ఎన్నికలకు ఆరు నెలల ముందు..నాలుగు నెలల కోసం
- ఇదీ చంద్రబాబు పాలన
– బాబు సీఎం కాగానే కొబ్బరి ధరలు పడిపోయాయి
– హెరిటేజ్‌ కోసం బాబు దళారీలకు నాయకత్వం వహిస్తున్నారు
– బాబు ఇచ్చిన హామీ గురించి అడిగితే బెదిరించారు
– చంద్రబాబుది మోసాలు, అబద్ధాల పాలన
– బాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలా పాలన చేస్తున్నారు
– 
– అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మలను గు్రరాలతో తొక్కించారు
– ఆరోగ్యశ్రీని బాబు అటకెక్కించారు.
–  బాబు పుణ్యన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
–బాబు ఎప్పుడు మారడు..కుక్క తోక వంకర
– మధ్యాహ్న భోజన పథకం ఆయాలకు ఆరు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి బాబు ఎగనామం పెట్టారు
– అబద్ధాలు చెప్పేవారిని, మోసం చేసేవారిని బంగాళఖాతంలో కలపండి
– రాజన్న రాజ్యంలో ఏ ఒక్కరు పస్తులుండకూడదు
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే పింఛన్‌ రూ.2 వేలకు పెంచుతాం
– పింఛన్‌ వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం
– ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌


తూర్పు గోదావరి: చంద్రబాబు ఏమి చేసినా కూడా ఎన్నిలకు ఆరు నెలల ముందు..నాలుగు నెలల కోసమే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభివర్ణించారు. ఇది చంద్రబాబు సినిమా టైటిల్‌ అని వివరించారు. చంద్రబాబు ఎప్పుడు మారడని, కుక్క తోక వంకర అనే సామెతను గుర్తు చేశారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అబద్ధాలు, అన్యాయం, అవినీతి, అరాచకాలే అని వివరించారు. ప్రజా సంకల్ప యాత్ర 199వ రోజు అమలాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..
– కన్నులెత్తి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. ఈ ఎండలో నాతో పాటు నడవాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. ఈ ఎండలో, దుమ్ములో నిలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా కూడా చిక్కని చిరునవ్వుతో ఆప్యాయతలు పంచుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు
– కోనసీమ పరిస్థితి ఇవాళ ఎలా ఉంది అని చెప్పి ఇక్కడ గత కొంత కాలంగా నడుస్తుంటే నాకు అనిపించింది ఏమిటంటే..కోనసీమలో గోదావరి ఉంటుంది. కానీ రబీ పంటకు చాలీ చాలని నీరు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఉంటాయి. కానీ తాగడానికి మాత్రం మంచినీళ్లు దొరకడం లేదు. ఒక్కడ పెట్రోలు నిక్షేపాలు ఉన్నా కరువు పరిస్థితి తప్పడం లేదు.  ఈ రాష్ట్రానికి హోం మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన సొంత మండలంలోని పోలీసు స్టేషన్‌లో హోం గార్డును కూడా నియమించుకోలేని ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.70 కోట్లతో బిడ్జి కట్టిస్తే..చంద్రబాబు కనీసం డ్రైన్‌ నిర్మించలేకపోతున్నారు. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ ప్రాంతాన్ని గాలికి వదిలేశారు.
– 2014లో ఇదే జిల్లా నుంచి చంద్రబాబుకు 19 స్థానాలకు గాను 14 స్థానాలు ఇస్తే..అవి కూడా సరిపోలేదని, వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. ఇంత మంది ఎమ్మెల్యేలనుతీసుకున్న చంద్రబాబు ఏం చేశారని ఈ జిల్లా ప్రజల తరఫున అడుగుతున్నాను. ఈ అమలాపురానికి ఏం చేశావని అడుగుతున్నాను.
– చంద్రబాబు హయాంలో రైతులు నా వద్దకు మొరపెట్టుకుంటున్నారు. అన్నా..మా జిల్లాలో వరి సాగుచేస్తున్నాం. కనీస మద్దతు ధర రూ.1550 అంటున్నారు. మార్కెటుకు వెళ్తే రూ.1130 కూడా రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఆ రోజుల్లో ఇదే కోనసీమలో క్రాప్‌ హాలీడే డిక్లైర్‌ చేసి రైతులు సమ్మే బాట పడితే..అప్పట్లో చంద్రబాబు వచ్చి ఏమన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే స్వామినాథన్‌ కమిటీ ఏర్పాటు చేసి న్యాయం చేస్తామన్నారు. సీఎంఅయ్యాక స్వామినాథన్‌ కమిషన్‌ను మరిచిపోయారు. రైతులను పట్టించుకోవడం లేదు. ఈ పెద్ద మనిషి కేంద్రంలో ఉన్న బీజేపీతో నాలుగేళ్లుగా సంసారం చేశారు. నాలుగేళ్లు బీజేపీ, టీడీపీ కలిసికట్టుగా సంసారం చేశారు. రైతులకు వరికి మద్దతు ధర పెంచమని కేంద్రానికి చంద్రబాబు ఒక్క లేఖ కూడా రాయలేదు. నాలుగునర సంవత్సరాల్లో వరికి మద్దతు ధర రూ.50 మాత్రమే పెరిగింది. 
– నాన్నగారి పాలనను ఈ ప్రాంత రైతులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అప్పట్లో రూ.800 ఉన్న మద్దతు ధరను రూ.1050కి తీసుకెళ్లారు. ఇదే జిల్లాలో ప్రత్యామ్నయంగా వరికి రేటు రాని పరిస్థితిలో రైతులు రోయ్యల చెరువుల వైపు మళ్లుతుంటే..చంద్రబాబు పట్టించుకోవడం లేదు. బాబు పుణ్యమా అంటూ భూమిపై పండే పంటలకు మద్దతు ధర లేదు. నీళ్లలోని పంటకు గిట్టుబాటు ధర లేదని అంటున్నారు.  నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా?. కొబ్బరి రైతులు వాపోతున్నారు. అన్నా..ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యారు..కొబ్బరి రేటు ఢమాల్‌న పడిపోయింది. దళారీ వ్యవస్థను తీసేయాల్సిన ఈ సీఎం దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. హెరిటేజ్‌ సంస్థను పెట్టి లాభాలు పెంచుకునేందుకు చంద్రబాబు దళారీలకు తానే నాయకుడిగా ఉన్నారు. రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటినే చంద్రబాబు ప్యాక్‌ చేసి నాలుగు రేట్లు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. రైతులకు ఇక గిట్టుబాటు ధర ఎక్కడి నుంచి వస్తుంది?
– ఇదే కోనసీమలో పరిస్థితి ఎలా ఉందంటే..ఖరీఫ్‌లో ముంపు సమస్య. రబీలో సాగునీటికి కొరత. నియోజకవర్గంలో కూనవరం డ్రైన్‌ ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో పంటలు ఏటా మునిగిపోతున్నారు. తాగునీటి సమస్య గురించి ప్రజలు నా వద్దకు వచ్చి చెబుతున్నారు. నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నాన్నగారు మంచినీటి పథకం నిర్మించి 40 వేల మందికి నీటిని అందించారని చెబుతున్నారు. తాగునీటిపై వైయస్‌ఆర్‌ ప్రత్యేక ధ్యాస పెట్టారని చెబుతున్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో నడికుడి వద్ద సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మించి అమలాపురానికి తాగునీటిని అందిస్తున్నారు. నాన్నగారు వెళ్లిపోయారు. చంద్రబాబు పరిపాలనలో ఇవాళ తాగడానికి నీరు లేదన్నా అంటున్నారు. నాన్నగారి హయాంలో ఏర్పాటు చేసిన తాగునీటి పథకాల్లో పని చేస్తున్న కార్మికులకు 8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
– ఆ రోజు ఈ పెద్ద మనిషి ఏమన్నారు. రూ.2లకే 20 లీటర్ల మినిరల్‌ వాటర్‌ ఇస్తామన్నారు. ఇవాళ ఏగ్రామానికి వెళ్లినా కూడా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ కనిపించడం లేదు. ఏ గ్రామం వెళ్లినా మందు షాపు కనిపిస్తోంది. ఈయన పరిపాలనలో ఫోన్‌ కొడితే నీరు తీసుకొని ఇంటికి రావడం లేదు. అదే ఫోన్‌ కొడితే మందు బాటిల్‌ తీసుకొస్తున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. 
– ధవళేశ్వరం నుంచి పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి మంచినీటిని సరఫరా చేయాలని మహానేత ఆలోచించారు. నాన్నగారు చనిపోయాక ఈ పథకం గురించి ఆలోచించడం లేదు. 
– అన్నా.. ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో అడిగిన వారికి ఇల్లు వచ్చాయి. చంద్రబాబు పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నా అంటున్నారు. ఎన్నికలప్పుడు ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, ఇల్లు కట్టిస్తానని చంద్రబాబు అన్నారు. ఒక్క ఇల్లైనా చంద్రబాబు కట్టించారా? లేదు. బొడసక్కు్రరులో నాన్నగారు ఇంటి స్థలం ఇస్తే..టీడీపీ నాయకులు బలవంతంగా ఇళ్ల స్థలాలు లాక్కుంటున్నారు. అక్కడ ప్లాట్లు కట్టిస్తారట. అవినీతి చేయడం చిన్న చితక లీడర్ల నుంచి చూస్తున్నాం. చంద్రబాబు అంత దుర్మార్గుడు ఎవరైనా ఉంటారా? 300 అడుగుల ప్లాట్లు ఇస్తారట. అడుగుకు రూ.2 వేల చొప్పున పేదవాడికి రూ.6 లక్షల చొప్పున అమ్ముతారట. ఇసుక తక్కువ రేటుకే ఇస్తామంటున్నారు. సిమెంట్‌ ధరలు తగ్గాయి. కానీ అడుగుకు రూ.2 వేల చొప్పున అమ్ముతారట. పేదవాడి తరఫున రూ.3 లక్షలు అప్పుగా రాసుకుంటారట. 20 ఏళ్ల పాటు నెల నెల రూ.3 వేల చొప్పున కడుతూ పోవాలంట. లంచాలు తీసుకునేది చంద్రబాబు..పేదవాడు మాత్రం నెల నెల కంతులు కట్టాలట. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొన్ని ప్లాట్లు కట్టి పంచే కార్యక్రమం చేస్తారు. ఆయన ప్లాట్లు ఇస్తే తీసుకోండి. మనందరి ప్రభుత్వం వచ్చాక ఆ ప్లాంట్ల కోసం రూ.3 లక్షలు మాఫీ చేస్తానని చెబుతున్నాను. 
– ఓఎన్‌జీసీ టర్నినల్‌ నిర్మాణం కోసం ఇసుక తరలింపులో వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? వేల లారీలలో లక్షల టన్నుల ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక ర్యాంపుల్లో పోక్లేయిన్లు, వేలాది లారీలు కనిపిస్తున్నాయి. మన కళ్లేదుటే ఇసుక తరలిస్తున్నా కలెక్టర్లు అడ్డుకోరు. పోలీసులు దగ్గరుండి పంపిస్తున్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే, చిన్నబాబు, పెద్ద బాబుకు లంచాలు తీసుకుంటున్నారు. పైన చంద్రబాబు ఇసుక నుంచి మట్టి, మద్యం, మట్టి, కాంట్రాక్టర్లు, బొగ్గు కొనుగోలు, రాజధాని బూములు, గుడి భూములు, గుడిలో ఉన్న నగలను దోచేస్తారు. కింద దోపిడీ కోసం గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఇవాళ పింఛన్లు కావాలన్నా లంచాలు కావాలి. రేషన్, రేషన్‌ బియ్యం కావాలన్నా లంచాలే. చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచాలు కావాల్సిందే. ఇంతదారుణంగా చంద్రబాబు పాలన సాగుతోంది. 
– నాలుగేళ్ల క్రితం ఎన్నికల ప్రణాళిక అని ఒక పుస్తకం తయారు చేశారు. ఇవాళ ఆ మేనిఫెస్టో ఆన్‌లైన్‌ నుంచి తొలగించారు. ఎక్కడ చొక్కా పట్టుకుంటారో అని చంద్రబాబుకు భయం. కాపులు వెళ్లి చంద్రబాబును గట్టిగా ప్రశ్నిస్తే..వారిపై సంఘ విద్రోహశక్తులుగా ముద్ర వేశారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో కాపులపై కేసులు బనాయించారు. చిత్రహింసలకు లోను చేస్తున్నారు. మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తామని హామీ ఇచ్చారని అడగడానికి వెళ్తే ఇదే చంద్రబాబు తాట తీస్తా అంటారు.  క్షమాపణ అడగాల్సింది పోయి తాట తీస్తానంటారు. నాయీబ్రాహ్మణులు ఎన్నికల మేనిఫేస్టో పట్టుకొని చంద్రబాబును అడిగితే ఆయన ఏమంటారు. మీ తోక కత్తరిస్తా అంటారు. ఇన్ని రకాలుగా మోసాలు చేసే వ్యక్తి, అబద్ధాలు చెప్పే వారిని చూస్తే ఓ కథ గుర్తుకు వస్తుంది. ఆ కథేంటంటే..
– ఒక మోసపూరిత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మనకు తన ప్లాట్లను అమ్మేందుకు ఏం చెబుతారు. అదిగదిగో ఏయిర్‌పోర్టు, రింగ్‌ రోడ్డు అంటారు. ఇక్కడే ఐటీ హబ్‌ అంటారు. వంద అంతస్తుల భవనాలు అంటారు. కిలోమీటర్‌ దూరం పోతే పక్కనే ఇండస్ట్రీయల్‌ కారిడర్‌ అంటారు. ఏసీయాలోని అతిపెద్ద షాపింగ్‌మాల్‌ ఇక్కడే అంటారు. మల్టీఫ్లెక్స్‌ సినిమా హాల్‌ ఇక్కడే అంటారు. అంతటితో ఆగిపోడు..ఈ రోజు పెట్టుబడి పెట్టే డబ్బు నాలుగు నెలల్లో పది రేట్లు పెరుగుతుందని అంటారు. నాలుగేళ్లు అయిపోయిన తరువాత అక్కడ పిచ్చి మొక్కలు తప్ప..ఆ భూమిలో ఏమి కనిపించవు. ప్రజలంతా ఎక్కడబ్బా ఎయిర్‌పోర్టు..మల్టీఫ్లెక్స్‌ భవనాలు అని ఎదురుచూస్తే..ఆ మోసపూరిత వ్యాపారి మరో వెంచర్‌ వేసి..మళ్లీ ఇవే మాటలు చెప్పడం మొదలుపెట్టి అమ్మాలని మొదలుపెడతారు. ఇలా మోసం చేసేవారిని 420 అంటాం. 
– ఇవాళ మన రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో గమనించండి. మన సీఎం చెబుతున్న రియల్‌ ఎస్టేట్‌ సినిమా ఎలా ఉందో చెబుతున్నాను. అదిగదిగో సింగపూర్‌ రాజధాని అంటారు. అదిగదిగో పోలవరం. ఆరు నెలల్లో పూర్తి అవుతుంది. ఇక్కడే ఐకానిక్‌ టవర్, పక్కనే ఐకానిక్‌ బ్రిడ్జి అంటారు. దానిపక్కనే సిలికాన్‌ వ్యాలీ. పక్కనే వందస్తుల బిల్డిండ్‌ ఉంటుంది. ఆ పక్కనే బుల్లెట్‌ ట్రైన్, హైపర్‌ లూప్, మైక్రోసాప్ట్‌ ఆఫీస్‌. అందులో సత్యనాదేళ్ల కనిపిస్తారు. ఆయనకు చంద్రబాబు ట్యూషన్‌ చెబుతారు. చంద్రబాబు చూపిస్తున్న సినిమాలో మన రాష్ట్రం దేశం కన్న డబుల్‌ స్పీడ్లో జీడీపీ అంటారు. రూ. 20 లక్షల కోట్లు పెట్టుబడి..40 లక్షల ఉద్యోగాలు అంటారు. అనంతపురం కరువును రెయిన్‌ గన్లతో జయించారట. దోమలపై యుద్ధం..దోమలను చంపేసే సూపర్‌ డ్రోన్స్‌. చంద్రబాబు సినిమా రసవత్తరంగా ఉంది. మోసపూరిత వ్యాపారి ఎలాంటిసినిమా చూపిస్తారో చంద్రబాబు అలా చూపిస్తున్నారు. చంద్రబాబు దుష్టపరిపాలన వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. నిరుద్యోగులు ఆకలి కేకలు వేస్తున్నారు. ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలని ఆ పిల్లలు అడుగుతున్నారు. వాస్తవ పరిస్థితి దారుణంగా ఉంది. అక్కచెల్లెమ్మల మానప్రాణాలతో ఆడుకుంటున్నారు. గ్రామ గ్రామంలో ఇవాళ కనిపిస్తున్నది జన్మభూమి కమిటీలతో ఒక మాఫియాను తెచ్చారు. ఆ మాఫియాతో ప్రజలు ఆర్తనాథాలు పెడుతున్నారు. దేశంలో కనివిని ఎరగని అవినీతిని చూస్తున్నాం. రాష్ట్రాన్ని ఇవాళ కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు. 
– చంద్రబాబు పాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ..అవహేళన చేస్తున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను గమనించండి. ఇవాళ పిల్లాడిని స్కూల్‌కు పంపించాలంటే ఫీజులు బాదుడే బాదుడు. కాలేజీల్లో ఫీజులు విఫరీతంగా వసూలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అనే గొప్ప పథకానికి ఎగనామం పెట్టారు. 
– చంద్రబాబు పాలనలో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో అని వెతుకుంటున్నారు. పేదవారికి ఇల్లు లేవు. ఇంటి స్థలం లేదు. వర్షం వస్తే ఎలా బతకాలో అని భయంతో అల్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు అటకెక్కించారు. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు. పిల్లలను తాగుబోతులను చేస్తున్నారు. మట్టి,  ఇసుకను దోచుకుతింటున్నారు. రేట్లు చూస్తే అన్నీ కూడా పైపైకి పోతున్నాయి. పెట్రోల్‌పై పక్క రాష్ట్రం కంటే అదనంగా రూ.7 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు. రేషన్‌ షాపులో బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. వెలిముద్రలు పడటం లేదని కోత విధిస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలకు రుణాల మాఫీ లేదు. అందర్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదే.
– ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు కొత్త సినిమా చూపిస్తున్నారు. ఆ సినిమా పేరు ఏంటో తెలుసా? ‘‘ ఏమీ చేసినా ఎన్నికలకు ఆరు నెలల ముందు..నాలుగు నెలల కోసమే’’ ఇది చంద్రబాబు చూపిస్తున్నా సినిమా. చంద్రబాబుకు హఠాత్తుగా హాస్టల్‌లో చదివే పిల్లకు కోడికూర పెడతారట. చంద్రబాబు హయాంలో 60 వేల మంది ఇవాళ హాస్టల్‌లో ఉండలేక విద్యార్థులు బయటకు వచ్చారు. ఈ పెద్ద మనిషి పిల్లలకు కోడికూర పెడతారట. ఇదివరకే మధ్యాహ్నం భోజనం పెట్టే ఆయాలు కలిశారు. ఆరు నెలలుగా చంద్రబాబు బిల్లులు ఇవ్వడం లేదని చెప్పారు. ఈ మనిషేమో హాస్టల్‌లో పిల్లలకు కోడికూర పెడతారట. ఇవాళ స్కూల్‌ పిల్లలకు పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదు. కారణం ఏంటో తెలుసా..మన పిల్లలంతా గవర్నమెంట్‌ స్కూల్‌ మానేసి నారాయణ,చైతన్య వెళ్లాలంట. ఏమీ చేసినా చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు..నాలుగు నెలల కోసమే.
– ఇటీవల చంద్రబాబు అంగన్‌వాడీలకు వేతనాలు పెంచారట. ఇదే పెద్ద మనిషి అంగన్‌వాడీలను గు్రరాలతో తొక్కించారు. లాఠీలతో కొట్టించారు. జగన్‌ చెప్పారు కాబట్టి జీతాలు పెంచుతా అంటున్నారు. ఏమీ చేసినా ఎన్నికల కోసం ఆరు నెలల ముందు..నాలుగు నెలల కోసం. చంద్రబాబుకు నిరుద్యోగుల మీద ప్రేమట. కేవలం రూ.1000 ఇస్తారట. కేవలం పది లక్షల మందికి మాత్రమే ఇస్తారట. అది కూడా కేవలం నాలుగు నెలలు మాత్రమే ఇస్తారట. చంద్రబాబు సినిమా ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. 
– ఎన్నికలు రాగానే చంద్రబాబుకు రాగం, తాళం, పల్లవి మారుతుంది. డ్యాన్స్‌ చేయడం మొదలుపెడతారు. అయ్యయో మీకు పింఛన్లు రావడం లేదా? నాకు ఇప్పుడే తెలిపింది..వెంటనే మంజూరు చేస్తా అంటారు. అయ్యే ..మీకు రేషన్‌కార్డు రావడం లేదా? అధికారుల తోలు తీస్తా అంటారు. అంతటితో ఆగిపోడు..బియ్యం రావడం లేదా..అలాగా ఇంటికే బియ్యం పంపిస్తా అంటారు. ఏమీ చేసినా ఎన్నికలకు ఆరు నెలల ముందు..నాలుగు నెలల కోసమే. ఇల్లు లేదా..వెంటనే ఇల్లు కట్టిస్తా అంటారు. అంతటితో సినిమా ఆగిపోలేదు. ఇంకా సినిమా జరుగుతూనే ఉంది. తాగడానికి నీరు రావడం లేదా? అధికారులకు క్లాస్‌ పీకుతా అంటారు. ఆక్వా రైతులు నష్టపోతున్నారా? నేను కూడా రూ.2 కరెంటు ఇస్తా అంటారు. ప్రత్యేక హోదా రాలేదా? అయ్యేయో నాకు ఇప్పుడే అర్థమైంది. నేనే రంగంలోకి దిగుతా అంటారు. ఈనాడు దినపత్రి..చంద్రబాబు పాంప్లెంట్‌లో కడపలో స్టీల్‌ ప్యాక్టరీ కోసం టీడీపీ నేత నిరాహార దీక్ష చేస్తారట. ఆరు నెలల ముందు చంద్రబాబుకు కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కనినపిస్తుంది. చంద్రబాబు ఎప్పుడు మారడు. కుక్క తోక వంకర.
 ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి వేమన కూడా అన్నారు. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా రంగు మారదు. చంద్రబాబు నైజం కూడా మారదు. నాలుగేళ్ల ఈ పాలన చూశారు. ఎక్కడా చూసినా అబద్ధాలు, అవినీతి, అన్యాయం చూశారు. ఇలాంటి వ్యక్తులను పొరపాటున క్షమిస్తే..ఈ చెడిపోయిన వ్యవస్థ మారదు. ఈ వ్యవస్థలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలంటే జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు కావాలి. జగన్‌కు మీ అందరి అండదండలు కావాలి. ఈ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం రావాలి. 
– ఇలాంటి వ్యక్తులను పొరపాటున క్షమిస్తే..రేపు పొద్దున చంద్రబాబు ఏం చేస్తారో తెలుసా?..ఎన్నికల సమయంలో మీ వద్దకు వచ్చి మైక్‌ పట్టుకొని చిన్న చిన్న అబద్దాలు, మోసాలకు నమ్మరని చంద్రబాబుకు బాగా తెలుసు..కాబట్టి ఎన్నికల్లో చెప్పినవన్ని కూడా 98 శాతం పూర్తి చేశానని చెవిలో పువ్వులు పెడతారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా అంటారు. అయినా నమ్మరని చంద్రబాబుకు తెలుసు..కాబట్టి ఏమంటారో తెలుసా? కేజీ బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి బెంజి కారు కొనస్తా అంటారు. నమ్ముతారా? నమ్మరని ఆయనకు తెలుసు కాబట్టి..ప్రతి ఇంటికి తన మనిషిని పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. డబ్బులిస్తే మాత్రం వద్దనకండి. ఐదు వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి తీసుకున్నవే. కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం అబద్ధాలు ఆడేవారిని, మోసాలు చేసేవారిని బంగాళఖాతంలో కలిపేలా తీర్పు ఇవ్వండి. మీ మనసాక్షి ప్రకారం ఓట్లు వేయండి. ఇంతటి దారుణమైన చంద్రబాబు పాలన పోయి..రేపుపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తామన్నది నవరత్నాలు ప్రకటించాం. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడటమే నవరత్నాల ఉద్దేశం.
– అవ్వతాతలకు వయసు పెరిగే కొద్ది చిన్న చిన్న అవసరాలు పెరుగుతున్నాయి. మందులు కావాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. అవ్వతాతలకు పింఛన్‌ ఇవ్వాలంటే చంద్రబాబుకు మనసు రాదు. కాంట్రాక్టర్లు అడక్కపోయినా రేట్లు పెంచేందుకు మనసు వస్తుంది. కారణం ఏంటో తెలుసా? కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తురు కాబట్టి విఫరీతంగా అంచనాలు పెంచి దోచిపెడుతున్నారు.  అవ్వతాతల నుంచి లంచాలు రావు కాబట్టి పింఛన్లు పెంచడం లేదు. ప్రతి అవ్వా తాతకు చెబుతున్నాను. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్‌ వయసు 65 నుంచి 60 ఏళ్లకే తగ్గిస్తున్నాను. పింఛన్‌ రూ.1000 నుంచి రూ.2 వేలు పెంచుతాను. అంతేకాదు..ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ అక్కలు ఎలా బతుకుతున్నారో కళ్లారా చూశాను. ఒక్క వారం పనులకు వెళ్లడం మానేస్తే ఆ అక్కలుఇ ంట్లో పస్తులుంటున్నాను. ఇలాంటి అన్యాయమైన పరిస్థితిలో ఆ అక్కలకు చెబుతున్నాను. ఆ అక్కలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తానని చెబుతున్నాను. రాజన్న రాజ్యం వచ్చినప్పుడు ఏ కుటుంబం పస్తు పడుకునే పరిస్థితి రానే రాకుడదు. రాజన్న కలలు కన్న సువర్ణ యుగాన్ని తీసుకువస్తాను. నవరత్నాల్లో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే ఎవరైనా అర్జీలు ఇవ్వవచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, తోడుగా ఉండమని పేరు పేరున కోరుకుంటూ..ప్రతి ఒక్కరికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నా..
 
Back to Top