హ‌లో..హాలో..ర‌వ‌న్నా..బాగున్నావా?తూర్పు గోదావ‌రి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా త‌మ ఊరికి వ‌చ్చిన అభిమాన నేత‌తో త‌న భ‌ర్త‌కు ఫోన్ చేయించి సంబ‌ర‌ప‌డిపోయింది ఓ చెల్లెమ్మ‌. శ‌నివారం వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించింది. ఈ సంద‌ర్బంగా యండ‌మూరి ప్రియ‌ద‌ర్శిని అనే మ‌హిళ జ‌న‌నేత‌ను క‌లిసింది. ``జ‌గ‌న‌న్నా మీరు మా ఊరికి వ‌చ్చినందుకు సంతోషంగా ఉంది. మా ఆయ‌నకు మీరంటే ఎంతో అభిమానం. ఇప్పుడు ఆయ‌న వేరే ఊరిలో ఉన్నారు. మీకు విషెస్ చెబుతారంట అన్నా ఒక్క సారి మాట్లాడండి ప్లీజ్‌`` అంటూ  త‌న భ‌ర్త ర‌వి చేసిన ఫోన్‌ను జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు ఇచ్చింది. ఆయ‌న అంతే ఆప్యాయంగా రవితో మాట్లాడారు. దీంతో అక్క‌డున్న జ‌నం జై జ‌గ‌న్‌..జైజై జ‌గ‌న్ అంటూ నిన‌దించారు. 
Back to Top