చేయగలిగిందే చెబుతా..చేయలేనిది చెప్పను





– జగ్గంపేట నియోజకవర్గాన్ని ఎన్నటికీ మరిచిపోను
– వైయస్‌ఆర్‌సీపీ పుట్టింది జగ్గంపేటలోనే
– బాబు పాలనంతా అవినీతే
– బాబు అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు పార్టీ మారారట
–  ఇప్పటి వరకు చంద్రబాబు చేసిందేమిటి?
– కాపు సోదరులను బాబు దారుణంగా అవమానించారు
– ముద్రగడ కుటుంబ సభ్యులను టీడీపీ ప్రభుత్వం అవమానించింది
– బాబు చెప్పిన దాని కంటే రెట్టింపు నిధులు కాపు కార్పొరేషన్‌కు ఇస్తా
– ఆసుపత్రుల్లో ఎలుకలు కనిపిస్తున్నాయి. సెల్‌ఫోన్‌ లైటింగ్‌తో ఆపరేషన్లు
– ఆరోగ్యశ్రీని చంద్రబాబు నీరుగార్చారు
– ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్‌ సంస్థలకు అమ్మేశారు
– బాబు నాలుగేళ్ల పాలనలో ఛార్జీలు బాదుడే బాదుడు
– అవ్వాతాతలకు నెలకు రూ. 2 వేలు పింఛన్‌
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌
తూర్పు గోదావరి: చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేనని, మోసం చేయలేనని, చేయగలిగిందే చెబుతానని, చేయలేనిది చెప్పనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఏది చేసినా కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు..నాలుగు నెలల కోసమే చేస్తారని విమర్శించారు.  ప్రజా సంకల్ప యాత్ర 222వ రోజు జగ్గంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..
– యాదృచ్ఛికంగా ఇదే నియోజకవర్గంలోనే 2600 కిలోమీటర్ల మైలు రాయిని ఇక్కడే దాటాను. ఇదే నియోజకవర్గం ప్రజలు గత ఎన్నికల్లో అన్నా...నీవెంట తోడుగా ఉంటామని అండగా నిలిచారు. ఈ నియోజకవర్గాన్ని నేను ఎన్నటికి మరిచిపోను అని హామీ ఇస్తున్నాను.  ఇదే నియోజకవర్గంలోనే ఇంకొక ఘటన కూడా జరిగింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడే పుట్టింది. ఇక్కడే ప్రకటించాం.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూసి, ఇక్కడి ప్రజల బాధను చూసి బాధనిపించింది. ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనం చూసింది ఏంటంటే అవినీతి, అక్రమాలు, అరాచకపాలన చూశాం. జన్మభూమి కమిటీలతో మాఫీయాను చూస్తున్నాం. అడ్డగోలుగా సంపాదించిన అవినీతిసొమ్ముతో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇచ్చి సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు చేశారు.
– ఇదే నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో చూశాం. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్న సందర్భంలో  అభివృద్ధిని చూసి పార్టీ మారుతున్నట్లు ఈ ఎమ్మెల్యే చెప్పారు. మీలో ఎవరైనా చంద్రబాబు పాలనతో సంతోషంగా ఉన్నారా అని అడుగుతున్నాను. 
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఎవరూ సంతోషంగా లేరని ప్రజలంటున్నారు. ఈ ఎమ్మెల్యే చంద్రబాబు అభివృద్ధిని చూసి పార్టీ మారానని చెప్పారు. ఇదే నియోజకవర్గంలో రైతులు అంటున్నారు. ఏలేరు రిజర్వాయర్‌ మాకు ఆధారమని రైతులు అంటున్నారు. ఈ రిజర్వాయర్‌ ద్వారా 67 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, కనీసం 50 వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదంటున్నారు. నాన్నగారి హయాంలో 2009 ఫిభ్రవరిలో రూ.109 కోట్లతో ఆధునీకికరణ పనులు చేపట్టారని, నాన్నగారు చనిపోయిన తరువాత ఇంతవరకు చంద్రబాబు 40 శాతం పనులు కూడా పూర్తి చేయలేదని రైతులు చెబుతుంటే నిజంగా బాధనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేయపోవడంతో సాగునీరు అందడం లేదంటున్నారు. పోలవరం ప్రాజెక్టు కనీసం పునాది గోడలు దాటి పైకి రావడం లేదు. ఇంత అవసరం అని తెలిసి కూడా అవినీతిమయం చేసి నత్తనడకన పనులు చేపట్టిన చంద్రబాబును ఏమనాలి?
– ఇక్కడి రైతులు నా వద్దకు వచ్చి..అన్నా..నాన్నగారి పాలనలో ఇక్కడి రైతులకు మేలు చేసేందుకు పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారని చెబుతున్నారు. నాన్నగారు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించారని చెబుతున్నారు. రైతులందరూ ఆనందంగా ఉన్నారనంటే నాన్నగారి పుణ్యమని చెబుతున్నారు. 
– ముసలివెళ్లి ప్రాజెక్టు ద్వారా సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కూడా నాన్నగారిదే అని రైతులు చెబుతుంటే నిజంగా నాన్నగారిని గుర్తు పెట్టుకోవడం ఆనందమనిపించింది.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క ఎత్తిపోతల పథకం కూడా ఏర్పాటు చేయలేని దద్దమ్మ పాలన చూస్తున్నాం. గోకవరం మండలంలోని గ్రామాలకు ఏలేరు నుంచి పంపుల ద్వారా నీటిని అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారన్నా..ఇవాల్టికి కూడా పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. చంద్రబాబు ఎక్కడా? నక్కకు నాగ లోకానికి తేడా కనిపిస్తుందని చెబుతున్నారు.
– రైతులు బోర్లుపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్నారు. చంద్రబాబు పగలు 9 గంటల విద్యుత్‌ ఇస్తామని గతేడాది రైతులు ఏకంగా సబ్‌ స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు. 
– రైతులు కష్టపడి ధాన్యాన్ని పండిస్తే మద్దతు ధర లేదు. వరికి కనీసం రూ.1150 కూడా రావడం లేదు. ఈ నియోజకవర్గంలో చెరకు పంట ఎక్కువగాసాగు చేస్తున్నారు. టన్ను చెరకు నరకడానికి, రవాణా చేసేందుకు రూ.1100 ఖర్చు అవుతుందని, ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఏమాత్రం సరిపోవడం లేదని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో రూ.3200 ఇస్తుంటే..ఇక్కడి ప్రభుత్వం రూ.2 వేలకు మించి ఇవ్వడం లేదని చెబుతున్నారు.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో కనీసం ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? కారణం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దళారీ వ్యవస్థను కట్టడి చేయాలి. మన ఖర్మ ఏంటంటే..ముఖ్యమంత్రే దళారీలకు నాయకుడయ్యారు. ఎక్కడ చూసినా హెరిటేజ్‌ షాపులు ఉన్నాయి. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ షాపుల్లో నాలుగు రేట్లు ఎక్కువకు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు తానే దళారీలకు నాయకుడై తానే లాభాలు పొందుతుంటే రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయా?
– ఇక్కడి ప్రజలు చంద్రబాబు పాలన గురించి చెబుతున్నారు. దాదాపు 90 చెరువుల నుంచి టీడీపీ నాయకులు మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు. ఒకవైపు మట్టిని తవ్వి ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుంటున్నారు. మరోవైపు తవ్విన మట్టిని బయట అమ్ముకుంటున్నారు. చెరువులు తవ్వడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని, ఒక్కో చెరువు తాటి చెట్టు లోతుకు తవ్వుతున్నారని చెబుతున్నారు. మట్టి, ఇసుక నుంచి డబ్బులు సంపాదించుకుంటున్న వ్యక్తులను ఏమనాలి?
– ఇక్కడి ప్రజలంతా కూడా మహానేత పాలనను గుర్తుకు తెచ్చుకుంటూ..నాన్నగారి పాలన బాగా గుర్తుందన్నా..ఆ రోజుల్లో అక్షరాల 18400 ఇల్లు కట్టించారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఊరికి ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని చెబుతున్నారు.
–  ఇదే నియోజకవర్గంలో ఆసుపత్రి అధ్వాన్నంగా ఉంది. ఈ ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మార్చుతానని చెప్పారు. జగ్గంపేట ఆసుపత్రిలో 30 పడలకు గాను పది మెడ్లు కూడా లేవు. కనీసం ఎక్స్‌రే లేదు, ల్యాబ్‌ టెక్నిషియన్‌ లేడు. నాలుగు అంబులెన్స్‌లు ఉండాల్సి ఉండగా, ఒక్కటి మాత్రమే పని చేస్తుంది. 
– అభివృద్ధిని చూసి చంద్రబాబు పాలనలో చేరామని ఇక్కడి ఎమ్మెల్యే చెప్పారు. ఈ రోజు నాన్నగారి హయాంలో జగ్గంపేటకు డిగ్రీ కాలేజీ మంజూరు చేశారు. ఇప్పటికీ కూడా కనీసం భవనాలు పూర్తి చేయడం లేదు. 
–  పక్కనే కిర్లంపూడి కనిపిస్తుంది, ముద్రగడ పద్మనాభం కనిపిస్తారు. ఎప్పుడు జరగని విధంగా చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను ఎందుకు చేయడం లేదని నిలదీసే కార్యక్రమం చేస్తే ముద్రగడ పద్మనాభానికి చేసింది ఏంటి? ఆయన కుటుంబాన్ని నిర్భందించిన ఘటనలు ఈ ప్రభుత్వంలో చూశాం. చంద్రబాబు ప్రతి కులాన్ని మోసం చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో పేపర్‌ పెట్టారు. ప్రతి కులంలో కూడా తాను చేయలేనని తెలిసి, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదని తెలిసీ కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. బోయలను, మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తానన్నారు. రజకులను ఎస్సీలుగా చేస్తానని, కాపులను బీసీలుగా చేస్తానని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు చంద్రబాబు పాలన మీరంతా చూశారు. మనం చూసింది ఏంటి? మీకు ఎలాంటి నాయకుడు కావాలని ఒక్కసారి గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి? అబద్ధాలు చెప్పేవారు, మోసం చేసేవారు నాయకులు కావాలా? కాపు సోదరులకు కూడా ఇదే చెబుతున్నాను. ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడతా..చేయగలిగేవే చెబుతాను. కొన్ని రాష్ట్ర పరిధిలో ఉంటాయి. రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు కాబట్టి.. రిజర్వేషన్ల విషయంలో నేను చేయలేకపోతున్నానని చెబుతున్నాను. కానీ మొట్ట మొదట కాపులకు అన్యాయం జరిగిందని స్వరం వినిపించింది వైయస్‌ఆర్‌సీపీనే అని చెబుతున్నాను.
– చంద్రబాబు కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ. వెయ్యి కోట్లు కోట్లు కేటాయిస్తానని చెప్పారు. చంద్రబాబు కంటే రెట్టింపు నిధులు కేటాయిస్తానని మాట ఇస్తున్నాను. ఏమాత్రం అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పే కార్యక్రమం గట్టిగా చెబుతున్నాను.
–చంద్రబాబు ఈ మధ్య కాలంలో కొత్త సినిమా తీశారు. ‘‘ఎన్నికలకు ఆరు నెలల ముందు..నాలుగు నెలల కోసం’’ ఈ సినిమాలో చంద్రబాబును చూస్తే..ఆయన డ్రామాలు ఎలా ఉండాలంటే..
– ఎన్నికలకు ముందు రూ.87 వేల కోట్ల పంట రుణాలు పూర్తిగా బేషరత్తుగా మాఫీ చేస్తానని మాట ఇచ్చారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బాబు సీఎం అయ్యారు..కానీ రైతుల రుణాలు మాఫీ కాలేదు. ఇవాళ పరిస్థితి ఏంటంటే..ఆయన చేసిన రుణమాఫీ రైతులకు కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. మోసం చేసిన ఈ వ్యక్తి..ఇప్పుడు ఏమంటారో తెలుసా? రైతులకు చంద్రబాబు చేసిన రుణమాఫీ దేశంలో ఎక్కడా కనివినీ ఎరగని పథకమట. ఈయనకు సంబంధించిన ఎల్లో మీడియా చంద్రబాబును చూసి నేర్చుకోవడానికి ఇతర రాష్ట్రాలు వస్తున్నాయని వార్తలు రాయించుకుంటారు. 
– చంద్రబాబు అక్కాచెల్లెమ్మల గురించి మాట్లాడుతూ..పొదుపు సంఘాలను నేను కనిపెట్టానని చెప్పుకున్నారు. పొదుపు రుణాలన్నీ కూడా పూర్తిగా  మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. పొదుపు సంఘాల అక్కాచెల్లమ్మలకు ఎన్నికలు అయిపోయిన తరువాత పెద్ద క్వాలీఫ్లవర్‌ పెట్టారు. ఇప్పుడు ఏమంటారో తెలుసా? పొదుపు సంఘాల రుణాలు మాఫి చేశానని చెబుతున్నారు. ఎల్లోమీడియా చూస్తే ఆశ్చర్యమనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా చంద్రబాబుకు సన్మానం చేశారని చెబుతున్నారు.
– కొత్తగా ఇళ్ల నిర్మానం అంటున్నారు. ఈ ఏడాదిలో ఏకంగా 19 లక్షల ఇళ్లు కడుతారని ఈనాడు మీడియాలో కథనాలు కనిపిస్తాయి. ప్రజలందరూ సంతోషంగా ఉండబోతున్నారని కథలు. తీరా నాలుగేళ్లలో ఆయన ఊరికి నాలుగు ఇల్లు కూడా కట్టలేదు. 
– జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు. ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపించి ప్రతి  అక్కా చెల్లెమ్మ చేతిలో ఒక పేపర్‌ పెట్టి చంద్రబాబు సంతకం పెట్టారని చెప్పారు. చంద్రబాబు మాట ఇచ్చారు..ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే ఉపాధి ఇస్తారు. లేకపోతే ఏమీ చదువకపోయినా ఫర్వాలేదు..నెల నెల రూ.2 వేలు  ఇస్తానని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నాలుగు నెలల కోసం ఇప్పుడు కొత్త సినిమా వచ్చింది. ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.1 లక్ష బాకీ పడ్డారు. ఇప్పుడు ఈనాడులో బ్యానర్‌ స్టోరీ..చంద్రబాబు త్వరలోనే నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నారట. రాష్ట్రంలో కోటి 70 లక్షల ఇళ్లు ఉంటే..కేవలం రెండు లక్షల మందికి మాత్రమే ఇస్తారట. అది కూడా నాలుగు నెలలు మాత్రమే ఇస్తారట.
– బెల్టు షాపులు రద్దు చేస్తామని ఎన్నికలప్పుడు ఊదరగొట్టారు. మద్యం తాగి పిల్లలు చెడిపోతున్నారని చంద్రబాబు అన్నారు. ఇవాళ ప్రతి గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉందో లేదో తెలియదు కానీ, మందు షాపు లేని గ్రామం ఉందా? ఎన్నికలకు ముందు మాత్రం ‘మద్యం షాపులపై ఉక్కుపాదమట’, మద్యం లేకుండా ఆలోచన చేస్తున్నారని ఈనాడు పేపర్‌లో రాస్తారు.
– హోం గార్డులు, వీఆర్‌ఏలు, ఆశావర్కర్లకు, అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతారు. పక్క రాష్ట్రం కంటే నాలుగు అడుగులు వేయాలి కదా? ఈయనది నికృష్ట బుద్ధి కాబట్టి పక్క రాష్ట్రం కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేదు.
– ప్రత్యేక హోదా సంజీవని, ఉద్యోగాలు వస్తాయని ఎన్నికలకు ముందు చంద్రబాబు అన్నారు. పదిహేనుసంవత్సరాలు హోదా తెస్తానని చెప్పారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసినప్పుడు హోదా గుర్తుకు రాలేదు. ఇప్పుడు బీజేపీతో విడాకులు తీసుకొని ప్రత్యేక హోదా కోసం ఈయనే పోరాటం చేస్తున్నట్లు ఈయనే బిల్డప్‌ ఇస్తున్నారు.
– ఉద్యోగులకు పదో పీఆర్‌సీ కింద బకాయిలు ఇవ్వడం లేదు. సీపీఎస్‌ రద్దు చేయమని కోరుతున్నా పట్టించుకోడు. ఎన్నికలకు ముందు ఏమీ చేయకున్నా వారితో శాలువాలు కప్పించుకుని పొగిడించుకుంటున్నారు.
– మనకు అమరావతి అని చెప్పి బ్రమరావతి చూపిస్తున్నారు. నాలుగేళ్లలో ఒక్క ఇటుక కూడా ఇంతవరకు పడలేదు. ముఖ్యమంత్రిగా ఉంటూ పర్మినెంట్‌ పేరుతో ఒక్క పని చేయలేదు. ఇప్పుడు ఈనాడు పత్రికలో బహుబలి సెట్టింగ్స్‌ కనిపిస్తాయి. సింగపూర్‌లోని బిల్డింగ్‌లు కనిపిస్తాయి. అదిగో బుల్లెట్‌ ట్రైన్, మైక్రోసాప్ట్‌ అంటూ కథనాలు. ఉద్యోగస్తులందరూ 15 నిమిషాల్లో నడుచుకుంటూ వెళ్తారట. 
– నాలుగేళ్లుగా మీరంతా రేషన్‌ షాపులకు వెళ్తున్నారు. రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప ఏమైనా దొరుకుతుందా? గతంలో రేషన్‌షాపుల్లో బియ్యం, చ క్కెర, పామాయిల్, గోదమ పిండి, గోదమలు, కారం, పసుపు, ఉప్పు, చింతపండు, కిరోసిన్‌ దొరికేవి. ఇవన్నీ కూడా రూ.180 ఇచ్చేవారు. నాలుగేళ్ల బాబు పాలనలో బియ్యం తప్ప ఏమీ దొరకడం లేదు. అది కూడా ఇంట్లో ఆరు మంది ఉంటే వేలిముద్రలు పడటం లేదని కట్టింగ్‌..అవునా? కాదా? అలాంటి పెద్ద మనిషి ఎన్నికలకు ముందు ఏం చేస్తున్నారు. రేషన్‌ షాపుల్లో ఇకపై గోదుమ పిండి కేజీ రూపాయికి ఇస్తారట. 
– ఈ రోజు ఈనాడు పేపర్‌ చూస్తే ఆశ్చర్యమనిపించింది. ఆసుపత్రులను అతి ఉత్తమ ఆసుపత్రిగా మార్చుతారట. పక్కనే జగ్గంపేట ఆసుపత్రి కనిపిస్తుంది. అక్కడ కనీస సౌకర్యాలు లేవు. సెల్‌ఫోన్‌ పెట్టుకొని ఆపరేషన్లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని దగ్గరుండి నీరుగార్చుతున్నారు. హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ కట్‌. ఈనాడు పేపర్‌లో ఏమంటారు. ఆసుపత్రి వ్యవస్థలను బ్రహ్మండంగా బాగు చేస్తారట.
– నాలుగేళ్లలో పెట్రోల్, డీజిల్‌ ధరలు బాదుడే బాదుడు. మీ జిల్లాలోనే యానంలో పెట్రోల్‌ పోయించుకుండి. అక్కడికి ఇక్కడికి రూ.6 లీటర్‌కు తేడా ఉంది. ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు నాలుగేళ్లుగా బాదుడే బాదుడు. స్కూల్‌ ఫీజులు బాదుడే బాదుడు. నారాయణ, శ్రీచైతన్యలకు అమ్మేశారు. ప్రభుత్వ స్కూళ్లలో 20 శాతం కూడా పుస్తకాలు పంపిణీ చేయలేదు. ఇంటి పన్నులు, నీటి పన్నులు, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు. 
– అబద్ధాలు ఆడటం, మోసం చేయడం, అన్యాయం చేయడం, రాజ్యాంగాన్ని తూట్లు పొడవడం, అవినీతి చేయడం, ప్రజలపై బాదుడే బాదుడు. ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలి. మోసం చేసే వారిని, అబద్ధాలు చెప్పే వారిని ఈ వ్యవస్థ నుంచి బయటకు పంపించాలి. ఈ చెడిపోయిన వ్యవస్థ బాగుపడాలి. నాయకుడు ఇచ్చిన మాట నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడు ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థ«ం రావాలి. ఈ వ్యవస్థను మార్చాలంటే వైయస్‌ జగన్‌కు మీ అందరి తోడు, ఆశీస్సులు కావాలి. అప్పుడు ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది.
– పొరపాటున చంద్రబాబుకు క్షమిస్తే..రేపు మీ వద్దకు వచ్చి ఏం చేస్తారో తెలుసా? మొట్ట మొదట మైక్‌ పట్టుకొని ఎన్నికల ప్రణాళికలో తాను చెప్పినవన్నీ 98 శాతం పూర్తి చేశానని మీ చెవ్వుల్లో క్వాలీఫ్లవర్‌ పెడతారు. తరువాత మైక్‌ తీసుకొని ఇక చిన్న చిన్న అబద్ధాలు, మోసాలకు చంద్రబాబును నమ్మరని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా? ఈ సారి చంద్రబాబుకు ఓటు వేస్తే మీకు కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా? నమ్మరని ఆయనకు బాగా తెలుసు. కేజీ బంగారానికి బోనస్‌ఇస్తానంటారు. ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు బెంజి కారు కొనిస్తా అంటారు. ప్రతి ఇంటికి సాధికార మిత్రలను పంపించి ప్రతి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బులిస్తే వద్దు అనకండి..కుదరదు రూ.5 వేలు కావాలని అడగండి. ఆ డబ్బంతా మనదే ..మనజేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే. కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయమని అందరిని కోరుతున్నాను. అబద్ధాలు చెప్పేవారిని, మోసం చేసేవారిని బంగాళఖాతంలో కలిపే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థ బాగుపడుతుంది.
– రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం.  ఇందులోని అన్ని అంశాలను ఒకే మీటింగ్‌లో చెబితే సమయం సరిపోదని ఒక అంశాన్ని మాత్రమే చెబుతున్నాను. ఈ మీటింగ్‌లో అవ్వతాతలకు ఏం చేయబోతున్నామో చెబుతాను. నాన్నగారు పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తానని చెబుతున్నాను. పింఛన్‌ వయస్సు 60 ఏళ్లకే తగ్గిస్తాను. పింఛన్‌ నెలకు రూ.2 వేలకు పెంచుతాను. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటాం. వీటిలో ఏదైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉంటానో మీ అందరికి తెలుసు..ఎవరైనా రావచ్చు. చెడిపోయిన ఈ వ్యవస్థను బాగు చే సేందుకు బయలుదేరిన మీ బిడ్డను అశీర్వదించమని, తోడుగా నిలవమని కోరుతూ..మరొక మారు మీ అందరికి  పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. 



 
Back to Top