మోసాల్లో..బాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు

 

– నాలుగేళ్ల టీడీపీ పాలనలో విచ్చలవిడిగా అవినీతి
–బాబు హైటెక్‌ పాలనలో ఫోన్‌ కొడితే ఇంటికే మద్యం
– దేశంలో ఎక్కడ లేని పెట్రోల్, డీజిల్‌ ధరలు ఏపీలోనే ఉన్నాయి
– చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి
– 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివస్తుంది
– బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా?
– గతంలో చెప్పిన మాటలనే జైట్లీ చెప్పారు
– ప్రజల మనోభావాలకు చంద్రబాబు తలొగ్గారు
– చంద్రబాబు రాజకీయాలు చూస్తే విసుకు పుడుతుంది
– జైట్లీ ఫస్ట్‌ చెప్పినప్పుడే టీడీపీ మంత్రులు రాజీనామా చేసి ఉంటే హోదా వచ్చేది
– 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే దేశం మనవైపు చూస్తుంది
– చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నిర్వీర్యం
– బీసీలపై నిజమైన ప్రేమ చూపింది వైయస్‌ఆర్‌
– ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారు
– ఎన్ని లక్షలు ఖర్చైనా మీ పిల్లలను చదివించే బాధ్యత నాది
– మెస్, బోర్డింగ్‌ చార్జీలకు ఏడాదికి రూ.20 వేలు 
– అమ్మ ఒడి పథకం కింద తల్లుల అకౌంట్లో ఏడాదికి రూ.15 వేలు
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే నెలకు రూ. 2 వేల పింఛన్‌
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 45 ఏళ్లకే పింఛన్‌

ప్రకాశం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. అస్కార్‌ అవార్డు ఇచ్చేవారు విదేశాల్లో ఉంటారని,  చంద్రబాబు నాటకాలు ఆస్కార్‌ సభ్యులు చూసి ఉండరు కాబట్టి ఆస్కార్‌ అవార్డు ఇవ్వలేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా చంద్రబాబు రకరకాలుగా డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 108వ రోజు ప్రకాశం జిల్లా చీరాల క్లాక్‌ టవర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..
 
ఈ రోజు పొద్దున నుంచి నాతో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేశారు. అన్నా..మీకు తోడుగా ఉన్నామంటూ నాతో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. మరోవైపు తమ బాధలు చెప్పుకుంటున్నారు. తీక్షణమైన ఎండలో, నడిరోడ్డుపై ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి నిలవాల్సిన అవసరం లేదు. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపుతున్నారు.. ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు, ఆత్మీయతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు..

కొమ్మమూరు కాల్వ ఆధునీకరణ పనులు నిలిచిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మొదలుపెట్టిన పనులు ఆగిపోయాయి. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను మీరంతా చూశారు. ఒక్క అంగుళం కూడా కాల్వ పనులు ముందుకు సాగలేదు. చీరాల రూరల్‌ మండలంలో వ్యవసాయ, మురుగు కాల్వలు ఏమయ్యాయి. కుందేరు డ్రైన్‌ నుంచి సముద్రంలోకి వెళ్లాల్సి ఉండగా, నీరంతా కలుషితమై ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. డైయింగ్‌ యూనిట్లు ఉన్నప్పుడు అప్లైంట్‌ యూనిట్‌ పెట్టాలన్న ఆలోచన చంద్రబాబుకు రావడం లేదు. 

– నాలుగేళ్ల చంద్రబాబు పాలన మీరంతా చూశారు. ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఈ పెద్ద మనిషి చెబుతున్నారు. రకరకాలుగా డ్రామాలు ఆడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే ఆస్కార్‌ అవార్డులు ఇచ్చారు. అంతర్జాతీయంగా ఇచ్చే అవార్డులు ఇవి. ఆస్కార్‌ అవార్డు ఇచ్చే వారికి చంద్రబాబు గుర్తుకు రాలేదేమో..వాళ్లు విదేశాల్లో ఉంటారు కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్న నాటకాలు కనిపించి ఉండకపోవచ్చు. నాలుగేళ్లుగా చంద్రబాబు ఏరకమైన డ్రామాలు, నాటకాలు, అవినీతి చూస్తున్నాం. ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టి ఒక్కసారి ఈ పాలనను విశ్లేషించమని కోరుతున్నాను.
– పక్కన తెలంగాణ బార్డర్, తమిళనాడు, కర్నాటక బార్డర్‌లో పెట్రోల్, డీజిల్‌పై రూ.7 తక్కువగా ఉంది. మన రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెట్రోల్‌పై వీరబాదుడు బాదుతున్నారు. ఏ రాష్ట్రంలో లేని రేట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. 
– నాలుగేళ్ల క్రితం ఏమన్నారో గుర్తుకు తెచ్చుకొండి. పిల్లలు తాగి చెడిపోతున్నారు. సీఎం కాగానే మద్యాన్ని పూర్తిగా తగ్గిస్తా అన్నారు. బెల్టు షాపులు ఎత్తేయిస్తానని చెప్పారు. గ్రామాల్లో తాగడానికి మినరల్‌వాటర్‌ ఉందో లేదో కానీ..మందు షాపు లేని ఊర్లు లేవు.
– చంద్రబాబు పాలనలో రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. ఆ బియ్యంలో కూడా వేలిముద్రలు పడటం లేదని కోత విధిస్తున్నారు. గతంలో 9 రకాల సరుకులు ఇచ్చేవారు.
– బాబు సీఎం అయ్యాక మూడు సార్లు కరెంటు చార్జీలు పెంచారు. ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు.
– నాలుగేళ్ల క్రితం ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. వ్యవసాయ రుణాలు మాఫీ కావాలన్నా..బ్యాంకులో బంగారం ఇంటికి రావాలన్నా..చేనేత రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్లలో మీ రుణాలు మాఫీ అయ్యాయా? ఆయన చేసిన రుణమాఫీ పథకం రైతులకు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. మాఫీ చేశామన్నది మోసమైతే, గత ప్రభుత్వాలు రైతులు, మహిళల రుణాలకు వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టేవి. చంద్రబాబు బ్యాంకులకు వడ్డీ డబ్బులు కట్టకుండా మానేశారు.
– జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రతి ఇంటికి తన మనిషిని పంపించారు. బాబు సీఎం అయి ఇప్పటికీ 46 నెలలు అయ్యింది. ప్రతి ఇంటికి రూ.96 వేలు చంద్రబాబు బాకీ పడ్డాడు. ఎప్పుడైనా చీరాలలో చంద్రబాబు కనిపిస్తే మా రూ.96 వేలు కథ ఏంటని అడగండి.
– చంద్రబాబు పాలన అంతా కూడా అబద్ధాలు, మోసాలపైనే సాగుతోంది. ఆయన బాగా చేసింది ఏమో తెలుసా? అవినీతి బాగా చేశారు. పైన చంద్రబాబు కూర్చోని కాంట్రాక్టర్లు, మందు, మట్టి, ఇసుక, బొగ్గు, కరెంటు కొనుగోలు, రాజధానిభూములు, చివరకు గుడి భూములు కూడా వదిలిపెట్టడం లేదు. తినింది అరగక వేరే పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఒ క్కొక్కరికి రూ.30 కోట్లు ఇస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయడు. వారిని మళ్లీ గెలిపించుకునే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు. ఆ ఆవినీతి డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేస్తూ అడ్డగోలుగా నల్లధనం లంచం ఇస్తూ దొరికిపోయిన ఏకైక వ్యక్తి చంద్రబాబు మాత్రమే. మాములుగా ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికిపోతే ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించి అరెస్టు చేస్తారు. అయితే చంద్రబాబు ఇంతవరకు తన పదవికి రాజీనామా చేయడం లేదు. పదవిలో నుంచి ఎవరు ఉడబెరకరు. దారుణంగా వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు.  ఇలాంటి వ్యక్తి పాలించడానికి అర్హుడా?. పైన చంద్రబాబు ఈ స్థాయిలో తింటున్నారు. కిందస్థాయిలో జన్మభూమి కమిటీలను తయారు చేశారు. వీరు పంది కొక్కుల మాదిరిగా తింటున్నారు. చివరకు మరుగుదొడ్లు కూడా వదిలిపెట్టడం లేదు.
– ఇంతటి అన్యాయమైన ఈ పాలనలో ఉద్యోగాలు ఎలాగు ఇప్పించలేకపోతున్నారు. కాస్తోకూస్తో పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఏకైక మార్గం ప్రత్యేక హోదా ఒక్కటే. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారు. హోదా ఉంటేనే పారిశ్రామిక రాయితీలు వస్తాయి. పరిశ్రమలు వస్తాయి. ఇన్‌కం ట్యాక్స్‌లు మినహాయింపు ఉంటుంది. లక్షల కొద్ది ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి ప్రయోజనాలు ఉన్న ప్రత్యేక హోదాను చంద్రబాబు రాకుండా అడ్డుకున్నారు. నాడు వెంకయ్య నాయుడు పార్లమెంట్‌లో పరిశ్రమలు కట్టడానికి మూడేళ్లు అవుతుందని, పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అన్నారు. ఇదే పెద్ద మనిషి నరేంద్రమోడీ సభలో తిరుపతిలో 15 సంవత్సరాలు తెస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందరూ ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టారు. ఇవాళ చంద్రబాబు వైఖరి చూస్తే నాకు ఒ క్కటే గుర్తుకు వస్తుంది. నాడు స్వాతంత్రం కోసం గట్టి పోరాటం చేశారు. బ్రిటీష్‌ వాళ్లు స్వాతంత్ర పోరాటం చివరి సమయంలో మేం స్వాతంత్య్రం ఇస్తున్నామంటే ఏం చేస్తాం. చంద్రబాబు ఇదే మాదిరిగా ప్లేట్‌మార్చి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసేందుకు ముందుకు రావడం సంతోషం. అయితే ఈయన నిజాయితీగా పోరాటం చేస్తున్నారా అంటే అది కూడా అనుమానమే. గతంలోనే అరుణŠ జైట్లీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పారు. అదే మాట ఇటీవల చెబితే చంద్రబాబు రియాక్ట్‌ అయి తన మంత్రులను రాజీనామా చేయిస్తున్నాని చెప్పారు. ఇదే రాజీనామాలు రెండేళ్ల క్రితం చేసి ఉంటే ఇప్పటికే ప్రత్యేక హోదా వచ్చేది. 2014 మార్చి 2న కేబినెట్‌ మీటింగ్‌ పెట్టి ప్రత్యేక హోదా కోసం ప్లానింగ్‌ కమిషన్‌కు పంపించారు. ఏడు నెలల పాటు ఆ తీర్మానం అక్కడే ఉన్నా కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చేందుకు రకరకాల జిమ్మిక్కులు చేశారు. ధర్నాలు, బందులు చేస్తే చంద్రబాబు దగ్గరుండి బస్సులు తిప్పారు. మోడీ రాష్ట్రానికి వస్తున్నారని నేను నిరాహారదీక్ష చేస్తుంటే తెల్లవారుజామున నిరాహారదీక్షలు భగ్నం చేయించారు. ప్రత్యేక హోదా గురించి హేళనగా మాట్లాడారు. ఇవాళ ఆయన చిత్తశుద్ధి ఏంటో తెలుసా..కేంద్రం నుంచి ఆయన మంత్రులను ఉపసంహరించుకుంటార. కానీ ఎన్‌టీఏ కన్వీనర్‌గా కొనసాగుతారట. అసెంబ్లీలో బీజేపీ నేతలు బాబును పొగడటం, వారు బీజేపీ నేతలను కొనియాడటం. ప్రత్యేక హోదా కోసం మేం అవిశ్వాస తీర్మానం మేం పెడతాం..మీరు మద్దతివ్వమని కోరితే ఆయన ముందుకు రారు. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఏప్రిల్‌ 6న వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు. రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుంది. దానికి చంద్రబాబు ముందుకు రావడం లేదు. నాలుగేళ్లు ఇదే పాలన చూశారు. మళ్లీ ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మీకు మోసం చేసేవాడు నాయకుడిగా కావాలా? అబద్ధాలు చెప్పేవారు నాయకుడు కావాలా? ఇలాంటి వ్యక్తులను పొరపాటున కూడా క్షమించకూడదు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలంటే ఇలాంటి వ్యక్తులను క్షమించకూడదు. ఈ వ్యవస్థను మార్చాలంటే నా ఒక్కరితో సాధ్యం కాదు..జగన్‌కు మీ అందరి తోడు కావాలి. అప్పుడే విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది. రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తానని చెప్పి చేయకపోతే ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి.
– పొరపాటున చంద్రబాబును క్షమిస్తే..రేపు పొద్దున పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారు. రేపు ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కేజీ బంగారం ఇస్తామని చెబుతున్నారు. నమ్ముతారా? నమ్మురు కాబట్టి బోనస్‌గా ప్రతి ఇంటికి బెంజి కారు ఇస్తామంటారు. ప్రతి ఇంటికి మనిషిని పంపించి ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల డబ్బు పెడతారు. డబ్బు ఇస్తే మాత్రం వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబులో నుంచి దోచిన డబ్బే. కానీ ఓటు వేసేసమయంలో మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయమని కోరుతున్నాను. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసే వారిని బంగాళ ఖాతంలో కలిపేయండి. 
– రేపు పొద్దున దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది నవరత్నాలు ప్రకటించాం. మనం ఏం చేస్తామన్నది కొన్ని అంశాలపై చెబుతున్నాను. పేదవారి చదువుల కోసం ఏం చేస్తామన్నది చెబుతున్నాను.
– ఇవాళ మన పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్‌ చదువులు చదివించే స్థోమత మనకు ఉందా? నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సుకు రూ. 3 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత ఖర్చు చేయగలమా? ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారు. ఆయన ప్రేమ ఏంటో తెలుసా? నాలుగు ఇస్తీ్ర పెట్టేలు. నాలుగు కత్తెర్లు ఇస్తే అది బీసీలపై ప్రేమనా? నిజంగా బీసీలపై ప్రేమ చూపించింది వైయస్‌ఆర్‌ అనిగర్వంగా చెబుతున్నాను. నాన్నగారి సమయంలో పేదలకు ఒక భరోసా ఉండేది. పేదవాడు పేదరికం నుంచి పోవాలంటే ఆ కుటుంబం నుంచి అప్పులపాలు కాకుండా పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు అయితేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుంది. చదువుకుంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. అందుకోసం మహానేత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో భరోసా ఇచ్చారు. నాన్నగారు చనిపోయిన తరువాత మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఇవాళ ఇంజినీరింగ్‌కు ఏటా రూ.35 వేలు ప్రభుత్వంఇస్తుంది. మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు. నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా సరే నేను చదివిస్తాను. మీ పిల్లలను ఉన్నత చదువులు చదివించడమే కాదు..పిల్లల మెస్‌ చార్జీలు, హాస్టల్‌ చార్జీల కోసం ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం. మంచి చదువుకులకు పునాదులు పడాలంటే చిట్టి పిల్లలు బాగా చదవాలి. మీ పిల్లలను బడికి పంపించినందుకు ప్రతి ఏటా రూ.15 వేలు తల్లి ఖాతాలో జమా చేస్తామని చెబుతున్నాను. వాళ్లు ఇంజినీర్లు, డాక్టర్లు అయితేనే మన బతుకులు మారుతాయి. 
– అవ్వతాతల పింఛన్లు పెంచే విషయంలో చంద్రబాబుకు మనసు రాదు. కాంట్రాక్టర్లకు మాత్రం అంచనాలు పెంచి కమీషన్లు దండుకుంటున్నారు. గతంలో కంటే రేట్లు తగ్గినా కూడా కాంట్రాక్టర్లకు అంచనాలు పెంచుతున్నారు. పింఛన్లు మాత్రం పెంచడం లేదు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్‌ వయస్సు 65 నుంచి 60 ఏళ్లకే తగ్గించి, నెలకు రూ.2 వేలు ఇస్తాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల్లో మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. అలాంటి వారికోసం చెబుతున్నా..పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తాను. మిగిలిన నవరత్నాలపైన మరోసభలో చెబుతాను. ఇందులో మీరు ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలంటే నేను ఎక్కడ ఉన్నానో మీ అందరికి తెలుసు. చెడిపోయిన ఈ వ్యవస్థను బాగు చే సేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
 
Back to Top