దొంగలు దొంగలు కలిసి దోచుకుంటున్నారు

 

– భీమిలిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు
– ఎక్కడ భూములు కనిపించినా కబ్జాలు చేస్తున్నారు
– మంత్రి అండదండలతో ఎమ్మార్వోలు అన్యాయాలు చేస్తున్నారు
– హుద్‌హుద్‌ తుపాన్‌ పేరుతో రికార్డులు మాయం చేశారు
– జూట్‌ మిల్లు నెల రోజుల్లో తెరిపిస్తామని మంత్రి గంటా హామీ ఇచ్చారు..
– ఉత్తరాంధ్రలో 30 మంది కార్మికులు రోడ్డున పడ్డారు
– గ్రామ గ్రామాన జన్మభూమి మాఫియా కనిపిస్తుంది
– ఫీజులు పెంచుకునేందుకు మంత్రి గంటా పర్మిషన్‌ ఇస్తున్నారు
– నారాయణ కాలేజీలో 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి మౌనం
– ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం
– ఇప్పుడు ధర్మపోరాట దీక్షలతో కొత్త డ్రామాలాడుతున్నారు.
– పోలవరం పనులను చూస్తే పునాది గోడలు దాటవు
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఇంటింటా నవరత్నాలు
– ఆసుపత్రి ఫీజు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు
– అన్ని రోగాలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు
 
విశాఖ: దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి, మంత్రి కలిసి భూములు కబ్జా చేస్తున్నారని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఇంటికి పునాది వేసి బంధువలందరినీ గృహ ప్రవేశానికి పిలిస్తే అలాంటి వారిని పిచ్చోడంటారని, పోలవరం విషయంలో చంద్రబాబు ఇదే చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 264వ రోజు భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.

– కనుచూపు మేర జనమే...ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు.. కడుపునిండా బాధ ఉన్నా ప్రతి ఒక్కరూ నా భుజం తడుతూ..అన్నా..మేమంతా నీకు తోడుగా ఉన్నామని తోడుగా నా వెంట నడుస్తున్నారు.  ఎన్నో బాధలు ఉన్నా.. ప్రతి ఒక్కరూ నాపై ప్రేమానురాగాలు చూపుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక కృతజ›్ఞతలు తెలుపుతున్నాను. 

– భీమిలిలో తిరుగుతున్నప్పుడు ఇక్కడి ప్రజలు నా వద్దకు వచ్చి అన్న మాటలు..అన్నా..బాబు గారు సీఎం అయి నాలుగున్నరేళ్లు గడిచిపోయింది. కానీ నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని చెబుతున్నారు. ఇక్కడ పాలన ఎలా ఉందంటే..దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు విశాఖను దోచుకుతింటున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ బూములు, ఇనాం భూములు, అసైన్డ్‌ భూములు ఎలా దోచుకోవాలని ఇక్కడి నాయకులు ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. 
– చంద్రబాబు అవినీతికి ఇక్కడి మంత్రి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని చెబుతున్నారు. మా మంత్రి బాగా ఆరితేరారని చెబుతున్నారు. ఈ మంత్రి ఎన్నికలు వచ్చేసరికి దొంగలు స్థావరాలు మార్చినట్లు మార్చుతున్నారని చెబుతున్నారు. ఇలా నియోజకవర్గాలను దోచేస్తారు కాబట్టి అదే నియోజకవర్గంలో పోటీ చేసిన చరిత్ర ఆమంత్రికి లేదని చెబుతున్నారు. భీమిలి, తదితర తహశీల్దార్‌ కార్యాలయాల్లో జరిగిన అవినీతిపై సీట్‌ ముందు హాజరు కావాల్సి వచ్చిందన్నా..పైన మంత్రి అండదండలు లేకుండా అధికారులు అవినీతి చేయగలరా అంటున్నారు.
– ఇక్కడ పరిపాలన చూస్తే ఆశ్చర్యమనిపిçస్తుందని చెబుతున్నారు. హుద్‌హుద్‌ తూపాన్‌ వచ్చినప్పుడు వర్షం, విఫరీతమైన గాలులు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం హూద్‌హుద్‌ తుపాన్‌ కారణం చూపించి 16 వేల రికార్డులు మాయమైపోయాయని చెప్పారు. తుపాన్‌ను కారణంగా చూపించి 250 మ్యాప్‌లు మాయమైనట్లు చూపించి  భూములు దోచుకుంటున్నారు.
– వేములవలసలో ప్రభుత్వ భూములను ఇదే గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ బూములను తన బూములుగా సృష్టించి, ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఏకంగా లోన్లు తెచ్చుకున్నారు. ఏ స్థాయిలో దోచేస్తున్నార ంటే, ఈ మంత్రి చిన్నబాబుతో కలిసి దోచుకొని పంచుకుంటున్నారు. అసైన్డ్‌భూములు భయపెట్టి, బెదిరించి లాక్కుని ల్యాండ్‌ ఫూలింగ్‌ అంటూ నోటిసులు ఇప్పిస్తున్నారు. చిన్నబాబుతో కుమ్మక్కై పావలా రేటుకు కొనుగోలు చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌ సీఎం కార్యాలయ ఆదేశాల మేరకు నోటీసులు ఇస్తున్నారంటే ఏ స్థాయిలో దోచుకుంటున్నారో ఇంతకన్న నిదర్శం కావాలా? ఇది మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి పరిస్థితి
– ఇక ఈ మంత్రికి చెందిన విద్యాశాఖలో ఇంకా అవినీతి నెలకొంది. మంత్రిగారి వియ్యంకుడు నారాయణ కాలేజీల్లో ఫీజులు విఫరీతంగా బాదుడే బాదుడు. పెంచుకునే దానికి మంత్రిగారు దగ్గరుండి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారు. ఫీజులు విఫరీతంగా పెంచిన తరువాత నారాయణ కాలేజీల్లో సుమారుగా 30 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక కమిటీ వేసి నారాయణ కాలేజీలు మూత వేయించి, నారాయణను జైల్లో పెట్టించాలి. కానీ మంత్రి గారు తన వియ్యంకుడు కాబట్టి గోళ్లు గిల్లుకుంటున్నారు. ప్రభుత్వ కాలేజీలను పూర్తిగా నిర్వీర్యం చేయిస్తున్నారు. కాలేజీల్లో తనిఖీ అంటూ ఓ కమిటీ ఏర్పాటు చేయించి ఆ ఇంజినీరింగ్‌ కాలేజీల నుంచి  డబ్బులు వసూలు చేస్తున్నారు.
– మంత్రి గారి పరిస్థితి ఎలా ఉందంటే పది నుంచి ఇంటర్‌ పరీక్షల పేపర్లు లీక్‌ అవుతున్నాయి. నారాయణ స్కూళ్లకు ముందుగా పేపర్‌ లీక్‌ అవుతోంది. బడి పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లలో స్కాం, కందిపప్పు, స్కూల్‌ యూనిఫాంలో స్కాం, స్కూళ్లకు వేసే సున్నంలో కూడా స్కామే, చివరకు మధ్యాహ్న భోజన పథకాన్ని దగ్గరుండి స్కాంగా మార్చి దాన్ని ప్రయివేట్‌ వ్యక్తులకు కట్టబెట్టడానికి మరో స్కామ్‌ రూపొందిస్తున్నారు. 
– పక్కనే ఆంధ్ర యూనివర్సిటీ కనిపిస్తుంది. అక్కడ ఫీజులు తక్కువ కాబట్టి పేదలంతా అక్కడికే వెళ్తారు. అక్కడ ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఏయూ పరిస్థితి బాగోలేదని చెప్పి చంద్రబాబు బంధువుకు చెందిన గీతం యూనివర్సిటీకి  పిల్లలను పంపిస్తున్నారు. 
– చిట్టివలస జుట్టుమిల్‌ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఆరు వేల మంది పనిచేస్తున్న ఈ ఫ్యాక్టరీని నెల రోజుల్లో లె రిపిస్తానని గంటా హామీ ఇచ్చారు. ఇప్పటికి నాలుగున్నరేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదు. రెండెకరాల గోడౌన్‌ స్థలం మంత్రి దగ్గరుండి వేరే వారితో కొనుగోలు చేయించారు. ఆ డబ్బును కార్మికులకు ఇవ్వకుండా వ్యాపారం చేయాలని దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు.
–  ఒక వైపు విశాఖలోని ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో మీటింగ్‌లు పెడుతారు. మూడు రోజులకు కోట్లు ఖర్చు చేశారు. ఆ మీటింగ్‌లో రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్నారు. ఉద్యోగాలు వచ్చాయా? ఇదే ఉత్తరాంధ్రలో 35 జూట్‌ మిల్లులు ఉంటే, దాదాపు 50 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఇందులో కేవలం 18 మిల్లులు మాత్రమే పనిచేస్తున్నాయి. ఏకంగా 30 వేల మంది రోడ్డున పడ్డారు.
– దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జూట్‌మిల్లులకు యూనిట్‌కు రూ.3.50లకు అందేది. చంద్రబాబు సీఎం అయ్యాక యూనిట్‌ కరెంటు బిల్లు రూ.8.40 పెంచారు. కరెంటు బిల్లులు ఈ మాదిరిగా పెంచితే జూట్‌ మిల్లులు ఎలా నడుస్తాయి చంద్రబాబూ?
– ఇదే జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. నష్టాల్లో నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పెద్ద మనిషి కళ్ల ముందే కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఉన్న ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. చంద్రబాబు చెప్పిన అనేక హామీలు నెరవేర్చలేదు. తగరపు వలసలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. గంటాకు తెలివి తేటలు ఎక్కువ కదా? 2016లో రెడిమెడ్‌ స్టోన్‌ తెచ్చి అక్కడ టెంకాయ కొట్టారు. ఇప్పుడు ఆ శిలాఫలాకాన్ని తీసుకెళ్లారు. కారణం ఏంటంటే 2018లో ఎన్నికలు వస్తే భీమిలితో ఆయనకు పని ఉండదు కాబట్టి శీలాఫలాకాన్ని తీసుకెళ్లారు. ఎన్నికలకు ముందు అది చేస్తాం..ఇది చేస్తామని చెబుతారు. ఈయనకు బాస్‌ ఒకరు ఉన్నారు. ఆయనే పిల్లిగడ్డం ఆయన. ఈ ఇద్దరు ఒకరికి మించి ఒకరు అబద్ధాలు ఆడుతారు. ఇక్కడ రైతు బజార్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇంత చిన్న పని కూడా చేయలేకపోయారు.
– అల్లూరి సీతారామరాజు జన్మించిన ప్రాంతంలో వంతెన నిర్మించలేని అసమర్ధ ప్రభుత్వం ఇది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు . మళ్లీ ఎన్నికల్లో ఇవే హామీలు ఇస్తున్నారు.
– అన్నా..నాయకుడంటే ఆ రోజుల్లో నాన్నగారు వైయస్‌ రాజశేఖరరెడ్డిని చూశామన్నా అని చెబుతున్నారు. ఆ రోజు నగరబాట కింద నాన్నగారు ఇక్కడికి వస్తే తాగడానికి నీరు లేదని చెబితే..అప్పటికప్పుడు రూ.20 కోట్లు నిధులు కేటాయించి నీటిని ఇచ్చారని చెబుతున్నారు. మదురవాడలో ఐటీ ఏర్పాటుకు నాన్నగారు చేసిన కృషి చెప్పడానికి మాటలు  చాలవని చెబుతున్నారు. మహానేత చనిపోయిన తరువాత ఉన్న ఐటీ పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయని చెబుతున్నారు. నాయకుడంటే నాన్నగారు అని చెబుతున్నారు.
– ఇదే భీమిలి నియోజకవర్గంలో నాన్నగారి పాలనలో ఏకంగా 32820  ఇళ్లులు కట్టించిన ఘనత వైయస్‌ రాజశేఖరరెడ్డిది అని చెబుతున్నారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఇవాళ ఇళ్ల గురించి మాట్లాడే నాయకుడు లేడు అంటున్నారు. ఇంతదారుణంగా పరిపాలన సాగిస్తున్నారని చెప్పుకొస్తున్నారు.
– ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పాలనను చూడండి. నాలుగున్నరేళ్లు పూరై్తంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సారి ఓటు వేసే ముందు మీ గుండెలపై చేతులు వేసుకొని మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచన చేయండి. అబద్ధాలు చెప్పేవారు, మోసాలు చేసేవారు మీకు నాయకుడిగా కావాలా అని అడుగుతున్నాను. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో మనం చూసిందేంటి? రాష్ట్రంలో పాలన ఎలా ఉందంటే..రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, సున్నా వడ్డీలు, పావలా వడ్డీ రుణాలు లేవు, రుణమాఫీ లేదు. ఈ పెద్ద మనిషి చేసిన పాపం ఇంతా అంతా కాదు. ఆ రోజుల్లో పొదుపు సంఘాలను నేనే కనిపెట్టానని చెప్పారు. ఆరోజు ఎన్నికల్లో పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. ఆ రోజు టీవీల్లో ఏం కనిపించేది. ఒక్క అక్క మెడలో నుంచి ఒక చేయి మంగళ సూత్రం లాక్కుంటుంటే..మరో చెయి ఇచ్చి ఇలా పట్టుకొని వెంటనే ఏమన్నారో తెలుసా?? ఆయన వస్తున్నారని అడ్వైర్‌టైజ్‌మెంట్‌ చూపించారు. సీఎం అయ్యాక చంద్రబాబు సిగ్గు లేకుండా వెస్టు గోదావరిలో మీటింగ్‌ పెట్టి శాలువా కప్పించుకొని పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేశానని అబద్ధాలు ఆడుతున్నారు.
– ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు మన ఎమ్మెల్యేలు వెళ్లకుండా రాతపూర్వకంగా ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేసింది. ప్రశ్న నంబర్‌ 4002లో పుష్పశ్రీవాణి, ఆర్కే రోజా, గౌరు చరితారెడ్డిలు ప్రశ్నలు అడిగారు. ఏ. ప్రశ్న..రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిన రుణాలు ఎంత అని అడిగారు. ఈ ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ..డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని చెప్పారు. మిగిలి ఉన్న డ్వాక్రా రుణాల మొత్తం ఎంత? ఇప్పటి వరకు మాఫీ చేసిన రుణం ఎంత అని రెండో ప్రశ్న వేస్తే..రూ.11600 కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయని, వీటిలో ఎలాంటి మాఫీ చేయలేదని చెప్పారు. మూడో ప్రశ్న డ్వాక్రా రుణాల మాఫీకి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా అంటే ..లేదండి అని సమాధానం ఇచ్చారు. బయటనే మాఫీ చేశామని చెబుతున్నారు.
– ఈ మధ్యకాలంలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై కొత్త సినిమా చూపిస్తున్నారు. పనులు పునాదులు దాటడం లేదు. మట్టి కట్ట డిజైన్‌ కూడా ఖరారు కాలేదు. కానీ ఈ పెద్ద మనిషి ఏమంటారు. గ్యాలరీ చూపిస్తున్నారు. పునాదులు కట్టిన వ్యక్తులు ఇళ్లు పూర్తి అయినట్లు ఇంటికి భోజనానికి పిలిస్తే ఆ వ్యక్తిని ఏమంటారు. పిచ్చోడు అనరా? ఇవాళ మనందరిని పిచ్చొళ్లను చేస్తున్నారు. ఈయనకు తోడు ఎల్లో మీడియా తోడైంది. తానా అంటే తందానా అంటూ ఎల్లో మీడియా కథనాలు.
– ప్రత్యేక హోదా మనకు రాకుండా పోవడానికి కారణం ఎవరు? ఈయనేమో ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు ఇప్పుడు డ్రామాలాడుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మంత్రి పదవుల నుంచి తొలగిపోతామని ఆల్టిమేటం ఇచ్చి ఉంటే ఇప్పటికి ప్రత్యేక హోదా వచ్చేది కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పెద్ద మనిషి పరిపాలన మనకు కనిపించేది ఏంటో తెలుసా? రైతులకు రుణాలు మాఫీ కావడం లేదు, సున్నా వడ్డీ రుణాలు అందడం లేదు. డ్వాక్రా మహిళల పరిస్థితి ఇంతే. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. దాదాపుగా 55 నెలలు అవుతోంది. ప్రతి ఇంటికి రూ.1.10 లక్షలు చంద్రబాబు బాకీ పడ్డారు. ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. ప్రత్యేక హోదా కూడా రాకుండా పోయింది. 
– కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ ధరలు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు, స్కూల్‌ ఫీజుల దాకా బాదుడే బాదుడు. కాంట్రాక్టర్ల నుంచి ఇసుక, బొగ్గు, మట్టి, కరెంటు కొనుగోలులో లంచాలు, రాజధాని భూములు, చివరకు గుడి భూములను కూడా వదలకుండా దోచేస్తున్నారు.
– చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పాతరేశారు. ఆరోగ్యశ్రీ పడకేసింది. వైద్యం చేయించుకోలేక చివరకు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడవాళ్లు ప్రసవం చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతోంది. ఆ రోజుల్లో 108కు ఫోన్‌ చేస్తే కుయ్‌..కుయ్‌ అంటూ 20 నిమిషాల్లో వచ్చేది. ఇవాళ అంబులెన్స్‌ రావడం లేదు.
– రేషన్‌ షాపుల్లో బియ్యం అందడం లేదు. వేలి ముద్రలు పడటం లేదని బియ్యంలో కొత విధిస్తున్నారు. పేదలకు  ఇళ్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు. పింఛన్లు, రేషన్‌కార్డులు, చివరకు మరుగుదొడ్లు కావాలంటే లంచాలు ఇవ్వాల్సిందే. గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫీయా కనిపిస్తోంది.
– రేపు పొద్దున ఇలాంటి వ్యక్తులను పొరపాటున క్షమిస్తే..ఏం జరుగుతుందో తెలుసా? అన్నా..అక్కా..రేపు పొద్దున రాజకీయాల్లో విశ్వసనీయత ఉండదు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. చంద్రబాబు లాంటి వ్యక్తులను పొరపాటున క్షమిస్తే..రేపు పొద్దున చంద్రబాబు ఏం చేస్తారో తెలుసా? మీ చెవ్వుల్లో పూలు పెట్టేందుకు ఎన్నికల్లో చెప్పిన వాటిలో 98 శాతం పూర్తి చేశానని చెబుతారు. చిన్న చిన్న అబద్ధాలు చెబితే నమ్మరని ఆయనకు బాగా తెలుసు. ఈ సారి మీ వద్దకు వచ్చి ఏమంటారో తెలుసా? ఈ సారి టీడీపీకి ఓటు వేస్తే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్ముతారా? నమ్మరు అని తెలుసు అందుకే..బంగారానికి బోనస్‌గా ఇంటికో బెంజి కారు ఇస్తామంటారు. అయినా నమ్మరని తెలుసు కాబట్టి..ప్రతి ఇంటికి తన మనుషులను పంపించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేల డబ్బులు పెడతారు. డబ్బులు ఇస్తే వద్దనకండి..రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. కానీ ఓట్లు వేసేటప్పుడు మీ మనసాక్షి ప్రకారం వేయండి. అబద్ధాలు చెప్పేవారు, మోసాలు చేసేవారిని బంగాళఖాతంలో కలిపేయండి.
చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ రావాలంటే జగన్‌కు మీ అందరి దీవెనలు, ఆశీస్సులు కావాలి. 
– రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేయబోతున్నామని చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలని ఈ పథకాలు ప్రకటించాం. ఇందులోని అన్ని అంశాలు ఒకే మీటింగ్‌లో చెప్పడం సాధ్యం కాదని, ఒక్కో పథకం చెబుతున్నాను, ఈ మీటింగ్‌లో పేదవారి ఆరోగ్యం కోసం ఏం చేస్తామన్నది చెబుతున్నాను.
– దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. పేదవాడు అప్పులపాలు అయ్యే పరిస్థితి రెండే రెండు కారణాల వల్ల వస్తుందని చెబుతుండేవారు. పేదవాడు తన బిడ్డలను చదివించేందుకు ఫీజులు కట్టేందుకు అప్పులపాలు అయ్యేవారు. పేదవారికి జబ్బు చేస్తే..ఆ రోగం నయం చేయించుకునేందుకు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చేర్పించాలంటే లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ పేదవాడి కుటుంబం వడ్డీల కోసం పరుగులు తీసినప్పుడు అప్పులపాలు అయ్యేవారు. రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా, దేశంలో ఎప్పుడు లేని విధంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరెడ్డి హయాంలో 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే చాలు 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చేది. వైయస్‌ రాజశేఖరరెడ్డి గొప్ప కల కన్నారు. ఇవాళ ఆ మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. ఏదైనా పెద్ద రోగం వస్తే మంచి ఆసుపత్రులు ఉన్న హైదరాబాద్‌కు వెళ్తాం. అక్కడ మంచి ఆసుపత్రులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్తాం. కానీ ఇవాళ చంద్రబాబు హయాంలో పరిస్థితి ఏంటో తెలుసా? ఏదైనా జబ్బు చేసి హైదరాబాద్‌కు వెళ్తే అక్కడ ఆరోగ్యశ్రీ వర్తించదట. ఇవాళ ఆరోగ్యశ్రీ వైద్యం చేయించాలంటే నెట్‌వర్స్క్‌ ఆసుపత్రికి వెళ్లాలి. ఈ ఆసుపత్రులకు చంద్రబాబు బకాయిలు చెల్లించడం లేదు. డయాలసిస్‌ చేయించేందుకు ఒక్కసారికి రూ.2 వేలు ఖర్చు అవుతుంది. ఏడాదికి రూ.2 లక్షలు  ఖర్చు అవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఖాళీలు లేవు. వచ్చే ఏడాది రండని చెబుతున్నారు. క్యాన్సర్‌ వస్తే కీమో థెరపీ చేయాలి. ఒక్కసారి కీమోథెరపీ చేయాలంటే లక్ష ఖర్చు అవుతుంది. ఇవాళ పరిస్థితి ఏంటో తెలుసా? కీమోథెరఫీ రెండు సార్లే చేస్తారట. ఆరు నెలల తరువాత మళ్లీ క్యాన్సర్‌ వస్తుంది. మళీ కీమోథెరఫీ కోసం వెళ్తే చేయడం లేదు. మనచిన్న పిల్లలకు పొరపాటున మూగ, చెవుడు వస్తే ఆపరేషన్‌ చేయించాలంటే రూ.6 లక్షలు ఖర్చు అవుతుంది. ఆపరేషన్‌ చేయించకపోతే జీవితాంతం అలాగే ఉండాల్సి వస్తోంది. ఇవాళ కుంటి సాకులు చూపుతున్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీలో ఎవరికైనా బాగోలేకపోతే 108కు ఫోన్‌ చేస్తే డ్రైవర్లు సై్టక్‌లో ఉన్నారని చెబుతున్నారు. అంబులెన్స్‌కు డీజిల్‌ లేదని, టైర్లు లేవని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా మసకబారింది. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి పేదవాడికి చెబుతున్నాను., నాన్నగారు పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే..జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాను. వెయ్యి రూపాయల బిల్లు దాటితే చాలు దాన్ని ఆరోగ్యశ్రీ కింద వర్తింపజేస్తాం. ఎంతటి ఆపరేషన్‌ అయినా సరే ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా ఆపరేషన్‌ చేయిస్తాం. ప్రతి పేదవాడికి ఉచితంగా ఆపరేషన్‌ చేయించడమే కాదు..డాక్టర్లు రెస్టు తీసుకోవాలని చెబితే ..ఆ సమయంలో డబ్బులిచ్చి ఆదుకుంటాం. ప్రతి పేదవాడికి ఇవాళ హామీ ఇస్తున్నాను. మంచి ఆసుపత్రి ఎక్కడ ఉన్నా ఫర్వాలేదు. అక్కడ ఆపరేషన్‌ ఉచితంగా చేయిస్తానని ప్రతి పేదవాడికి తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను. వీటిలో ఏదైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉన్నానో మీ అందరికి తెలుసు..ఎవరైనా రావచ్చు..అర్జీలు ఇవ్వవచ్చు..సలహాలు ఇవ్వవచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిని మీ బిడ్డకు తోడుగా ఉండమని పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతు సెలవు తీసుకుంటున్నాను.
 
Back to Top