చేసే కార్యక్రమంలో కులాలు, మతాలు చూడం, పార్టీలు చూడం. మనం చేయబోయే గొప్ప రెవల్యూషన్‌ కార్యక్రమం ఇది. నాడు చంద్రబాబు పింఛన్‌ 75 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చారు. నాడు 78 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. నాన్నగారు అర్హులందరికీ ఇవ్వాలన్న సంకల్పంతోనే సాధ్యమైందన్నారు.
–––––––––––––––––
మా అందరికి జాబ్స్‌ ఇస్తారా:  నజ్మా
సార్‌..నేను ఫార్మసి చదువుతున్నాం. మాకు జాబ్స్‌ లేవు. ఎలాంటి స్పందన లేదు. మాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నా..అందరికి చదువులు చదివిస్తామంటున్నారు కదా సార్‌..మా అందరికి జాబ్స్‌ ఇస్తారా సార్‌.
 
వైయస్‌ జగన్‌: ఇటువంటి వారికి జాబ్స్‌ ఇవ్వాల్సిన చంద్రబాబు ఆ ఉద్యోగాలన్నింటిని అవుట్‌ సోర్సింగ్‌కు అప్పగించారు. వాటిని మెడల్‌ అనే సంస్థకు అప్పగించారు. ఆయన చంద్రబాబు కొడుకు లోకేష్‌ స్నేహితుడు కాబట్టి అవుట్‌సోర్సింగ్‌కు అప్పగించి చెరిసగం పంచుకుంటున్నారు. ఇటువంటి వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. చదివించడం వ రకు ప్రభుత్వం చేయవచ్చు. జాబుల విషయంలో మాత్రం ఎవరైనా మేం ఇప్పిస్తామంటే నమ్మొద్దు. జాబుల కోసం ఏదైనా చేయాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని దువా చేయాలి. ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామికవేత్తలకు రాయితీలు వస్తాయి. జీఎస్టీలో మినహాయింపు ఉంటుంది. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాల విప్లవం తీసుకొని వస్తామని గట్టిగా చెబుతున్నాను. అక్షరాల రాష్ట్రం విడిపోయినప్పుడు 1.42 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. వీటికి సంవత్సరం నియామకాలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి సంవత్సరం పరీక్షలు పెట్టి ఉద్యోగాల భర్తీలు పూర్తి చేస్తాం. గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి, మన రాష్ట్రంలో 15 వేల గ్రామ సెక్రటేరియట్లలో అక్షరాల లక్ష 50 వేల ఉద్యోగాలు అక్కడే ఇస్తామని హామీ ఇస్తున్నాను. ప్రైవేట్‌ సెక్టార్‌లో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాను.
–––––––––––––––––––––––
మహానేతకు రుణపడి ఉన్నాం. నాడు మైనారిటీలు అంతా కూడా వైయస్‌ఆర్‌కు అండగా ఉన్నారు. జాబు ఇస్తామని మోసం చేసిన చంద్రబాబుకు గుణపాఠం చెబుతామని మీకు మాట ఇస్తున్నామన్నా..
–––––––––––––––
సూర్యచంద్రులు ఉన్నంత వరకు మహానేత పేరు ఉంటుంది:  అబూఖాన్‌
నీలం సంజీవరెడ్డి నుంచి వైయస్‌ రాజశేఖరరెడ్డి వరకు ముస్లింలను పట్టించుకున్న నాథుడే లేడు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ముస్లింల ప్రధాత. ఈ రోజు దేవుడి ఫోటో ప్రక్కన వైయస్‌ఆర్‌ ఫోటో పెట్టుకుంటున్నాం. ఆయన మనమధ్య లేకపోయినా సూర్యచంద్రులు ఉన్నంత వరకు మహానేత పేరు చిరస్థాయిగా ఉంటుందన్నా..మైనారిటీల సంక్షేమ దినంగా ప్రకటించాలని కోరుతున్నాను. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతున్నాను.
––––––––––––––––––––
నా భర్త బీఎస్‌ఎఫ్‌లో ఉన్నారు. ఇన్‌కంట్యాక్స్‌ ఏడాదికి ఒక్కసారి కట్‌ చేస్తున్నారు. ఆ ఒక్క నెల రూ.30 వేల జీతమైతే,అందులో రూ.24 వేలు ఇన్‌కంట్యాక్స్‌ పేరిట కోత విధిస్తున్నాం. మిగతా రూ.6 వేలతో ఎలా బతకాలన్నా..దీనిపై ఆలోచించాలని కోరుతున్నాను.

వైయస్‌ జగన్‌: ఆర్మీలో ఉన్న వారికి ఇన్‌కం ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం. ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాస్తాం.
––––––––––––––––––––
నర్సింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఆఫ్రీన్‌
అన్నా..నేను నర్సింగ్‌ పూర్తి చేశాను. నాలుగేళ్ల క్రితం నర్సింగ్‌ పోస్టులు వేశారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. మీరు ముఖ్యమంత్రి కాగానే మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాను. కాంట్రాక్ట్‌పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. అవుట్‌ సోర్సింగ్‌లో భర్తీ చేస్తామంటున్నారు. దీని వల్ల ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతుంది.
వైయస్‌ జగన్‌: చంద్రబాబు హయాంలో ఆసుపత్రులు కుప్పకూలిపోతున్నాయి. మనం వచ్చాక మెరుగు చేద్దాం.
––––––––––––––––––
దౌర్జన్యానికి పరాకాష్ట
మదనపల్లిలో 500 కుటుంబాల ఆస్తిని టీడీపీ నేతలు పబ్లిక్‌గా ఆక్రమించుకున్నారు. అడిగే దిక్కు లేదు. దౌర్జన్యానికి పరాకాష్టగా మారింది.

వైయస్‌ జగన్‌: చంద్రబాబు ప్రభుత్వం కదా అలాగే ఉంటుంది. రామచంద్రారెడ్డి అన్నతో కలిసి కోర్టులో కేసు వేయిద్దాం
–––––––––––––––––
అగ్రిగోల్డు బాధితులకు అండగా ఉంటాం: వైయస్‌ జగన్‌ 
బాషా: అన్నా..అగ్రిగోల్డు బాధితులకు న్యాయం చే యండన్నా
వైయస్‌ జగన్‌: అగ్రిగోల్డు గురించి అసెంబ్లీలో మాట్లాడం. ఈ ప్రభుత్వానికి బాధితులను ఆదుకోవాలన్న మనసు లేదు. మనందరి ప్రభుత్వం వచ్చాక రూ.11 వందల కోట్ల డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేస్తాం.
–––––––––––––
అన్నా..నా రేషన్‌కార్డు రద్దు చేశారు:  గఫార్‌
ఎన్నికలకు ముందు నాకు రేషన్‌కార్డు ఉండేది. నా కొడుకుకు స్కాలర్‌ షిప్‌లు ఇచ్చే వారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. అయినా కూడా ఫర్వాలేదు. మీరు వచ్చిన తరువాతే కార్డు తీసుకుంటాను.
–––––––––––––––––––
పింఛన్‌ ఇవ్వడం లేదు:  ఇర్ఫాన్‌
నాకు చెయ్యి బాగోలేదు. రేండేళ్లుగా తిరుగుతున్నాను. ఎవరూ పట్టించుకోవడం లేదు. మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
వైయస్‌ జగన్‌: ఇర్ఫాన్‌ ఏడాది పాటు ఆగండి. మన ప్రభుత్వం  వచ్చాక పింఛన్‌ ఇస్తాం. మేలు చేసి అండగా ఉంటాను.
–––––––––––––––––
బంగారు తల్లి పథకాన్ని మెరుగు పరచాలి:  మహమ్మద్‌ అయూబ్‌
బంగారం తల్లి పథకం కింద డబ్బులు ఇవ్వడం లేదు. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ పథకాన్ని అమలు చేయండి

వైయస్‌ జగన్‌: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ పథకాన్ని రద్దు చేశారు. మనం వచ్చాక మరమ్మతులు చేద్దాం.
––––––––––––––––––––
అన్నా..మీకు ప్రాణం ఉన్నంతవరకు రుణపడి ఉంటాం.
జగనన్నా..మీ నాన్న హయాంలో ఉచితంగా గుండె ఆపరేషన్‌ చేయించుకున్నాను. ఈ చంద్రబాబు ప్రభుత్వంలో లక్ష ఖర్చు చేసి ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది. అన్నా..మీరు ముఖ్యమంత్రి కావాలి..మా లాంటి పేదలకు ఉచితంగా ఆపరేషన్‌ చేయించాలని కోరుతున్నాను. నాకు బిడ్డలు లేరు. నేను నా భార్య ఇద్దరం కలిసి చింతపండు కొట్టుకొని బతుకుతున్నాం. ఇల్లు అమ్ముకొని రూ.1.10 లక్షల ఖర్చు చేసి ఆపరేషన్‌ చేయించుకున్నాం. అన్నా..మీకు ప్రాణం ఉన్నంతవరకు రుణపడి ఉంటాం.
వైయస్‌ జగన్‌: ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు. మన ప్రభుత్వం వచ్చాక మానవత్వంతో ఆలోచించి ఆదుకుంటాం.
–––––––––––––––––––––
అన్నా..నేను ఆర్టీసీలో జాబ్‌ చేస్తున్నాను. ప్రమాదవశాత్తు ఓ ప్రయాణికుడు కాలు జారి కిందపడితే నా ఉద్యోగం తీసేశారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రత లేదు. కష్టపడే వారికి ఉద్యోగ భద్రత లేదు. మీరు అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న మాటకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా కొడుకు వైయస్‌ఆర్‌ పెట్టిన రిజర్వేషన్‌ వల్ల ఇంజినీరింగ్‌ చేశాడు. అయితే ఉద్యోగం లేదు. ఉద్యోగాల్లో కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నాను.

వైయస్‌ జగన్‌: ఈ రోజు కూడా కష్టమనిపించినా కూడా తోడుగా ఉంటూ మీ బిడ్డను ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.


 



 
Back to Top