కేసీఆర్‌కు బాబుకు తేడా ఏంటీ?


– 140 టీఎంసీల నికర కేటాయింపులు ఉన్నా వరి వేసుకోగలిగామా?
– ఈ నాలుగేళ్లలో పంటలకు గిట్టుబాటు ధర ఉందా?
– ఓటుకు కోట్లు కేసులో భయపడి చంద్రబాబు నీళ్లు అడగడం లేదు
– రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏమైంది బాబూ?
– చంద్రబాబు బ్యాంకులకు వడ్డీ డబ్బులు కట్టడం లేదు
– రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌
– పంటలకు ముందుగానే గ ఇట్టుబాటు ధర చెబుతాం
– రైతన్నల పంట రుణాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తాం
–  పెట్టుబడుల కోసం మే నెలలో రైతుకు రూ.12,500
–  లీటర్‌ పాలుకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తాం
– ఉచితంగా బోర్లు వేయిస్తాం
– ధరల స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్లు కేటాయిస్తాం
– ప్రకృతి విపత్తుల నిధికి రూ. 4 వేల కోట్లు
– బాధిత కుటుంబాలకు వైయస్‌ఆర్‌ బీమా ద్వారా రూ.5 లక్షలు చెల్లిస్తాం
– కాకుమానులో రైతులతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి


 గుంటూరు: మనకు రావాల్సిన నీళ్లు పక్క రాష్ట్రం ఎడాపెడా లిఫ్ట్‌లు పెట్టి తోడుకుంటున్నా అడిగే నాథుడు లేడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నాగార్జున కుడి కాల్వ ద్వారా మనకు 140 టీఎంసీల నీరు రావాల్సిన ఉన్నా ధైర్యంగా వరి సాగుచేసుకోలేకపోతున్నామని, అదే తెలంగాణ రాష్ట్రంలో హాయిగా వరి సాగుచేస్తున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ఉన్నది ఏంటీ? మన సీఎం చంద్రబాబుకు లేనిది ఏంటని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా కాకుమానులో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌ పాల్గొని రైతులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తోందో వివరించి చెప్పారు. అలాగే వారి సమస్యలు అడిగి తెలుసుకొని రైతుల్లో భరోసా కల్పించారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

నాలుగు సంవత్సర చంద్రబాబు పాలన చూశాం. ఇదే చంద్రబాబు మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని చెబుతున్నారు. మళ్లీ ఇలాంటి పాలనే మనకు కావాలా? అన్న అంశాలపై చర్చించేందుకు ఇవాళ మనమందరం ఇక్కడ ఒక్కటిగా కలిశాం. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రైతులకు సంబంధించి మనం పడుతున్న సమస్యలపై కాస్తోకూస్తో కొద్దిసేపు మాట్లాడుతాను. మన కళ్లముందే ఇదే జిల్లాలో నాగార్జున కుడి కాల్వ వెళ్తుంది. 140 టీఎంసీల నికర జలాల కేటాయింపులు ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో వరి వేసుకునే పరిస్థితి ఉందా? లేదు. పక్కన నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ తెలంగాణలో పారుతోంది. అక్కడ నాలుగేళ్లుగా వరి సాగుచేస్తున్నారు. కే సీఆర్‌కు ఉన్నది ఏంటో? చంద్రబాబుకు లేనిది ఏంటో అర్థం కావడం లేదు. తెలంగాణలో మనకన్న తక్కువలో లిప్ట్‌లు పెట్టి తోడేస్తున్నా కూడా చంద్రబాబు కనీసం అడగడం లేదు. కారణం ఏంటో మీ అందరికి తెలుసు..ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డగోలుగా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన పరిస్థితి. ఎక్కడ కేసీఆర్‌ జైల్లో పెడతారోనని భయపడుతున్నారు. ఒకవైపు వరి వేసుకొని పరిస్థితి లేదు. రెండో వైపు ఆరుతడి పంటలు వేసుకున్నాం. ఈ పంటలకు కనీసం గిట్టుబాటు ధరలు ఉన్నాయా? నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతుల వద్ద ఉన్నప్పుడు ధరలు కిందకు వెళ్తున్నాయి. దళారుల వద్దకు వెళ్లగానే ఆకాశాన్ని అంటుతున్నాయి. చంద్రబాబు తానే దళారులకు నాయకుడై హెరిటేజ్‌ షాపులు పెట్టుకొని రైతుల వద్ద కొనుగోలు చేసిన ధన్యాన్ని మూడింతలు ఎక్కువగా అమ్ముతున్నారు. దగ్గరుండి రేట్లు పెంచి దోచుకుంటున్నారు. 
– గుంటూరు జిల్లాలో చంద్రబాబుకు ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో మిర్చి యార్డు ఉంటుంది. రైతులకు గిట్టుబాటు ధర దొరక్క అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. తాను వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రైతన్నలకు తోడుగా ఉండేందుకు తాను రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానంటే ఓహో జగన్‌ రూ. 3 వేల కోట్లా? అయితే నేను రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
– ఖరీఫ్‌ పంట తీవ్రమైన కరువుతో బాధపడింది. నాలుగేళ్లలో చంద్రబాబుకు తోడుగా వచ్చింది ఏంటో తెలుసా? కరువు ఆయనకు తోడుగా వచ్చింది. కరువు, వరదలు వచ్చిన ప్పుడు రైతులు ప్రభుత్వం వైపు చూస్తారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు పాలన ఎలా ఉందో చూడండి. మొన్న ఖరీఫ్‌లో కరువు వస్తే ఎలాంటి పరిహారం  ఇవ్వలేదు. రైతులు ఇన్సూరెన్స్‌ డబ్బులు కట్టారు. అయితే ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్‌ కట్టలేదు. ఖరీఫ్‌ అయిపోయింది. రబీ కూడా నడుస్తోంది. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీలు ఇవ్వడం లేదు.
– రుణమాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసం అంతా ఇంతా కాదు. రూ.87 వేల కోట్ల రైతు రుణాలు బేషరత్తుగా మాఫీ చేస్తామని మాట ఇచ్చారు. రుణాలు కట్టొద్దు అన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. చంద్రబాబు చేసిన రుణమాఫీ పథకం ఇవాళ ఎంతటి దయానీయంగా మారిందంటే ..బ్యాంకుల నుంచి వేలం నోటీసులు వస్తున్నాయి. రైతులకు ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు సరిపోవడం లేదు. 
– ‡రైతులకు రుణమాఫీ చేయకపోవడం ఒక మోసమైతే..రాష్ట్ర ప్రబుత్వం రైతుల తరఫున రుణాలకు సంబంధించి వడ్డీలు బ్యాంకులకు చెల్లించేవి. లక్ష వరకు పూర్తిగా వడ్డీ లేని రుణాలు వచ్చేవి. ఆపై పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేవారు. గత ప్రభుత్వాలు రైతులకు వడ్డీ డబ్బులు కట్టేవారు. చంద్రబాబు బ్యాంకులకు వడ్డీ డబ్బులు కట్టడం మానేశారు.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. సహాకార రంగంలోని పరిశ్రమలు బాగా పనిచేస్తే రైతులకు మేలు జరుగుతుంది. సహకార రంగంలోని పరిశ్రమలు రైతులకు మంచి రేట్లు ఇస్తాయి. అప్పుడు ప్రయివేట్‌ రంగంలోని సంస్థలు కూడా మంచిరేట్లు ఇస్తారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన సహాకార రంగంలోని పరిశ్రమలు మూతపడుతున్నాయి. 
– రైతులను ఎక్కడా వదిలిపెట్టడం లేదు. ట్రాక్టర్లు నడపాలన్నా డీజిల్‌ పోయాలి. పంట నూర్పిడి చేయాలన్నా..మోటార్లకు డీజిల్‌ పోయాలి. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో పెట్రోల్, డీజిల్‌ రేట్లు ఎడాపెడా పెంచారు. మన రాష్ట్రం కంటే పక్క రాష్ట్రాల్లో రూ.7 తక్కువకు పెట్రోల్, డీజిల్‌ పోస్తున్నారు.
– చంద్రబాబు పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈయన హయాంలో వ్యవసాయం 17.7 శాతం పెరిగిందని తప్పుడు లెక్కలు చెబుతున్నారు. చివరకు రొయ్యలకు సంబంధించి కూడా ఇలాగే లెక్కలు చెబుతున్నారు. రైతులు నావద్దకు వచ్చి అన్నా.. చంద్రబాబు పాలనలో దళారీ వ్యవస్థ ఏ స్థాయికి వెళ్లందంటే పంట చేతికి అందేసరికి రేట్లు తగ్గిస్తున్నారు. పంట చేతిలో లేనప్పుడు మళ్లీ రేట్లు పెరుగుతున్నాయని రోయ్యల రైతులు పేర్కొంటున్నారు. రైతులు అవస్థలు పడుతున్నా..ఈ పెద్ద మనిషి మాత్రం రైతులు చాలా సంతోషంగా ఉన్నారని ఊదరగొడుతున్నారు. రైతుల ఆదాయంలో బాబు చెప్పినట్లు పెరుగుదల ఉందా? ఇది చంద్రబాబు పాలన తీరు.
– 9 గంటల పాటు కరెంటు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్రం మిగులు కరెంటుతో ఉందని అబద్ధాలు ఆడుతున్నారు. ఇక్కడికి వచ్చే ముందు చాలా మంది రైతులు నా వద్దకు వచ్చి 9 గంటల కరెంటు దేవుడెరుగు..పగటి పూట ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియడం లేదని చెబుతున్నారు.
– మనకు ఎలాంటి పరిపాలన కావాలని మనందరం ఆలోచన చేయాలి. దేవుడి ఆశీర్వాదం. మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చార ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని ఆరాటపడుతున్నాను. నాన్నగారి పుట్టిన రోజు రైతు దినోత్సవం నిర్వహించాలని, మంచి పరిపాలన అందించే భాగ్యాన్ని నాకు ప్రసాదించాలని కోరుతున్నాను.
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేయాలన్నది చెబుతున్నాను. రైతులు పంటలు వేసుకోవాలంటే మొట్ట మొదట కనిపించేది పెట్టుబడులు ప్రధానం. రైతులకు పెట్టుబడులు తగ్గించేందుకు మనం ఏం చేయబోతున్నామన్నది చెబుతున్నాను.
– రైతులకు 9 గంటల పాటు రైతులకు ఉచితంగా పగటి పూట కరెంటు ఇస్తామని చెబుతున్నాను. ఇవాళ ప్రభుత్వాన్ని చూడండి. రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం లేదు. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టడం పూర్తిగా మానేశారు. 
– ప్రతి రైతు తీసుకున్న పంట రుణాలకు వడ్డీ లేకుండా చేస్తాం. దీని వల్ల రైతులు వడ్డీలు కట్టాల్సిన పని ఉండదు. దీని వల్ల పెట్టుబడులు తగ్గుతాయి.
– ప్రతి రైతు జూన్‌ మాసంలో పంటలు వేయడం మొదలు పెడతారు. ఆ పంటలు వేసేందుకు రైతులు పెట్టుబడుల కోసం అవస్థలు పడుతారు. ఆ ప్రతి రైతుకు తోడుగా ఉండేందుకు, పెట్టుడులు తగ్గించేందుకు మే మాసంలో ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 ఇచ్చి తోడుగా ఉంటాం. ఒక ఎకరా పొలం ఉన్న రైతుకు ఈ డబ్బులు 90 శాతం పెట్టుబడులు చేతికి వచ్చినట్లే. రెండు ఎకరాలు ఉన్న రైతుకు 40 శాతం పెట్టుబడులకు సరిపోతాయి.  
– ప్రతి రైతు బోర్లు వేస్తాడు. ఈ ప్రాంతంలో తక్కువగా ఉండవచ్చు కానీ, మిగతా ప్రాంతాల్లో బోర్లు ఎక్కువగా వేస్తున్నారు. ఈ బోర్లు ఫెయిల్‌ అయి రైతులు అప్పులపాలు అవుతున్నారు. అలాంటి రైతులకు తోడుగా ఉండేందుకు ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమం చేపడుతాం. ఈ నాలుగు కార్యక్రమాల ద్వారా రైతుల పెట్టుబడులు తగ్గించే కార్యక్రమం చేపడుతాం.
– రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోయే పరిస్థితి చూస్తున్నాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకివచ్చాక ప్రతి రైతుకు తాను పంట వేసే ముందే ఫలాని రేటుకు మీ పంట కొంటామని చెబుతాం. ఆ రైతు పంటను అమ్ముకోలేని పరిస్థితిలో ప్రభుత్వమే ఆ పంట కొనుగోలు చేస్తుంది.  ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. 
– ప్రతి మండలంలోనూ గిడ్డంగులు, కోల్డు స్టోరేజీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు తోడుగా ఉంటాం. 
– పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట. కవ్వామాడే ఇంట కరువు ఉండదట. ఇది సామెత. ఆ పాడి రైతుకు తోడుగా ఉండేందుకు మనం ఏం చేస్తామంటే..సహకార రంగంలో మూతపడిన పరిశ్రమలు తెరిపిస్తాం. పాడి రైతులకు లీటర్‌ మీద రూ.4 ఇన్‌సెంటివ్‌ ఇస్తామని మాట ఇస్తున్నాను. అప్పుడు ప్రైవేట్‌ రంగంలోని డయిరీలు కూడా రూ.4 ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది.
– రైతులకు నేస్తం పాడి. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి హయాంలో పాడి ఆవులను సబ్సిడీలో ఇచ్చారు. అప్పటి కంటే ఇంకా ఎక్కువ సబ్సిడీలో పాడి ఆవులు అందజేసి రైతులకు తోడుగా ఉంటాను.
– అనుకోకుండా కరువు వచ్చినప్పుడు, ఆకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి రైతుకు ఆ సమయంలో పరిస్థితి మార్చుతాం. ముఖ్యమంత్రి స్థానంలో తన సొంత అన్నా కూర్చున్నారన్న భరోసా ఇస్తాను. రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైఫరిత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. అప్పుడు రైతుకు కరువు, అకాల వర్షాలు వచ్చినా నష్టపోయే పరిస్థితి ఉండదు.
– రైతులకు సాగునీరు లేక  ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. చాలా చోట్ల పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను చంద్రబాబు పట్టించుకోవడం లేదు. మిగిలిన పనులకు అంచనాలు పెంచి లంచాల కోసం పాకులాడుతున్నారు. రైతులకు సాగునీరు ఇచ్చేందుకు పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తాను. చంద్రబాబు మాదిరిగా కాంట్రాక్టుల కోసం జగన్‌ ఆశపడడు. జగన్‌ కోరిదే ఏంటో తెలుసా..చనిపోయిన తరువాత నాన్నగారి ఫొటో పక్కన తన ఫొటో ఉండాలన్నదే నా తపన. 
– ఇబ్బందుల్లో ఉన్న రైతులు ఎదురు చూసేది ఏంటో తెలుసా? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు తాను వెళ్లిపోయిన తరువాత తన కుటుంబం ఎలా ఉందో ఆత్మ ఆకాశం నుంచి చూస్తుంది. ఇవాళ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఈ ప్రభత్వం పట్టించుకోవడం లేదు. మనందరి ప్రభుత్వం వచ్చాక అలాంటి రైతు కుటుంబాలు అన్యాయానికి గురికాకుండా ఉండేందుకు వైయస్‌ఆర్‌ భరోసా పథకం ఏర్పాటు చేస్తాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు అందజేస్తాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేపు మనం ఏం చేస్తున్నామో చెప్పాను. వీటిలో ఏవైనా సూచనలు, సలహాలు ఇవ్వండి..వాటిని స్వీకరిస్తాను.. 

తాజా ఫోటోలు

Back to Top